[డా. సి. ఉమా ప్రసాద్ గారి ‘ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం’ అనే ఫీచర్ అందిస్తున్నాము.]
‘ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం’ అనే అంశము గూర్చి చర్చించినపుడు తొమ్మిది మంది వాగ్గేయకారులలో ఒకే లక్షణాన్ని అందరిలోను నేను గ్రహించాను. వాగ్గేయకారుల తల్లిదండ్రులు, ముత్తాతలు వీరందరూ కూడా శాస్త్ర కోవిదులు. వారి సంతతి కూడా శాస్త్ర నిష్ణాతులు; పండితులు కావడం, అలాగే వారిలో కళకు ప్రేరణ కలగటం, ఆ ప్రేరణ కలలో యోగుల మూలంగా గాని, ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని వారిలో యుండే మణిని వెలికితీసి సానబెట్టి, ప్రకాశవంతం చెయ్యడం, అలాగే వారు ఒక క్రమ పద్ధతిలో పండితులు అంటే అన్ని విభాగాలు జ్యోతిష్, వ్యాకరణ, సంగీత, సాహిత్య, వేదాంత ఇలా అన్ని రంగాలలో నిష్ణాతులైన వారి వద్ద విద్యను అభ్యసించి, దానిని వారి శక్తి, సామర్థ్యాలనుగుణంగా మలచుకొని, వారి ఇష్ట దేవతాస్తుతి గాని లేక నరస్తుతి చేయడం గాని వారి వారి రచనా శైలిలో మనకి ఆ రచనా వైవిధ్యం గోచరిస్తుంది.
ఇంకొక గమనిక:
ఒక వాగ్గేయకారునికి, మరొక వాగ్గేయకారుని మధ్య లక్షణకారుల గ్రంథములు వచ్చాయి. ఆ గ్రంథాలలోని విషయము ఆ వాగ్గేయకారునికి సంబంధితాంశంగా వుండడం జరిగింది. ఉదాహరణకి భరతుని నాట్య శాస్త్రము – జయదేవుని గీత గోవిందం – రెంటికీ సంబంధం వుంది.
తన భార్య పద్మావతీ దేవి నాట్య విన్యాసమే తన గ్రంథానికి మూలం అని జయదేవుడు నొక్కివక్కాణిస్తాడు.
అలాగే చాలామంది వాగ్గేయకారులకు, గ్రంథకర్తల గ్రంధాలకు సమన్వయ సంబంధం వుంటుందని మనకు తెలుస్తుంది. ఆనాటి రచనలు లిపిబద్ధం కాకపోవటం, ఎవరి శైలిలో వారు రచనలు సాగించటం జరిగింది. వాటికి కారణాలు చాలా ఉండవచ్చు. సరియైన భద్రత కల్పించే సంఘాలు లేకపోవటం గాని, సరియైన ఎక్కువ మంది శిష్యు, ప్రశిష్యులు లేకపోవటం గాని, ఆ నాటికి లిపి తెలిసిన, వ్రాయుటకు అవకాశం, ఆస్కారం లేక పోవటం గాని, లేక దానిమీద వారికి శ్రద్ధ లేకపోవటం గాని, కారణం ఏదైనా అవచ్చు. కాని ఇప్పటికి కొంతమంది రచన శైలిని, వారి, స్వర, సంగీత, లయ విన్యాసాలని లిపిబద్ధం చేసి, మనకందించిన సంగీత, సాహిత్య సేవ చాలా గొప్పది. ఈ నాటికి వారి రచనల యొక్క సంగీతం చిరస్థాయిగా ప్రజానీకంలో ఇంకా గోచరిస్తుందంటే, అది గొప్పతనమే కాని మరి ఏది కాదు.
అలా వారు ఇప్పటి తరం వారికి సంగీతంలో పేరు ప్రతిష్ఠలు తెప్పించి పెడుతున్నారు. చక్కటి గాత్ర సంపదలతో, అర్థ సాహిత్యాలతో, మంచి సాంప్రదాయ బాణిలో తమకంటూ ఒక రకమైన ఫణితిని ఏర్పరుచుకున్న ఇప్పటి మహా మహా విద్వాంసులందరికీ ఈ సంగీతము వారి ఆర్థిక సమస్యను తీరుస్తూ, మోక్ష ప్రదంబైన మార్గాన్ని చూపిస్తూ, వారికి సంగీత భిక్ష పెట్టుననుటలో ఎలాంటి సందేహము లేదు అని అనిపిస్తుంది నాకు.
ఈ రచనలో ప్రస్తావించబోయే అంశాలు:
(ఇంకా ఉంది)
డా. సి. ఉమా ప్రసాద్ గారు పుట్టింది, పెరిగింది రాజమండ్రి. వారి స్థిర నివాసం హైదరాబాద్. తల్లి తండ్రులు – కీ.శే: M.V. రంగా చార్యులు, M. ప్రమీలా దేవి. అత్తామామలు: కీ. శే.డా. సి. ఆనందా రామం, శ్రీ రామా చార్యులు. భర్త: సి. బదరీ ప్రసాద్(రిటైర్డ్ సీనియర్ మేనేజర్ ఆంధ్రా బ్యాంక్). ఉమా ప్రసాద్ ఉపాధ్యాయురాలిగా (M A ఎకనామిక్స్ ఆంధ్రా యూనివర్సిటీ) పని చేశారు. వారి ప్రవృత్తి సంగీతాభిలాష (పిహెచ్డి ఇన్ మ్యూజిక్ పద్మావతి మహిళా యూనివర్సిటీ). భావ కవితలు, స్వీయ సంగీత రచన, రాగల కూర్పు, పుస్తక పఠనం వారి అలవాట్లు. వివిధ సంగీత పత్రికలలో- సంగీత రచన వ్యాసాలు మరియు కవిత్వ ప్రచురణాలు, లక్ష గళార్చన ప్రశంసా పత్రం, తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో కవిత్వ ప్రచురణ పురస్కారాలు. గురువులు: విజయవాడ సంగీత కళాశాలలోని అధ్యాపకులైన అందరి గురువులు, శ్రీమతి రేవతి రత్న స్వామి గారు మొట్టమొదటి గురువు- తదనంతరం పెమ్మరాజు సూర్యారావు గారు, MV రమణ మూర్తిగారు, కిట్టప్పగారు, అన్నవరపు రామస్వామి గారు, డా. నూకల చిన సత్యనారాయణ గారు. తదితరుల ఆశీస్సులతో సంగీతంలో ఓనమాలు దిద్దుకొని సంగీతంలో పిహెచ్డి పట్టా పొందారు. “మహా సముద్రంలో ఒక నీటి బిందువు నా సంగీత -కృషి” అంటారు. మధుర గీతికలు (రెండు భాగాలు), రస గాన లహరి, స్వర అమృతవాహిని, హనుమ కీర్తనల సమాహరం, చైతన్య భావ కవితామాలికలు, రాగరంజని (రెండు భాగాలు), భావ-రాగ-లహరి (రెండు భాగాలు), కవితామృతఝరి అక్షర తరంగిణి, అపురూప-అపూర్వ-రాగలహరి వంటి పుస్తకాలను వెలువరించారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
అమ్మణ్ని కథలు!-18
అద్వైత్ ఇండియా-34
తొలగిన తెరలు-2
కనిపించని కంచెలు
2023 ఉగాది కవిసమ్మేళనం – ప్రెస్ నోట్
సంతకం
మట్టి పరిమళం
ఫస్ట్ లవ్-15
ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-12
అందుకే దూరం పెరిగింది
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®