సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    Nanduri Krishna Mohan Rao

    ధనమూదమిదం జగత్ అన్నదే కారణం నాడైనా, నేడైనా, రేపైనా…
    గత శతాబ్దం మధ్యనాళ్ళ తరువాతి కాలం వరకు మన సమాజంలోని మహిళలు కేవలం గృహిణులుగానే తమ బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చేవారు… మగవారు మాత్రమే డబ్బు సంపాదించేవారు… నాటి కాలధర్మం అది… ఏ ధర్మమైనప్పటికీ ఆయా కాలాలకు అనుగుణంగానే ఆచరణకు స్వీకరించబడుతుంది.. ఒకవిధంగా డివిజన్ ఆఫ్ లేబర్ అన్న ఆధునిక సూత్రాన్నే అన్వయించాలి దానికి…
    ఒక్కో సమాజము ఒక్కో సూత్రాన్ని అనుసరించి ముందుకు సాగుతూ వచ్చింది… అతి ప్రాచీన సమాజం కావడాన మన సమాజంలో లోపాలు అధికంగా కనబడతాయి, అంతే…
    చరిత్ర అన్నది కంటికి బాగా కనబడుతుంది… తమతమ అనుభవాలు, భావజాలాలను అనుసరించి ఎవరికి కావలిసింది వారు తీసుకుంటారు చరిత్ర పుటలనుండి… చరిత్ర కనబడ్డంత స్పష్టంగా వర్తమానం కనబడదు… ఎందుకంటే వర్తమానం అన్నది అవిభాజ్యం.. అలాగే అది స్థిరమూ కాదు… కళ్ళు మూసి తెరిచే లోపే ప్రజెంట్ పాస్టుగా మారిపోతుంది… అలాగే ఫ్యూచరుకు సంబంధించిన క్షణం వర్తమానంగా మారిపోతుంది… అదో నిరంతర ప్రక్రియ… అదే కాలపురుషుడి మహిమ… మరుసటి క్షణం ఎలా ఉండబోతుందో ఆ క్షణం వరకు ఏమీ తెలీదు, మరుసటి ఘడియ ఎలా ఉండబోతుందో కూడా అంతే… అందుకే మనం చరిత్ర పుటలనే ఆశ్రయిస్తూ ఉంటాం వర్తమానంలో… అది బాగా తేలికైన వ్యవహారం కాబట్టి…
    ఇక్కడే ఓ విషయం గమనించాలి… పాతది అవుతోన్న కొద్దీ చరిత్రలోని అవలక్షణాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి… ఆ క్రమంలో దాని తాలూకు గబ్బు, దుర్వాసనలు మాత్రమే మిగులుతాయి… చాటడు బియ్యంలో చారెడు బెడ్డలు కనబడ్డట్టే అనుకోవాలి… ఎలా అయితే మన దృష్టి ఆ బెడ్డలు ఏరడం పైనే ఉంటుందో కాలపురుషుడి దృష్టి కూడా చరిత్రలో పేరుకుపోయిన, పోతోన్న గబ్బును వదిలించి, దుర్గంధాన్ని ప్రక్షాళన చేయడం పైనే ఉంటుంది…
    కాలపురుషుడంటే పైనుండేమీ ఊడిపడడు… పాస్టు, ప్రజెంటుల కలయికలోంచే ఉద్భవిస్తాడు.. సమీప భవిష్యత్తుని తనకు అనుగుణంగా మార్చుకునే ఉద్దేశంతోనే తనకు తోచిన, చేతనైన పద్ధతిలో మార్పులు, చేర్పులు చేసుకుంటూ పోతాడు… దానినే మనం తరాల వ్యత్యాసంగా చూస్తాం… పాత తరం స్థానంలో కొత్తతరం కుదురుకుని ముందుకు సాగే క్రమంలో జరిగే ప్రక్రియ అది… అంచేత, నిన్నటికి ఎప్పుడూ నేడు కొత్తే, నేటికి రేపూ అంతే.. సీనియరు తన జూనియరును ర్యాగింగ్ చేసినట్టే తను రేపటినాడు తన సీనియర్ చేతిలో ర్యాగింగుకు గురవుతాడు కదా… అలా అన్నమాట…
    నాడైనా, నేడైనా, రేపైనా లోకానికి డబ్బే ప్రధానం… సృష్టిలోని ప్రతి జీవి తన ఆహారం ఎలా సంపాదించుకోవాలి అన్నదానిపైనే దృష్టి పెడుతుంది… ఆ క్రమంలో మరో జీవిపై దాడికీ ప్రయత్నిస్తుంది.. ఆ క్రమంలోనే స్వీయ రక్షణ అన్నది రంగప్రవేశం చేస్తుంది… మనిషి అన్న జీవి కాలక్రమంలో సంస్కరించబడుతూ వస్తున్నాడు కాబట్టి ఆహార సముపార్జన, స్వీయ రక్షణల వద్దనే ఆగక మరిన్ని ప్రాధామ్యాలను పోగు చేసుకుంటూ వస్తున్నాడు… అందులో భాగంగానే కుటుంబము, కుటుంబ జీవనము, సంఘము, సంఘ జీవనము అన్నవాటిని ఏర్పరుచుకున్నాడు… క్రమంగా వాటిని సవ్యంగాను, తను తలపోసినట్టుగాను నిర్వహించడానిగ్గాను కొన్ని పద్ధతులు ఏర్పరుచుకున్నాడు.. కాలక్రమంలో అవే ఆచారాలుగాను, సంప్రదాయాలుగాను రూపుదిద్దుకున్నాయి…
