[జంతు ప్రేమికుడు రోమ్యులస్ వైటేకర్ గురించి బాలబాలికలకు వివరిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్ ఈ రచనలో.]
పిల్లలూ! పాములంటే మీరు భయపడతారు కదా! మీరేంటి పెద్దవాళ్ళు కూడా గజగజ వణుకుతారు. అంతేకాదు పాములన్నీ విష పూరితమనీ, అవి పగబడతాయనీ చాలా మంది నమ్ముతుంటారు. కానీ అది సరియైనది కాదు. పంటలను నాశనం చేసే ఎలుకల్ని తిని ఇవి రైతులకు సహాయపడతాయి. ప్రకృతి అంటేనే సమతుల్యత ఏ జీవులు ఎంత నిప్పత్తిలో ఉండాలో అంతే ఉండాలి. అలాంటి అసమతుల్యత ఏర్పడి పాములు నశించి పోవటాన్ని గమనించిన రోమ్యులస్ ఎర్ల్ వైటేకర్ అనే జంతు ప్రేమికుడు చెన్నైలోని అడయార్‌లో ఒక స్నేక్ పార్క్‌ను ప్రారంభించారు. ఈయన విలుప్తమైపోతున్న రీప్టీలియా జాతుల్నీ సంరక్షించటానికి ఈ పార్క్‌ను ఏర్పాటు చేశారు. దీని నిర్వహణా బాధ్యతను ఒక ట్రస్టు నిర్వహిస్తోంది. దీన్ని ‘మద్రాస్ స్నేక్ పార్క్ ట్రస్ట్’ అంటారు. ఈ పార్కులో దాదాపు ముప్పై రకాల ఇండియన్ స్నేక్స్ ఉన్నాయి. అందులో కింగ్ కోబ్రా, ఇండియన్ రాక్ పైథాన్, రెటిక్యులేటెడ్ పైథాన్ మొదలైనవి ఉన్నాయి.
వైటేకర్ క్రూరమృగాలను సంరక్షించటానికి కంకణం కట్టుకున్నారు. అంతేకాక ఈయన ‘హెర్పటాలజిస్ట్’ కూడా! హెర్పటాలజీ అంటే సరీసృపాల గురించి చదివే శాస్త్రము. ఈయన మద్రాసు స్నేక్ పార్క్‌ను స్థాపించటమే గాక ‘అండమాన్& నికోబార్ ఎన్విరాన్ మెంట్ ట్రస్ట్’ను, ద్రాస్ క్రొకోడైల్ బ్యాంక్ ట్రస్ట్’నూ కూడా స్థాపించారు. మద్రాస్ క్రోకోడైల్ బ్యాంక్ ట్రస్ట్ అనేది హెర్పటాలజీ సెంటర్. అంతరించి పోయేంత విషమ పరిస్థితిలో ఉన్న ‘ఘరియల్’ (gharial) అనే మొసళ్ళను వైటేకర్ ఇక్కడ సంరక్షిస్తున్నారు. ప్రస్తుతం వైటేకర్ ఆ ట్రస్టుకు వ్యవస్థాపక డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
International union for the conservation of nature and natural Resources (IUCN) కు వైటేకర్ గౌరవ సలహాదారునిగా, మొసళ్ళ ప్రత్యేక విభాగానికి వైస్ ఛైర్మన్ గానూ, సముద్రుపు తాబేళ్ళ ప్రత్యేక విభాగానికి మెంబర్ గానూ ఉన్నారు. 2005లో ప్రకృతి సంరక్షణ బాధ్యతను నిర్వర్తించినందుకు గాను ‘వైట్లీ’ అవార్డును గెలుచుకున్నారు ఈ అవార్డును వైటేకర్ కర్ణాటకలోని ఆగంటే రెయిన్ ఫారెస్ట్ రీసెర్చి స్టేషన్‌ను ఏర్పాటు చేయటానికి ఉపయోగించుకున్నారు. ఈ రీసెర్చి సెంటర్లో ‘కింగ్ కోబ్రాలను’, వాటి యొక్క ఆవాసాలను కనుక్కోవటానికి పరిశోధన జరుగుతుంది. ‘ఇరులా’ అనే జాతి గిరిజనులు పాముల్ని పట్టుకొని తమ జీవనాన్ని సాగిస్తుంటారు. పాముల్ని పట్టడాన్ని నిషేధించడంతో ఆ గిరిజనులకు పని లేకుండా పోయింది. అందువల్ల వైటేకర్ వీరికి రీసెర్చి సెంటర్లో పునరావాసం కల్పించారు. వారికి పాముల నుండి స్నేక్ వీనమ్ తీసే పనిని అప్పగించారు. ఇది పాము కాటుకు విరుగుడుగా పనిచేస్తూంది. ఈ విధంగా పాముల్ని సంరక్షించడంతో పాటు పాములు పట్టే వాళ్ళకు కూడా పని కల్పించారు. అంతేకార భారతదేశమoతా ఎన్నో రెయిన్ ఫారెస్ట్ రీసెర్చి సెంటర్స్‌ను స్థాపించారు.
