‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
టి. రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.


ఆధారాలు:
అడ్డం:
1) ధర్మరాజు యొక్క శంఖము చివర సున్న లోపం (6) |
5) మహాపాపం (3) |
7) చూడబడినది, గుర్తింపబడినది (4) |
9) శరీరము (3) |
11) చీలిక, ఖండము (2) |
12) పుండు, చీము (2) |
13) రక్షింపవలెనని కోరికగలవాడు (4) |
15) చంద్రగుప్తుని తల్లి ఆటుగా వచ్చింది (2) |
16 చెదిరిన తరసము 2, 3, 1, 4 (4) |
17) సూర్యాదిగ్రహము, పిశాచము (2) |
18) వేగము అటుగా (3) |
20) తేలిక, చులకన (4) |
22) ఒక నాటక భేధము (3) |
23) యజ్ఞము (3) |
25) సమానార్థ బోధకమైన పదం (6) |
27) అధికము, తీవ్రము (4) |
నిలువు:
1) తదుపరి, పిమ్మట (5) |
2) వృక్షము (3) |
3) మేఘము (5) |
4) కుబేరుని భార్య (2) |
5) రుద్దు, సర్పము (2) |
6) నాలుగేసి నెలల కాలము (4) |
8) జగడము (3) |
10) కొయ్యపాడి, బూడిద (2) |
11) ఆవలి దరి, సమీపము, తీరము (3) |
13) సమానము, అంగీకారార్థము – అటుగా (2) |
14) తుమ్ము (3) |
16) మామిడి (4) |
17) ఇంద్రజాలము (3) |
19) శివుని శంఖము (4) |
20) బంగారము (4) |
21) నడక యందలి కులుకు (4) |
24) ప్రయాణం (3) |
26) ఇరవైనాలుగు కాగితాల కట్ట (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను puzzlesanchika@gmail.com కు 2025 ఏప్రిల్ 10వ తేదీలోపు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘పద ప్రహేళిక ఏప్రిల్ 2025 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 మే 2025 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక – మార్చ్ 2025 సమాధానాలు:
అడ్డం:
1) అనుమానం 3) అంచనావ్యయం 7) రుద్దు 8) సాహసం 9) ఆహారం 13) రంగా 14) శిబిక 16) కనుమా 19) కనుక 20) గురువు 21) మాసం 25) వఘరా 26) తాకీదు 27) కోరు 30) మావి చిగురు 31) సుడిగాలి
నిలువు:
1) అసురులు 2) మాత్ర 4) చట్టం 5) వ్యవహారం 6) అహల్య 10) రంగారి 11) అంబిక 12) పునుగు 15) కనుమ 17) మారుతం 18) అమావ 22) సంఘజీవి 23) సంకీర్ణం 24) తిరుగలి 28) రేగు 29) తాడి
సంచిక – పదప్రహేళిక – మార్చ్ 2025 కి సరైన సమాధానాలు పంపినవారు:
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట మోహన రావు
- కర్రి ఝాన్సీ, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- పి.వి. రాజు, హైదరాబాద్
- రంగావఝల శారద, హైదరాబాద్
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్లో సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.

ప్రకాశం జిల్లా ఒంగోలు నివాసి అయిన శ్రీ టి. రామలింగయ్య 2002లో ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసి, విశ్రాంత జీవితం గడుపుతున్నారు. గళ్ళ నుడికట్టులు నింపటంలో ఆసక్తి ఉన్న రామలింగయ్య 1980 నుండి ఆంధ్రభూమి, ఆంధ్రప్రభలలోని ఫజిల్స్ పూరించి పంపేవారు. ప్రస్తుతము కాలక్షేపం కొరకు స్వయంగా ఫజిల్స్ తయారు చేస్తుంటారు. ఎవరిని అనుకరించిక స్వయంగా శబ్దార్థ చంద్రిక, తెలుగు అకాడమి నిఘంటువు లను అనుసరించి వ్రాస్తుంటారు.
సెల్: 7285938387