-
పరదా
నా ముఖాన్ని చీకటి కమ్మేసిందా?
అయితేనేం నా హృదయ మంతా వెన్నెలే. -
ప్రేమ
ఎడారిలో ఒయాసిస్సు
కనిపించిందా?! మధురాలు కూడా సొంతం . -
ఎడారి
ఇసుక సముద్రం కదలటం లేదు.
బాటసారీ! ఎదురీత తప్పదు. -
కోడికూత
నా కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది.
పలావు ఘుమ ఘుమలు ఎక్కడివి? -
ప్రార్ధన
నీ కోసం అల్లాహ్ కు మొరపెట్టాను
ఆలివ్ పరిమళాలు చుట్టు ముట్టాయి.
ఇది షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *సంగీత రీతులు, వాయిద్యాలు, మాత్రా చందస్సుల వివరణ ఆసక్తికరంగా సాగింది.. నావంటి సామాన్యుల కన్నా సంగీత పరిజ్ఞానమున్న వారికి ఇది…
3 Comments
సింగిడి రామారావు
సానీలు చదవడం ఇదే మొదటిసారి .ఈ సానీల నాన్న ఎవరు ? వీటి నియమ నిబందనలేమిటి ?
శ్రీరామదాస్ అమరనాథ్ గారు వివరించగలరు దయజేసి
S.amaranath
సానీ అంటే సామాన్యుడి నీతులు అని అర్థం .
హిందీ బాషలో సమానం అని అర్థం .సంగీతంలోని
సప్త స్వరాలు మొదటి చివరి దీర్ఘ స్వరాలే సానీ .
ఇదిమూడు పాదాలతో 25 అక్షరాల పరిమితి కలిగి ఉంటుంది .ఏదేని రెండు పాదాల అంత్యప్రాస కలిగి ఉంటుంది . మొడటి పాదం
కవితా వస్తువు .రెండవ పాదం విశ్లేషణ .మూడవ పాదం విమర్శ లేదా చరుపు .దీని పుట్టుక 2010 .
నేను ఈ ప్రక్రియ రూప కర్తను .( నాన్న అని చెప్పుకోవటం ఇష్టం లేదు ) దీని భాష సామాన్యుడి భాష .ధన్య వాదాలు .
Manoharam
పాఠకులు మరియు అభిమానులందరికీ నమస్కారములు
మనసులో ఎగసిపడె దాగిఉన్న (మనసులోని ఆటుపోట్లు )అనంతమైన భావాలను క్లుప్తంగా సరైనా అర్ధాన్ని ఒక అందమైన రచన పద్ధతితో వ్రాసేవే ఈ సానీలు (క్రొత్త ఆవిష్కరణ )
శ్రీ రామదాసు అమరనాథ్ అంటే సానీలు సానీలు అంటే శ్రీ రామదాసు అమరనాథ్ క్రొంగొత్త రచన పద్ధతిని కనిపెట్టిన శ్రీ రామదాసు అమరనాథ్ గారికి హృదయ పూర్వక క్రుతగ్నతలు తెలుపుతున్న మీ అభిమాని మనోహరం( హైదరాబాద్ )
శ్రీ రామదాసుగారు మీ సానీలు అన్నీ చదువుతూ ఉంటాను చాలా చాలా బాగుంటాయి మనసును ఆనందపరుస్తాయి థ్యాంక్స్
నా సానీలు మీ కోసం
సానీలు పేరు నీవు
చెదరని చిరు నవ్వు నీది
బెదరని మనసు నీది.
ఆ నీవే శ్రీ రామదాసు అమరనాధ్
జై హింద్
తేది: ఆరు జూలై రెండువేలపందొమ్మిది .