    మానవుడి కోరికలు అనంతం అంటుంది అర్థశాస్త్రం… వాటికి అనుగుణంగానే వ్యక్తుల్లో అంతరాలు ఏర్పడుతూ వచ్చాయి… కుటుంబం అయితేనేమి, సంఘం అయితేనేమి, సమాజం అయితేనేమి వ్యక్తి మూలకంగా ఏర్పడేవే కావున అవే అంతరాలు వాటికీ సోకుతూ వచ్చాయి… అవసరాలు, అత్యవసరాలు, సౌకర్యాలు, విలాసాలు, విపరీతాలు వగైరాలుగా చెప్పుకోవచ్చు వాటిని… ఒకరికి సౌకర్యాలుగా అనిపించేవి మరొకరికి అవసరాలుగా అనిపించవచ్చు, విలాసాలదీ అదే తీరు… అయితే ఎవరికైనప్పటికీ అత్యవసరమైనది డబ్బు మాత్రమే… అదే లేకుంటే మిగతావి ఏవీ నెరవేరవు…
    అప్పట్లో పురుషాధిక్యత అయినా, ఇప్పట్లో మహిళా సాధికారత అయినా, చట్టాలు, సామాజిక వ్యవస్థల్లో వస్తోన్న మార్పులైనా ఆ డబ్బు ఆధారితంగానే ఏర్పడ్డాయి, ఏర్పడుతున్నాయి…
    గత శతాబ్దం ప్రథమార్ధం వరకు కేవలం పురుషుడు మాత్రమే బ్రెడ్ ఎర్నర్ మన సమాజం వరకు వస్తే… అంటే డబ్బు సంపాదించే బాధ్యత తనే తీసుకోవాల్సి వచ్చేది.. అందుకే అతగాడి మాటే శాసనంగా నిలిచేది… ఆ క్రమంలో ఆధిపత్య ధోరణీ ఉండేది… అంత అవసరార్థమే తప్ప ఎవరూ ఎవరికీ తల ఒగ్గరు… ఆ మాటకొస్తే ఏ జీవీ కూడా చేయదు ఆ పని…
    ఏ సామాజిక థియరీ అయినప్పటికీ పూర్తి ఫూల్ ప్రూఫ్ కాదు… భౌతిక శాస్త్రాలు చదువుకున్నవారికి అబ్స్ట్రాక్ట్ థియరీల గురించి పెద్దగా తెలీదు.. తరాలు మారుతున్న క్రమంలో అవీ మారుతూ వస్తాయి… ఆ క్రమంలో పాత తరానికి కొత్త తరం పోకడలు విపరీతంగాను, వికృతంగాను అనిపిస్తే, కొత్త తరానికి పాత తరం తీరులు అనాగరికంగాను, అరాచకంగాను అనిపిస్తాయి…
    ఇదో నిరంతర ప్రక్రియ… ఏ తరానికి చెందినవారైనా “మా రోజుల్లో అయితే…” అంటున్నారంటే కాలపురుషుడు తన పని తను సవ్యంగా చేస్తున్నాడనే అర్థం… అలాగే ఏ తరానికి చెందిన వారైనా నవతరంతో కలవడం అంత ఈజీ కాదు… కొందరు సర్దుకుపోతారు, కొందరు పోరు… అలా పోనివారిలో కొందరు లాగానాం పీకానాం వంటివి చేపడుతూ ఉంటారు…
    మీ కథలోని పంకజం కూడా ఆ బాపతే… పాపం ఆవిడకు తెలీనిదేమంటే ఇంకా ఆమె అక్కడే ఉన్న సంగతి… తన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో మారిపోయింది, ఇంకా మారిపోతోంది అన్న సంగతి… ముందుకు సాగిపోతోందన్న సంగతి…
    అత్తా ఒకింటి కోడలే అన్న సత్యం గ్రహిస్తే ఏ తంటా ఉండదనేవారు ఒకప్పుడు… అయితే మారిన ఈ కాలంలో కోడలూ ఎప్పుడో ఒకప్పుడు అత్తగా మారక తప్పదన్న సత్యాన్ని గ్రహించాలి కొందరు… ముఖ్యంగా పంకజం వంటివారు…

    Reply
  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    “పతి పాదాలు” కథ చాలా బాగుంది..చదువుతున్నంతసేపూ నవ్వుకుంటూనే ఉన్నాను.కథ అప్పుడే అయిపోయిందా, ఇంకా ఉంటే బాగుండు అనిపించింది. పంకజం లాంటి వాళ్ళు అన్యాయంగా మగవాళ్ళని ఆడిపోసుకుంటారు గానీ, అసలు స్త్రీవాద రచనలను వెలుగులోకి తీసుకువచ్చింది పురుష సంపాదకులు, వాటిని చదివి ప్రోత్సహించేది పురుష పాఠకులూనూ! ఆడవాళ్ళని వెనకేసుకొచ్చి, రక్షణ పేరుతో మగవాళ్ళని చావగొట్టి చెవులు మూసేది మగ పోలీసులే!…..(.సినిమాల్లో ఎక్కువగా పతి పాదసేవ చేసేది అంజలీదేవి అంటే ఒప్పుకుంటాను గానీ సావిత్రి అంటే ఒప్పుకోను…”దీపావళి” సినిమాలో సత్యభామ గా వీరరసం చూపించింది కదా!)

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®