సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    సూర్య నండూరి

    చాలా బాగా వివరించారు ఈ కొత్త రావణాయనం గురించి. ఇటువంటి సినిమాలు హైందవ సమాజానికి చాలా ప్రమాదకారులు. మన యువత ఇప్పటికే రకరకాల నాగరికతల ప్రభావాలతో తప్పుదారి పడుతున్నారు. ఇలాంటి సినిమాల వలన మన ఇతిహాసాల పట్ల తప్పుడు అవగాహన కలుగుతుంది వాళ్లకి. మీరు మీ విశ్లేషణలో భాగంగా మనవాళ్ళందరికీ సినిమాలు చూసి ఇతిహాసాలు పురాణాలు నేర్చుకోవద్దని సూచించండి.
    సూర్య నండూరి.

    Reply
  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    ఇన్ని తప్పుల తడకగా ఉన్న కథని చూస్తే అసలు కథా (సినీ) రచయిత వాల్మీకి రామాయణం చదివాడా! అని అనుమానం కలుగుతుంది….1976 లో బాపు గారి “సీతాకల్యాణం” తర్వాత పౌరాణికాలకు కాలం చెల్లిందనే చెప్పుకోవాలి…”దానవీరశూర కర్ణ (1977)” వచ్చినప్పుడు మా అన్నయ్య ఫ్రెండ్స్ “ఈ సినిమా చూస్తుంటే పాండవులే దుర్మార్గులేమో అనిపిస్తుందిరా!” అనేవాళ్ళు..అప్పుడు నాకు పదేళ్లు, సినిమాల గురించి తెలియదు..ఇప్పుడు చూస్తుంటే ఆ మాట అక్షరాలా నిజం అనిపిస్తుంది..అలా పాత్రలన్నీ వక్రీకరించారు అందులో.. ఇక ఇప్పుడు వచ్చే వాటి గురించి అవేదన పడటం అనవసరం..ముందు తరాల వారు ఇవే నిజం అనుకోవటానికి ఇలాంటివి పట్టుపని పదిరోజులు కూడా ఆడవు…

    Reply
  3. 3

    Nanduri Krishna Mohan Rao

    “Alternative history” అన్నది కూడా ఒక విధమైన సినీ కథాప్రక్రియ… దానికి అంతర్జాతీయ స్థాయి ఆమోదం కూడా ఉన్నది… కాకపోతే ఆ మేర ఒక వివరణ ఇస్తే బావుండేది మా కోణంలోంచి తీసాము ఈ చిత్రాన్ని అని…

    అంతే కాక ఇప్పుడే చెప్పలేము రెండో భాగంలో ఏమి చూపించాడో దర్శకుడు అన్నది చూడకుండా… తమ సినిమాకు ఒక విధమైన ప్రచారం తీసుకురాలన్న వ్యూహంతో కూడా చేసి ఉండొచ్చు అలా…

    ప్రముఖ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ క్వెంటిన్ టారంటినోనే తీసుకుంటే ఓ రెండు బ్లాక్ బస్టర్లను తీశాడు ఇదే పద్ధతిలో (రెండో భాగం విడుదల కాకుండా ఇదే పద్ధతి అని చెప్పడం కూడా కష్టం)… తను తీసిన “ఇన్ గ్లోరియస్ బాస్టర్డ్స్” చిత్రంలో వాస్తవాలను పూర్తిగా మార్చి చూపాడాయన… చరిత్ర ప్రకారం హిట్లరు తనకు తను కాల్చుకుని చనిపోయాడు… ఆ సంగతి అందరికీ తెలిసిందే… కాని తన చిత్రంలో వాస్తవానికి విరుద్ధంగా హిట్లర్ ను ఒక యూదు యువతి తన కుటుంబానికి నాజీలు చేసిన ద్రోహాన్ని మనసులో ఉంచుకుని అందుకు ప్రతీకారంగా తను నిర్వహించే ఓ సినిమా థియేటరులో ప్రీమియర్ కాబోతోన్న గోబెల్స్ ప్రాపగాండా చిత్రం ప్రదర్శన సందర్భంగా ఒక పథకం వేసిమరీ హతమార్చినట్టు చూపుతాడు క్వెంటిన్ టారంటినో… అలాగే తన మరో చిత్రం ‘ఒన్సపాన్ ఎ టైం ఇన్ హాలీవుడ్” అన్న దాంట్లో కూడా చారిత్రక ఘటనలని పూర్తిగా మార్చి చూపుతాడాయన… “షరాన్ టేట్” అనే ఒక హాలీవుడ్ అమెరికన్ నటి వాస్తవానికి హత్యకు గురికాబడుతుంది 1969 లో… “అలా కాక మరోలా జరిగి ఉండుంటే ఎలా ఉండేది” అన్న కోణంలోంచి తన చిత్రాన్ని తీసిన క్వెంటిన్ ఆమె హత్యకు గురికాలేదని చూపిస్తాడు… అంటే వాస్తవ పాత్రలను, వాస్తవ ఘటనలను కథాంశంగా తీసుకుంటూనే ఆ ఘటనలను పూర్తిగా మార్చి చూపుతాడు…

    నితీష్ రామాయణాన్ని కూడా ఆ కోణంలోంచే తీసుకోవచ్చు… కాకపోతే హిందువుల మత విశ్వాసాలకు సంబంధించిన అంశం కావడాన కొంత అలజడి సృష్టిస్తోంది ఇది..