వైటేకర్, కింగ్ కోబ్రాల యొక్క జీవన చిత్రణ మీద 53 నిమిషాల నిడివి గల ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారు. దీన్ని 1996వ సంవత్సరంలో తీయగా దీనికి 1998వ సం॥లో ‘ఎమ్మీ అవార్డు’ లభించింది. ఎమ్మీ అవార్డు దీనిని డాక్యుమెంటరీలు మరియు వార్తలను కళాత్మకంగా చిత్రించే ఛాయాగ్రామకులకు ఇస్తారు. ఇదే కాక ‘కామొడో డ్రాగన్లు’, ‘డ్రాకోలు’ అనే సరీసృపాల సహజ జీవితాన్ని ‘నేచర్’ అనే డాక్యమెంటరీగా తీశారు. డాక్యుమెంటరీలు తీయడమే గాకుండా ఎన్నో పుస్తకాలు కూడా వ్రాశారు. ఎక్కువగా పాముల మీద వ్రాశారు. ఈ పుస్తకం ‘స్నేక్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో ప్రచురితమైంది.
రోమ్యులస్ వైటేకర్ 23 మే 1943వ తేదీన జన్మించారు. తల్లి పేరు ‘డోరిస్ నార్డిన్’, తండ్రి పేరు ‘రామ ఛటోపాధ్యాయ’. వైటేకర్కు ఏడు సంవత్సరాల వయసులో ఈ కుటుంబం న్యూయార్కు నుండి భారతదేశం వచ్చేసింది. ఈయన 1974లో ‘జాయ్’ అనే మహిళను వివాహం చేసుకున్నారు. వీరి కిద్దరు పిల్లలు నిఖిల్, సమీర్. నిఖిల్ వైల్డ్ లైఫ్ మేనేజిమెంట్ చదవగా, సమీర్ మైక్రో బయాలజిస్ట్‌గా ఉన్నాడు. వైటేకర్ ప్రస్తుతం తమిళనాడులో నివసిస్తున్నారు. అంతరించిపోయే దశలో ఉన్న క్రూరమృగాలను సంరక్షించి ప్రకృతిలోని సమతుల్యతను కాపాడుతున్న వైటేకర్ గురించి తెలుసుకున్నారు కదా పిల్లలూ!
Image Source: Internet
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
అమెరికా ముచ్చట్లు-20
తాత్వికపరమైన అంశాలు, కళాత్మకత, కవిత్వపు ధోరణుల కలగలుపు -27 డవున్
ముద్రారాక్షసమ్ – ద్వితీయాఙ్కః – 4
అలనాటి అపురూపాలు-35
మన భావోద్వేగాలతో ఆడుకునే నవల – ‘మై కజిన్ రేచెల్’
గలాటాలు
మారందాయి మహాశ్వేతాదేవి
బంగారు నాన్న
భూమి నుంచి ప్లూటో దాకా… -14
జ్ఞాపకాల తరంగిణి-80
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®