[మాయా ఏంజిలో రచించిన ‘Refusal’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]
(దూరమైన భావోద్వేగ భాగస్వామి గురించి కావచ్చు. గతించిన వారి గురించీ కావచ్చు. పైకి కనిపించని విషాదపు జీర ధ్వనిస్తుందీ కవితలో!)
~
ప్రియతమా! మరో జీవితం లోనో మరే భూభాగాల్లోనో నీ చేతులను నీ పెదవులను ధైర్యవంతమైన నీ చిరునవ్వును కనుగొనగలనా నేను
నీపై నా ఆరాధన తీపిదనం మరీ మితిమీరిపోయింది
మరో ప్రపంచంలోనో తేదీలు తెలియని భవిష్యత్ కాలాలలోనో మనం మళ్ళీ కలుస్తామన్న నమ్మకం ఏముంది నా దేహపు తొందరపాటుతనాన్ని ధిక్కరిస్తాన్నేను మరొక్క మధురమైన కలయికని వాగ్దానం చెయ్యకుండా చచ్చిపోవాలనీ నేననుకోను!!
మూలం: మాయా ఏంజిలో
అనువాదం: హిమజ
మాయా మనోగతం:
1.నా జీవన నౌక ప్రశాంతమైన, అనుకూలమైన సముద్రాలలో ఆటుపోట్లు ఎరుగని ప్రయాణం చేసి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. నా ఉనికినే సవాలు చేసిన రోజులు, వెలుగులు విరజిమ్ముతూ ఆశాజనకంగా ఉండవచ్చు, నిశీధి నీడలు అలుముకొని ఉండవచ్చు,
ఈదురు గాలులు వీచే తుఫానులలో, ఎండరోజుల్లోను బతుకులోని అత్యద్భుతమైన కాలంలోను, ఒంటరి ఏకాకి రాత్రుళ్ళలోను – నేను జీవితం పట్ల, నా చుట్టూ ఉన్న మనుషుల పట్ల కృతజ్ఞతా వైఖరినే కలిగి ఉన్నాను. దానినే ఎల్లకాలం కొనసాగిస్తాను.
••••••••••
2.ధైర్యాన్ని పెంపొందించుకోవడానికి ఎవరికి వారు తమ వంతు ప్రయత్నం తాము చేయాలని నేను ప్రోత్సహిస్తాను. అన్ని మానవధర్మాలలోకెల్లా అత్యంత ప్రాముఖ్యత కలిగినది ధైర్యసాహసాలను కలిగి ఉండడం. ధైర్యమే లేకుంటే, మీరు మరే ఇతర విలువలని ధర్మాన్ని స్థిరంగా ఆచరించలేరు. ధైర్యంగా, నిష్కపటంగా మీరు ఉన్నప్పుడే – అందరి పట్ల దయగా, న్యాయంగా, ఉదారంగా ఉండగలుగుతారు.
సుతిమెత్తగా కవిత్వం రాసే ‘హిమజ’ కవితా సంకలనం ‘ఆకాశమల్లె’కి కవయిత్రి మొదటి పుస్తకానికి ఇచ్చే సుశీలా నారాయణరెడ్డి పురస్కారం (2006), రెండవ పుస్తకం ‘సంచీలో దీపం’కు ‘రొట్టమాకు రేవు’ అవార్డు (2015) వచ్చాయి. ‘మనభూమి’ మాసపత్రికలో స్త్రీలకు సంబంధించిన సమకాలీన అంశాలతో ‘హిమశకలం’ పేరున సంవత్సర కాలం ఒక శీర్షిక నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాత ఆఫ్రో అమెరికన్ కవయిత్రి ‘మాయా ఏంజిలో’ కవిత్వాన్ని అనువదించి 50 వారాలు ‘సంచిక’ పాఠకులకు అందించారు. ఇప్పుడు ‘పొయెట్స్ టుగెదర్’ శీర్షికన భిన్న కవుల విభిన్న కవిత్వపు అనువాదాలు అందిస్తున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
మా మిత్రుల వియత్నాం పర్యటన-3
జ్ఞాపకాలు
మహాప్రవాహం!-45
సూర్యోదయం..!!
నూతన పదసంచిక-41
మనసుకు హత్తుకునే నవల ‘కైంకర్యము’
అంతరం-4
రంగుల హేల 46: సినిమాలు… మన ఆత్మీయ గురుమిత్రులు
అత్తగారు.. అమెరికా యాత్ర 5
నాన్నా! ఐ లవ్ యు
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®