    ఇక రామారావు చిత్రం “దానవీరశూర కర్ణ” విషయానికి వద్దాం… ఆయనేమీ చరిత్రను వక్రీకరించే పని చేయలేదు తన చిత్రంలో… కేవలం దుర్యోధనుడి మదిని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు ఆ పాత్రకు కొంచెం నాటకీయతను జోడించి… దుర్యోధనుడు తను తీసుకున్న స్టాండ్‌ని సమర్ధించుకునే ప్రయత్నం చేయించాడు దుర్యోధన పాత్ర ద్వారా… ఆ క్రమంలో తన నటనా ప్రదర్శనకు ఒక అవకాశం కల్పించుకున్నాడు… అలాగే తనే వేసిన శ్రీకృష్ణ పాత్ర ద్వారా దుర్యోధనునికి ఎంత గడ్డి పెట్టాలో పెట్టాడు కూడా… ఆ సంగతి విస్మరించరాదు ఎవరమూ కూడా…

    నాడు రామాయణ విషవృక్షం అని రాసింది రంగనాయకమ్మ గారు… ఏమి జరిగింది… రాముడికి ఎటువంటి నష్టం జరిగింది… రాముడ్ని కొలవడం మానుకుందా తెలుగు సమాజం…

    ఇట్నించి కాకుంటే అట్నించి నరుక్కురమ్మన్నారు పెద్దలు… నేటి జనరేషనుకు ఉన్నది ఉన్నట్టు చెబితే నచ్చకపోవచ్చు… ఒక డాక్యుమెంటరీలా అనిపించొచ్చు… అందుకే కొత్త పద్ధతిలో తీసి ఉండొచ్చు దర్శకుడు… అయినప్పటికీ రావణుడు సీతను ఎత్తుకుపోయినట్టే చూపాడు కదా… సీతమ్మ తనంత తనే రావణుడితో వెళ్ళిపోయినట్టు చూపలేదు కదా…

    ఎన్నో కాలపరీక్షలకు నిలిచిన పురాణకథలు ఇటువంటి పాక్షిక సత్యాలతో కూడిన కథలకు నిలవలేవా… తన చిత్రం ద్వారా దర్శకుడు రామాయణాన్ని సజీవంగా ఉంచినట్టే భావించాలి మనం…
    ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాముడు హీరోగానే మిగులుతాడు… రావణుడు తప్పు చేసినవాడిగానే గుర్తుండిపోతాడు… మత విశ్వాసాలు అనేవి ఉడత ఊపులకు ఒక్కనాటికీ బెదరవు… చెక్కుచెదరవు..

    అంచేత నితీష్ రామాయణాన్ని దానికి ప్రపంచవ్యాపిత ప్రచారం కల్పించిన వస్తువుగానే భావించాలి…

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జె. చెన్నయ్య గారి స్పందన: * చాలా సునిషితమైన విశ్లేషణ. సినిమా ఎంత దుర్మార్గంగా రూపొందిందో సోదాహరణంగా ఏకి పారేశారు. ఇలాంటి సినిమా భారతీయ సమాజానికి, పురాణ వాంగ్మయానికి ఇంత విఘాతం కలిగిస్తుంది చెప్పారు. చాలా చాలా అభినందనలు సంతోష్ గారు.*

    Reply
  5. 5

    Geetha Krishna.Chv

    Goppa visleshana.Manasuku badha kalugutunnadi elanti vakreekara vankara cinemalatho.Ikkada pettubadi mariyu raabadi sootram matrame panichestundi.Sagatu hinduvu manobhavalku viluvaledu.

    Reply
  6. 6

    Aswin

    నమస్కారం సర్
    ఎంతో విపులంగా వ్రాసారు. మనసారా కృతజ్ఞతలు మీకు …
    ఇప్పుడైనా మన ప్రేక్షకులు గ్రాఫిక్స్ మాయ లో పడక. నిజం ఏమిటో గ్రహిస్తే మీ కష్టం ఫలితం ఇస్తుంది. పురాణాలు కేవలం కవుల మనోభావాలు కావనీ, అందులో ఎంతో నిగూఢంగా అంతఃకరణ వ్యక్తీకరణ ఉంటుందని, మన వాళ్ళు గ్రహించాలి. మానవుల లోని సాత్విక రాజస తామసిక గుణాలని వాటి ఉద్ధరణ నీ చెపుతాయి మన పురాణ ఇతిహాసాలు. అవి కథలు కావని మన ఘన చరిత్ర అని మనం గుర్తు పెట్టుకోవాలి. ఐతే, మీరన్నట్లు, ఇలాంటి వక్రీకరణ సినిమాలు మన బుద్ధి ని ఉద్ధరించడం కాకుండా మంద బుద్ధులని చేస్తాయేమో.
    నా ఉద్దేశంలో విషయ పరిజ్ఞానానికి విజ్ఞానానికి తేడా తెలుసుకుంటే మన భారతీయులు ఇంకా ప్రగతి సాధిస్తారు. అలా కాకుండా పై పై హంగులకోసం రంగుల కోసం తాపత్రయ పడి అమరమైన మన చరిత్రని మనమే పక్క త్రోవ పట్టించుకుంటాము.

    Reply
  7. 7

    Hari

    Chala chakka ga vishelshincharu, idi andariki reach ayyela anni platforms lo share cheyyandi

    Reply
  8. 8

    Rahul

    సినిమా చూసినపుడు నాకు ఏ ఏ అంశాలు తప్పుగా అనిపించాయో సరిగ్గా అవే అంశాలు మీరు కూడా రాసారు.ప్రతి అక్షరం నిజం..ఇది రావణాయణం రామాయణం కాదు..రామాయణాన్ని వక్రీకరించి తీసిన నీచమైన చిత్రం..ఈ సినిమా రావణాసురుడు,సూర్పనఖ చూసినా ఆశ్చర్యపోతారు మేమింత మంచి వాళ్ళమా అని..ఒక్క vfx క్వాలిటీ తప్ప మిగతా సినిమా అంతా చెత్త

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®