సంచికలో తాజాగా

2 Comments

 1. 1

  ఇలపావులూరి పద్మనాభుడు

  చాలా చక్కటి విశ్లేషణ. కొత్తకోణంలో.. తర్కబద్ధంగా.. సాగింది. సారస్వతం లో .. ప్రక్షిప్తాలు సాధారణమే అనుకున్నా.. అవి మూల కావ్య సమగ్రత- శిల్పం- సందేశాలను మరింత శోభస్కరం గా మార్చేలా ఉంటే ఏ గొడవాలేదు. ఇలా మూలకావ్య ప్రాథమిక లక్షణాలనే తృణీకరించేలా.. కొండొకచో మూల కావ్య ఔచిత్యాన్నే దెబ్బతీసేలా ఉండటం విచారకరం..

  అసలు.. ఇప్పుడు/ గతంలోనూ.. సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తెలిపే ప్రతి మూల కావ్యాన్ని.. ఏదో ఒక రూపంగా అవహేళన చేస్తూ.. అవన్నీ అసంబద్ధాలని.. వేల ఏళ్ళుగా కొన్ని వర్గాలను అణగదొక్కారనేందుకు ప్రబల సాక్ష్యాలని వితండంగా వాదించే వారంతా.. మీలా హేతుబద్ధంగా ఆలోచించి, మంచి చెడులను నిష్పక్షపాతంగా విమర్సిస్తే.. వ్యాఖ్యానిస్తే ఎంత బాగుండును?.. కనీసం కొందరైనా..మీ ఈ విశ్లేషణతో నైనా తమ ఆలోచనాధోరణులను సరైన దారిలో పెట్టే యత్నం చేస్తారని, చెయ్యాలని ఆశిస్తున్నా.. మీ కృషి కొనసాగించండి..

  Reply
 2. 2

  సిహెచ్.సుశీల

  వాల్మీకి…. రాముడు… ధర్మం… శూద్రులు.. నిషాదులు.. తపస్సు గురించి చాలా వివరంగా చెప్పారు ఈ వారం. చాలా ధన్యవాదాలు.
  ఉత్తర రామాయణం ప్రక్షిప్తమే అన్న వాదన జరుగుతూ ఉన్నా ఆనాటి ( భవభూతి) నుంచి, సంస్కృతాది భాషలన్నిటిలో నేటి (త్రిపురనేని) (శంబూకవధ)వరకు అనేక ఉత్తర రామాయణాలు వస్తూనే ఉన్నాయి, అలరిస్తూనే ఉన్నాయి. అందలి కరుణరసం గొప్పతనం అది అనుకొంటా. కానీ ధర్మం.. రాముడు… శంభూక వధ దగ్గరకు వచ్చే సరికి “సహేతుకంగా” మీలాంటి కొందరు చర్చ ద్వారా నిరూపించ ప్రయత్నిస్తున్నారు. ఇది చారిత్రక అవసరం.
  శబరి ఎంగిలి పండ్ల వృత్తాంత కల్పన కవయిత్రి మొల్లది కదా.

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: