ఈనాడు పాశ్చాత్య సంగీతము యొక్క ప్రభావము (influence of Western Music) కొద్దో గొప్పో అన్ని దేశాల సంగీతంపైనా వున్నది.
అమెరికా, యు.కె., ఇతర యూరప్ దేశాల్లో పాశ్చాత్య సంగీతం మాత్రమే ఉన్నది. West Asia ఇంకా – ఇటలీ, మధ్య ప్రాచ్య దేశాలకు వాటి యొక్క ప్రత్యేకమైన సంగీత పద్ధతి వాడుకలో ఉన్నప్పటికీ పాశ్చాత్య సంగీత ప్రభావం ఈ దేశాల్లో కూడా ఉంది.
అలాగే Far East దేశాలైన జపన్, చైనా, హాంగ్కాంగ్, మలేసియా మొదలైన దూర ప్ర్రాచ్య దేశాలలో ఈ దేశపు సంగీత పద్ధతి ఉన్నప్పటికి పాశ్చాత్య సంగీత ప్రభావం కలదు.
ఈ దేశాల్లో (Far East) మోహన, ఉదయ రవిచంద్రిక, మొదలైన ఔడవ రాగాలు, ఆ దేశపు సంగీత సంప్రదాయాన్ని సూచిస్తాయి. మధ్య ప్రాచ్య దేశాల్లో చారుకేశి, సరసాంగి, చక్రవాకం, సింహేంద్ర మధ్యమం మొదలైన రాగాలు మొదటి నుంచి సంప్రదాయంగా ఉన్నాయి.
పాశ్చాత్య దేశాలలో మన శంకరాభరణ రాగము – major scale అనే పేరుతో వుంది. Minor scale అనే పేరుతో కీరవాణి, గౌరీ మనోహరి, నఠభైరవి రాగాలు ఉన్నాయి.
పాశ్చాత్య సంగీతం కేవలం ఇప్పటి Harmony పద్ధతిలో అభివృద్ధి కాక ముందు, hymns, chants అనే పద్ధతిలో (mode) మూర్ఛన, జాతి అనే రాగ పద్ధతిని అనుసరించి ఆరు విధాలైన modes ఉండేవి. అవి ఇప్పుడు వాడుకలో లేవు.
Dorian – ఖరహరప్రియ – Lydian mode – కళ్యాణి. Mixolydian mode – Phrygian mode – Aeolian – హరికాంభోజి; Locrian – శంకరాభరణం – Ionian – నఠభైరవి. ఈ రాగాలని వాళ్ళు పూర్వం భారతీయ పద్ధతిలో melody system లోనే (homophonic) పాడేవారు.
శంకరాభారణం (కర్నాటక), బిలావల్ (హిందుస్థానీ) major scale western music ఇప్పటికీ ఉన్నవి. మోహన రాగం ప్రపంచ దేశాలన్నింటిలోను ఉన్నది.
పాశ్చాత్య పద్ధతిలో త్రిశ్ర, Waltz లో; చతురస్ర Quarter లో ఉన్నాయి. ఇది మనకి కూడా ఉంది. హిందుస్థానీలో దాద్రా – త్రిశ్రం – తీన్తాళ్ – ఈ త్రిశ్ర చతురస్రాలకి multiples గా ఉన్నవి. కాగా కర్నాటక, హిందుస్థానీలో 5, 6, 7, 8 విశేషంగా ఉన్నవి. వీటినే మనం ఖండ, మిశ్ర అనీ; హిందుస్థానీలో ఝంపె, రూపక అని అంటాము.
(Carnatic Music /Tamil /Hindusthani Music
(ఇంకా ఉంది)
డా. సి. ఉమా ప్రసాద్ గారు పుట్టింది, పెరిగింది రాజమండ్రి. వారి స్థిర నివాసం హైదరాబాద్. తల్లి తండ్రులు – కీ.శే: M.V. రంగా చార్యులు, M. ప్రమీలా దేవి. అత్తామామలు: కీ. శే.డా. సి. ఆనందా రామం, శ్రీ రామా చార్యులు. భర్త: సి. బదరీ ప్రసాద్(రిటైర్డ్ సీనియర్ మేనేజర్ ఆంధ్రా బ్యాంక్). ఉమా ప్రసాద్ ఉపాధ్యాయురాలిగా (M A ఎకనామిక్స్ ఆంధ్రా యూనివర్సిటీ) పని చేశారు. వారి ప్రవృత్తి సంగీతాభిలాష (పిహెచ్డి ఇన్ మ్యూజిక్ పద్మావతి మహిళా యూనివర్సిటీ). భావ కవితలు, స్వీయ సంగీత రచన, రాగల కూర్పు, పుస్తక పఠనం వారి అలవాట్లు. వివిధ సంగీత పత్రికలలో- సంగీత రచన వ్యాసాలు మరియు కవిత్వ ప్రచురణాలు, లక్ష గళార్చన ప్రశంసా పత్రం, తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో కవిత్వ ప్రచురణ పురస్కారాలు. గురువులు: విజయవాడ సంగీత కళాశాలలోని అధ్యాపకులైన అందరి గురువులు, శ్రీమతి రేవతి రత్న స్వామి గారు మొట్టమొదటి గురువు- తదనంతరం పెమ్మరాజు సూర్యారావు గారు, MV రమణ మూర్తిగారు, కిట్టప్పగారు, అన్నవరపు రామస్వామి గారు, డా. నూకల చిన సత్యనారాయణ గారు. తదితరుల ఆశీస్సులతో సంగీతంలో ఓనమాలు దిద్దుకొని సంగీతంలో పిహెచ్డి పట్టా పొందారు. “మహా సముద్రంలో ఒక నీటి బిందువు నా సంగీత -కృషి” అంటారు. మధుర గీతికలు (రెండు భాగాలు), రస గాన లహరి, స్వర అమృతవాహిని, హనుమ కీర్తనల సమాహరం, చైతన్య భావ కవితామాలికలు, రాగరంజని (రెండు భాగాలు), భావ-రాగ-లహరి (రెండు భాగాలు), కవితామృతఝరి అక్షర తరంగిణి, అపురూప-అపూర్వ-రాగలహరి వంటి పుస్తకాలను వెలువరించారు.
🙏
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
అపూర్వ
నా జీవితంలో శివారాధన-1
గుడ్డియుద్ధం
పదసంచిక-111
ఎగిరే గాలిపటం
కరోనాలో ఉల్లాసంగా ఉత్సాహంగా
దేశ విభజన విషవృక్షం-26
ఫొటో కి కాప్షన్-34
కయ్యూరు హైకూలు-3
ఉసురు
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®