యౌవనపు మజిలీవద్ద రెండు పరిచయాలుఎవరో తెలియని ఇద్దరు… ఒక నువ్వు, ఒక నేనూ
వయసు విసిరిన వలపు వలబిగిసి బిగిసి మనలను దగ్గరకు లాగేసిందితనువులలోని మన ప్రత్యేకతతమకాన్ని చుట్టూరా మెల్లమెల్లగా నింపేసింది
పరిచయంమాటల ముచ్చట్ల నడకలతోఇష్టంగా ఓ చిరు మొగ్గతొడిగితేఆ ఇష్టం,అభిప్రాయాల అభిమానపు పరుగులతోప్రణయమై నిండుగా విరబూసింది
నీ సహచర్యపు సహకారంతోభద్రమయ్యే నా భవిష్యత్తు బాటలోబాంధవ్యపు ముచ్చటైన ముడితోముందుకు సాగేందుకు నేనాలోచిస్తూంటేప్రణయం పరిణయమయ్యే ప్రయత్నాలు చేస్తుంటే
మన తనువుల కలయికకేనీవు తహతహలాడుతుంటావుశారీరక సుఖాస్వాదనకేఅనుక్షణం ఆత్రంగా ఆరాటపడుతుంటావుగట్టిగా గదమాయిస్తేబాధ్యతగా ఉండేందుకు బాసలు చేస్తావు
నిన్ను నమ్మానా ?
నాతో ఆడుకుని,నీ వేటగా నన్ను వాడుకునినీ బరువు దింపేసుకుని,నాలో వంపేసుకునిబరువూ బాధ్యత నాకప్పచెప్పేసిబేఫర్వాగా నీదారిన నీవెళ్ళిపోతావు
ప్రకృతికెప్పుడూతన సంతును పెంచుకునే చింతే కదాకడుపున పెట్టుకుని కాయమని సెలవిస్తుందిక్రమంతప్పని నెలసరినీ తప్పిస్తుంది
సవతి ప్రేమ చూపే సంఘానికినేనంటే ఎప్పుడూ ఎనలేని అలుసే
ఒకే కార్యానికి కర్తలయిన మన ఇద్దరిలోనిన్ను ‘మగ మహరాజు’ను చేసికాళ్ళుకడిగి నెత్తిన నీళ్ళుజల్లుకొంటే…బలయిపోయిన నన్నుబరువునెత్తుకున్న నన్ను,కాలు జారానని,కట్టుబాటు మీరాననీకత్తిగట్టేందుకూ…కర్కశంగా శిక్షించేందుకుకొరడా పట్టుకుని సిద్ధంగానే ఉంటుంది
మగాడా !అందుకే నా జాగ్రత్తలో నేను…నీకూ నాకూ మధ్య ఓ రెండడుగులు ఎడంకనీసం మన పెళ్ళయ్యేంతవరకైనా…!
చౌడారపు శ్రీధర్ చక్కని కవి. దీర్ఘ కవితలు వెలయించటంలో దిట్ట.
చాలా చక్కగా రాశారు. ఏడడుగుల దూరం కలిసి నడిచే దాకా రెండడుగుల దూరం అవసరమే.
ధన్యవాదాలు వెంటేశ్వరన్ గారూ…
మిత్రమా చక్కని కవిత. నాదో సందేహం. సాహచర్యం సరైనదేమోనని. ప్రకృతీకెప్పుడూ తన సంతు అన్న పాదం …చాలా ఆవేదన, బాధ్యతాయుత స్పందనలా ఉంది. నేటి యువతరానికి ముఖ్యంగా అమ్మాయిలకు ఓ హెచ్చరికగా ఉంది. జీవితంలో ఆటుపోట్లు వాళ్ళకే ఎక్కువ ఇలాంటి స్థితిలో. చక్కటి కవిత. అభినందనలు
చాలా బాగుంది sir
చాలా బాగుంది.
లోకం తీరుని తెలియజేస్తూ, తను జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఆమె మాటల్లోనే చక్కగా తెలిపారు.
యువతీ యువకులందరికీ చేరాల్సిన కవిత ఇది.
Daer Sridhar Nee Jacintha super for new Youvatha D. Hanmaiah kgr
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
గాలివాన వెలిసింది
ప్రకృతీ నీ ప్రకృతీ
నీవుగాక ఎవరు నా దేవత
ప్రకృతి పరవశం
మహాభారత కథలు-71: రెండవసారి జూదానికి సన్నాహాలు
ప్రేమించే మనసా… ద్వేషించకే!-6
మానస సంచరరే-50: ‘లోకా సమస్తా హసితో భవంతు’!
జ్ఞాపకాల పందిరి-162
సిరివెన్నెల పాట – నా మాట – 45 – అక్షరాలతోనే ఆవేశాన్ని రగిలించిన పాట
మహాప్రవాహం!-24
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®