సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    Shyamkumar Chagal

    ఈ కథ చదివిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే దాదాపుగా ఇదే విధంగా నేను ఈ మధ్య ఆలోచిస్తూ ఉన్నాను. మరణించిన తర్వాత ఏం జరుగుతుంది ?. నన్ను వదిలి వెళ్ళిపోయిన నా ఇష్టమైన బంధువులు స్నేహితులు ఆత్మీయులు అమ్మానాన్నలు బాబాయిలు మేనత్తలు మేనమామలు పిన్నమ్మలు అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు అందరూ పై లోకంలో ఉంటారు కాబట్టి మరణించిన తర్వాత వాళ్లందర్నీ కలుస్తాను అనే భావన , ఆలోచన నాకు ఎంతో తృప్తినిచ్చింది. దాదాపుగా అదే రకమైన ఆలోచనల నుంచి ఉద్భవించిన ఈ కథ చదివి నిజంగా విస్మయానికి లోనయ్యాను.
    ఈ కథ ముఖ్యంగా 60 వయసు దాటిన వాళ్ళు తప్పకుండా చదవాలి.

  2. 2

    డా.సుమన్ లత

    డికెన్స్ కథ కు మీ అనువాదం దీటు గా ఉంది మురళీకృష్ణ గారూ !

  3. 3

    ASURI HANUMATHSURI

    మరణించిన మన ఆత్మీయులను మళ్లీ కలుసుకోవచ్చనే ఊహే చాలా బాగుంది. ఇటీవల చనిపోయిన ఒక నా ఆత్మీయ మిత్రుడిని ఇలా కలుసుకోవాలని అనిపిస్తోంది కథ చదివినప్పుడు…హృద్యమైన కథ… అంతే హృద్యమైన అనువాదం… మురళీ కృష్ణ గారూ!

  4. 4

    అల్లూరి Gouri Lakshmi

    సున్నితమైన భావన ఉన్న ఈ కథ నాకు ఎంతో హాయిని కలిగించింది..అనువదించిన మీకు అభినందనలు మురళీ గారూ

  5. 5

    పుట్టి నాగలక్ష్మి

    మరణించిన మన ఆత్మీయులను కలుసుకోవచ్చుననే భావనే చాలా సంతోషాన్ని కలగజేసింది..ధన్యవాదాలు కస్తూరి మురళీకృష్ణ గారికి.. 🙏🏻

  6. 6

    శ్రీధర్ చౌడారపు

    చెల్లి మరణించింది అన్న చోట దుఃఖం పొంగివచ్చింది. అక్కడికే ఆగిపోయి ఉంటే ఒక అద్భుతమైన విషాదగాథ అయిఉండేది. కానీ ఆ తర్వాత పొడగింపులో కథ కాల్పనిక జగత్తులోకి ప్రయాణించింది కథలో వ్యక్తి యొక్క జీవిత గమనము తనవారిపట్ల ప్రేమ ఆప్యాయతలు అంతర్గతంగా ప్రవహించాయి. చక్కని కథ మానవ సంబంధాల పట్ల మరియు బాల్యంలోని భావనలతో ఒక మంచి పరిచయాన్ని చేసింది.
    అభినందనలు మురళీకృష్ణ గారు

  7. 7

    గంగిశెట్టి లక్ష్మీనారాయణ

    గొప్ప కథ! గొప్ప అనువాదం/ అనుసృజన!!

  8. 8

    Sreevani sharma

    మరో లోకంలో మన వాళ్ళని మనం కలవచ్చన్న స్వప్నం… నిజంగా ఊరటనిచ్చే ఒక ఆశాకిరణమే! మీ కథనం అద్భుతం. అనువాదం ధోరణిలో ఎక్కడా అనిపించలేదు.
    అభినందనలు సర్.

  9. 9

    శారద ( బ్రిస్బేన్ )

    కథలో చాలా లోతైన మార్మికత కనిపించింది నాకు. ఒక రకమైన మిస్టిక్ లక్షణం. కనిపించీ కనిపించనట్టు..
    శారద (బ్రిస్బేన్)

  10. 10

    vivinamurthy

    మానవుడి చేతనను స్పృశించిన మొదటి విషయం చావు. ఇంతవరకూ నాతో సంచరించిన ప్రాణి ఏమయింది? ఇక్కడే ఎక్కడో ఉంటుంది అన్నది తొలి ఊహాత్మక సమాధానం. అప్పటికి భాష, దానిని బట్టి భావాలు, వాటిని బట్టి భావనలు లేవని మనకి లభిస్తున్న శిలాజాల ఆధారంగా నిర్ధరించుకోవచ్చు. అవన్నీ ఎంతో కొంత ప్రవేశించాక కలిగిన తొలి వాంఛ అమర్త్యత్వం. మనకి రాత రూపంలో లభిస్తున్న కథ గిల్గమేష్. చావు అనే వాస్తవానికీ దాన్నించే బయట పడాలనే అనాది మానవుని వాంఛకీ సంబంధించిన ఘర్షణ ఆ కథలో వ్యక్తం అవుతుంది. మన ఉపనిషత్తులలో ఈ ఘర్షణకి సంబంధించిన చర్చలు ఉన్నాయి. మానవునికి ఊరటనిచ్చిన, ఇస్తున్న ఊహలలో ‘మన సంబంధీకులు ఎక్కడో ఒకచోట ఉజ్వలంగా ఉంటారు. వారిని మనం ఎప్పుడో అప్పుడు కలుసుకుంటాం’ అన్నది ప్రధానమైనది. డికెన్స్ ఈ కథ లోగడ చదివిన గుర్తు లేదు. మురళి గారి అనువాదం హాయిగా సాగింది.

  11. 11

    తుర్లపాటి నాగేంద్ర కుమార్

    మనిషి దశలవారీ జీవితంలో అద్భుతమైనది బాల్యం. అమ్మా, నాన్నల వాత్సల్యంలోని ప్రేమానురాగాల, తోబుట్టువుల సాన్నిహిత్యం లోని మధురిమల తాలూకు స్పందనలను మరియు చిన్నతనంలో తమకి ఆత్మీయ నేస్తాలయిన ప్రకృతి లోని చెట్టుచేమా, కొండా కోనా, అవని ఆకాశం,తారల తళుకులు వగైరా అద్భుతంగా వర్ణించారు. ఆ బాలుని ఊహాజనిత భావనలను, అనుభూతులని ఆతని స్వప్న లోకంతో తదుపరి నక్షత్ర లోకంతో అనుసంధానించిన తీరు చాలా బాగుంది. ఓ మనిషికి అంతిమ దశ ఎప్పుడు? అంతిమ గమ్యం ఏమిటి? అన్న ప్రశ్నలకు, మరోలోకంలో మన ఆత్మీయులు మనకి స్వాగతం పలుకుతారు, మనం వారిని మళ్లీ కలుసుకుంటాము అన్న ఆశావహమైన భావనని కథ ముగింపులో కలిగించిన తీరు అద్భుతంగా ఉంది. కథలో ఓ నిగూఢమైన విషయం ఏమిటంటే ఎవరు ముందుగా (స్వప్న) నక్షత్రాన్ని చేరుకుంటారు అనేది ఎవరికీ తెలియదు. కథ చదివిన పిదప వర్ణింప అలవిగాని అలౌకిక భావనలు కలిగాయి. ఓ అద్భుతమైన కథ అందించిన రచయిత శ్రీ మురళి కృష్ణ గారికి అభినందనలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!