శుభోదయంతో స్వాగతించి,
శుభరాత్రితో ముగించడమే,
దినచర్య కాజాలదు ఏ నాటికీ..
పునః పరిశీలన అవసరం-
ఈ నిరంతర పయనానికి!!
సాగుతున్న కాలగమనంలో
నిన్న అనే గతం తిరిగి రానిదైనా-
వర్తమాన పయనానికి..
అదో అమూల్య అనుభవం
భవిష్య ప్రణాళికలకు లభించిన, అపురూప అవకాశం!!
నిన్నటి దినచర్యలో తారసిల్లే,
మంచిని ఆనందంగా ఆహ్వానించి..
చెడును ఆమడదూరం తరిమితే,
అది మంచిజీవితమనే భవంతికి,
ఏర్పరుచుకున్న స్వీయ పునాది!!

సాగర్ రెడ్డిగారి పూర్తి పేరు పెనుబోలు విద్యాసాగర్ రెడ్డి. స్వంత ఊరు నెల్లూరు జిల్లా, నెల్లూరుపల్లి కొత్తపాళెం గ్రామము. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్య నెల్లూరుపల్లి కొత్తపాళెంలోని ప్రాదమిక మరియు జిల్లాప్రజాపరిషిత్ పాఠశాలలో పూరి చేశారు. ఎన్ బి కె ఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ నుంచి బికాం వరకు చదివారు. చెన్నై లోని విక్కీ ఇండస్ట్రీస్‌లో మార్కెటింగ్ విబాగంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నారు. కవితా రచనలు ప్రవృత్తి. ఇప్పటి వరకు 400 కవితలు రచించడం జరిగింది.