చెట్లు ఏళ్ళకి ఏళ్ళు పచ్చగా చిగురిస్తూనే ఉంటాయి హృదయాలు వయోపరిమితి వదిలి స్నేహిస్తుంటాయి మనసు పుష్పక విమానమై సహచరులకు చోటిస్తుంటుంది నెయ్యపు మమకారాన్ని సదా ఆస్వాదిస్తూ ఉంటుంది
స్నేహపురధం మిత్రుల నవ్వులయాత్రలా సాగుతుంటుంది నేస్తాలు నిత్యపరిమళ హృదయాలతో గుబాళిస్తుంటారు సరదా సరాగాలై ఆహ్లాద శృతితో సహచరునలరిస్తుంటారు చెలిమి కలిమితో వాత్సల్య సుగంధాన్ని శ్వాసిస్తుంటారు
బతుకు పుస్తకంలో మిత్రత్వ మొక్కటే మధుర వాక్యం మైత్రీ లత తీగె సాగి సన్నిహితమై నిలవడం అపురూపం ఎదలోపలి ఆపేక్షా మధురఫలాలను పంచడమొక భాగ్యం అర్హమైన ఆత్మీయులు దొరకడమే అసలైన పెద్ద వరం!
అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, మూడు నవలలూ,రెండు కవిత్వ సంకలనాలూ,ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు. APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
Yes Madam, friendship is greater than any relationship. Written well and Excellent expressions.
Friend ship feelings are sweet memories. Friend ship feelings are enjoyable and supports when ever you need. Your’s chitty
“నెయ్యపు మమకారం… పరిమళభరితం” ఎంత అందంగా చెప్పారో!… కవయిత్రి కి అభినందనలు…
“నెయ్యపు మమకారం… పరిమళభరితం…”. ఎంత అందంగా చెప్పారో! కవయిత్రి కి అభినందనలు…
ఆహా…అద్భుతమైన మీ సాహిత్యం ఇంకా మధురం అండీ👏👏
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™