‘నూతన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.


ఆధారాలు:
అడ్డం:
1. ఏలిక కొరకై సంధిపత్రం మధ్యభాగం సర్వత్రా వర్జింపదగిన దాని నడుమన చేర్చాలి. (4) |
5. లే మిసరబుల్స్ కర్త (2) |
8. అనుబంధానికి నిబంధన తలనరికి జతకలిపితే వచ్చెడి మొండితనము (4) |
10. చీము, దురదలతో కొంత ఏర్పడే జుగుప్స (3) |
12. తృణద్రుమంలో నక్కిన తేలు (2) |
13. జ్యోతిర్మయి చివర దేహము (2) |
14. వెనుదిరిగిన జాడ (2) |
17. పాతికలో ఓ ఐదు తగ్గించుకో (3) |
18. వెలుగు దారులలో నడచిన ఈ రచయిత్రి మా కుషస్సులు ఉంటాయంటున్నారు. (3,4) |
20. శుకమహర్షి పరీక్షిన్మహారాజుకు ఈ స్తోత్రాన్ని ఉపదేశించాడట. అంతకు ముందు ఇంద్రునికి విశ్వరూపుడు ఉపదేశించాడు. (4,3) |
22. ఎన్నార్ చందూర్ నడిపిన పత్రిక (3) |
24. లలిత ముందే ప్రేమను చూపిస్తోంది (2) |
25. మహాభారతము (2) |
27. పొంగు (2) |
28. పొగరు కోసం పకీరును సవరించండి. (3) |
30. రెడ్డి రాజుల రాజధాని (4) |
32. గుర్రపుగిట్ట ఆకుతో ఏలుబడి (2) |
33. చిలకమర్తి గారి నవలానాయకుడు (4) |
నిలువు:
2. బుద్ధి (3) |
3. అపరాధములో శ్రేష్ఠమైనది (2) |
4. మోతలేని పోపు (3) |
6. లంగోటి (2) |
7. సురులకు అడ్డం 1 (4) |
9. అవధానాలలో ఒక అంశము. సాధారణంగా సాల్వ్ చేయాల్సినది ఇక్కడ ఫిల్ చేస్తారు. (3,4) |
11. సంచికలో సాఫల్యం ధారావాహిక వీరిదే (4) |
12. చెట్టు (2) |
15. నేరేడు చెట్టు (2) |
16. గోన బుద్ధారెడ్డి, తాళ్ళపాక అన్నమాచార్యులు, కట్ట వరదరాజ భూపతి, బంకుపల్లె వెంకటరత్నమ్మల సామ్యము (3,4) |
19. అగ్గలికను కాస్త తగ్గిస్తే చీలిక (4) |
21. బాలవర్దిరాజు చూపించే కమాండ్ (2) |
22. లాలా లజపతిరాయ్ గర్భాన తోయరాట్టు (4) |
23. రోగం (2) |
26. ఫైన్, జరిమానా (3) |
27. చంద్రుడి బిగినింగులోనే పీడ (3) |
29. భూరుహములోని గరిక (2) |
31. కాగజ్ కే ఫూల్, చల్తీకా నామ్ గాడీ మొదలైన సినిమాలలో కనిపించిన నటి (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 జనవరి 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘నూతన పదసంచిక 44 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 జనవరి 15 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 42 జవాబులు:
అడ్డం:
1.భా 2. వ్యాకోచం 4. ర 5. సరిగ 7. సుషమ 9. రిబ్బకొ 10. తరిక 11. మగువ 14. మచ్చిక 17. విదేశీఖాతా 19. లాలాజలము 20. బాబాయి 22. టముకు 24. కరక 26. మధూళి 27. రివాజు 28. కట్టిక 29. త 30. హ్లాదిని, 31. ము.
నిలువు:
3.కోతికొమ్మచ్చి 5. సరిత 6. గరిక 7. సుధామ 8. మక్కువ 13. గవిని 14. మతాబా 15. కలాయి, 16. ప్రేముడి 18. శీఘ్రము 21. బావమరిది 22. టక్కరి 23. కురుజు 24. కళిక 25. కన్యక
నూతన పదసంచిక 42 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పాటిబళ్ళ శేషగిరిరావు
- రంగావఝల శారద
- శిష్ట్లా అనిత
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.
కోడీహళ్లి మురళీమోహన్ వ్యాసకర్త, కథకులు, సంపాదకులు. తెలుగు వికీపీడియన్. ‘కథాజగత్’, ‘సాహితి విరూపాక్షుడు విద్వాన్ విశ్వం’, ‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు’ అనే పుస్తకాలు ప్రచురించారు.
2 Comments
D V Mohan Rao
If I find errors after sending the puzzle ( నూతన పదసంచిక), can I resend it after correcting them before dead line.
Please clarify
కొల్లూరి సోమ శంకర్
Yes sir, if you can send revised version before the due date, it will be considered.