సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    ఆసూరి హనుమత్ సూరి

    కథ చాలా బాగా ఉంది. భగవంతుని తో శత్రుత్వం ఉన్నా చివరికి మనల్ని అనుగ్రహించే మహా దయాళువు..ఆయన. ఈ విషయాన్ని చక్కగా చెప్పారు. శుభాభినందనలు.

    1. 1.1

      గోనుగుంట మురళీకృష్ణ

      ఆ శత్రుత్వం కూడా గతజన్మ కర్మ ఫలితం. ఎంతటి వారికైనా కర్మఫలం అనుభవించక తప్పదు…కర్మ నశించగానే మంచిరోజులు వస్తాయి….కథను చదివి మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చాగంటి ప్రసాద్ గారి వ్యాఖ్య: *కథల పోటీలో మీ జడ్జీలు ఎంపిక చేసిన శంఖు చూడుడు అనే బహుమతి కథ చదివాను. కథనం బావుంది.
    పౌరాణిక కథల్లో ఎన్నో గొప్ప గొప్ప నీతిని సందేశాన్ని ప్రబోధించే, కష్టాల్లో ఉన్న మనిషి ధర్మంగా మనుగడ ఎలా సాగించవచ్చో తెలిపే కథలు ఎన్నో ఉన్నాయి.
    ఈ కథ వలన కలిగే సామాజిక విలువ శూన్యం. ఒక నిత్య భక్తురాలిని వేరే రూపంలో వచ్చి ఒక దేముడు ముట్టుకుంటే పాతివ్రత్యం పోయి శక్తులను పోగొట్టుకోవడం అన్న కాన్సెప్ట్ కల కథ చెప్పడం వలన ఏం ప్రయోజనం?
    ఇలాంటి కథలు చెప్పడం వలన యువతకి మన పురాణ ఇతిహాసాలమీద విలువ తగ్గిపోతుంది.
    అసలే హిందూ సనాతన ధర్మ మీద జోకులు, హాస్యాలతో కొంతమంది నాస్తిక వాదుల వాచాలత్వం ఎక్కువైపోయింది..
    మనం అస్సలు స్కోప్ ఇవ్వకూడదు కదా.
    మన పిల్లలే మనల్ని ప్రశ్నిస్తారు ఇటువంటి కథలు చదివితే.
    కానీ ఇలాంటి కథలు మనం చెప్పకూడదు. ఆ రోజుల్లో తులసి జలంధర అనే నాటకం ఎన్నో చోట్ల దిగ్విజయంగా ప్రదర్శింపబడింది. కానీ ఆ రోజుల్లో జనం చూసి విమర్శించలేదు. కానీ ఇప్పుడు పిల్లలకి ఆ సన్నివేశాన్ని ఏ విధంగా సర్ది చెప్పి మాట్లాడగలము?
    మన రామాయణ, మహాభారత కథల్లో గొప్ప కథలు ఎన్నో ఉన్నాయి. అవి రాయవచ్చు.
    ఈ విధంగా వ్రాసానని అన్యధా భావించకండి.
    మేము కూడా సనాతన ధర్మము నేపధ్యంలో ఒక యాప్ ద్వారా మహాభారత , రామాయణ కథలు ప్రాచుర్యం చేసే సదుద్దేశంతో మొబైల్ అప్ ద్వారా మహాభారత, రామాయణాలు నేటి పౌరులకు, యువతకు తెలియజేసే ఆలోచనలో తయారు చేశాము.
    నమస్సులతో
    చాగంటి ప్రసాద్.*

  3. 3

    గోనుగుంట మురళీకృష్ణ

    సద్విమర్శలను నేనెప్పుడూ అపార్థం చేసుకోను..మీ అభిప్రాయం చదివిన తర్వాత మీరు లోతుగా ఆలోచించలేదు అనిపించింది…
    1. తులసీ జలంధర కథే శంఖ చూడుడు కథ. జలంధరుడు అనేపేరు శివపురాణం లో ఎక్కడా లేదు. అది నాటక రచయితలు పుట్టించినది. మూల కథలో విష్ణువు తులసి శీలభంగం చేస్తాడు. మన పురాణాల పట్ల చిన్నచూపు ఏర్పడకూడదనే ఉద్దేశంతో తాకినట్లు మాత్రమే చెప్పాను.
    2. పురాణాలను విమర్శించేవారిని మూల గ్రంథం చదవమని చెప్పండి. ..ఆయా కథల్లో అంతరార్ధం తెలుసుకోవటం అంత సులభం కాదు….ఒకసారి కాదు, పదిసార్లు చదవమని చెప్పండి. అర్థమయ్యేవరకూ…
    3. పురాణ కథలంటే ఏమిటో చదవకుండా జోకులు వేసే వాచాలుర ను(మీరే అన్నారుగా వాచాలత్వం అని) చెంపపెట్టులా సమాధానం చెప్పండి.
    4. చిన్న చిన్న కథలు గా మలచే టప్పుడు మూలకావ్యం లో చెప్పినది యధాతధంగా చెప్పటం కుదరదు. మూలకథ కు ఔచిత్య భంగం కలగకుండా తన సృజనాత్మకతతో రచయిత కొన్ని మార్పులు చేస్తాడు.
    5. కువిమర్శలు చేసేవారికి ఇంత వివరంగా చెప్పలేనప్పుడు ఒకే ఒక విషయం చెప్పండి….”చందమామ పత్రికలో కథలు చూడండి.ఎంత హాయిగా ఉంటాయో! వాటిలో సామాజిక విలువల గురించి ఎవరూ ఆలోచించరు.పాఠకులను అలరించటమే ముఖ్యం. కథల పోటీ నిర్వహించేవారు, పాల్గొనేవారు కూడా అలాగే ఆశిస్తారు.చందమామ కథలంత హాయిగా ఉండాలని…”
    మీ విమర్శకు నా క్లుప్త సమాధానం ఇది.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!