ఆకాశమ్మున మండే సూర్యుడు అన్ని దిక్కులా వేడి గాలులు నీటి చుక్కకై కోటి ఆశలు కోటి ప్రాణుల దాహపు కేకలు
అంతలోనే వింత గాను కారుమేఘమావరించే! జిగేల్మన్న మెరుపులతో ధనేల్ మన్న పిడుగులతో భీతావహులై ప్రజలు భీతి చెంది పరికించగ
చిటపట ధ్వనులతో చినుకులు పడగ బుస్సుబుస్సుమని భూమి పొంగగా చల్ల దనమే జగతి నిండగా సకల జీవులు సంతోషముగ కేరింతలతో గంతులేయగా ప్రకృతియే పులకించి పోవగా
అంతలోనే రైతన్నలు పదును చూడ – పొలముకెళ్లి నడుముకట్టి – కాడెపట్టి హలముతోను – పొలముదున్ని పట్టి కొట్టి – చదును చేసి కాడెవిప్పు సమయములో
ఆలితెచ్చు చద్ది కుడిచి పొలములోనే విత్తు విత్తి విత్తనాలు మొలకెత్తగ భూమాతయే లేచి వచ్చి పచ్చచీర కట్టిందని ఆబాల గోపాలము ఆనందపు చిందులెయ్య వచ్చింది వచ్చింది తొలకరి! ఈ తొలకరియే లోకాలకు శుభకరి!!
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
అడవిలో వరహాలు
పురుషులలోని పైకి కనబడని లైంగిక రాక్షసత్వాన్ని ప్రదర్శించిన కథలు – స్టోమా
సినిమా క్విజ్-90
చివరికి మనసులు మారాయి…
సిరివెన్నెల పాట – నా మాట – 53 – పూల భావాల పాట
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ త్రాగుబోతులా? – ఒక జ్ఞాపకం
మారుతున్న విలువలు
ఆ రోజుల్లో…
తెలుగుజాతికి ‘భూషణాలు’-24
గొడుగూ – కొత్త ఏనుగు
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®