అలా గాంధీజికి జవహార్ లాల్ నెహ్రు, జమునాలాల్ బజాజ్, వల్లభాయి పటేలు, విఠలుభాయిపటేలు, మోతిలాల్ నెహ్రు, చిత్తరంజన్ దాస్, బాబు రాజేంద్రప్రసాద్, సరోజినిదేవి, అజాద్ మౌలానా, చంద్రశేఖర్ అజాద్, అన్సారి, కిచ్లూ, సత్యపాల్, గిద్వాని, సేన్ గుప్తా, టండన్, రాజాజి వంటి పలు జాతీయ నాయకులతో పాటు, మదన్ లాల్ ఢింగ్రా, సూఫీ అంబాప్రసాద్, కర్తర్ సింగ్, విష్ణుగణేష్ పింగళే, బంతాసింగ్ ధామియా, బంతాసింగ్, అమిర్చంద్, ప్రతాప్సింగ్, గోపి మోహన్ సాహా, కన్హయిలాల్ దత్తూ, ప్రపుల్లకుమార చాకీ, సోహన్ లాల్ పాఠక్, జితేంద్రనాధ్ ముఖర్జీ, గేందాలాల్ దీక్షితులు, రాంప్రసాద్, బిస్మిల్, ఆశా ఫకుల్లాఖాన్, రాజేంద్రనాధ లహారి, భగవతి చరణ్, నళినీబాగ్చీ, మణీంద్రనాధ్ బెనర్జి, మహావీర్ సింగ్ వంటి చరిత్రకు అందని జాతీయ స్ధాయి పోరాటయోధులు, ప్రకాశం, డా.పట్టాభి, వెంకటప్పయ్య, సాంబమూర్తి, గిరి వంటివారితో పాటూ తెలుగునేలపై వెలుగు లోనికిరాని, సుభద్రాదేవి, స్వామి తత్త్వానంద, గురజాడ రాఘవశర్మ, టి.పి. ఆళ్వారు, వరదదాసు, చెలసాని నాగభూషణం, చెరువు సుబ్బారావు, తోట నరసయ్య, అయినంపూడిశ్రీనివాసులు, చెరుకువాడ వెంకటనరసింహం, వేదాంతము శంభుశాస్త్రి, బోబ్బా వెంకట శేషయ్య, గొట్టిపాటి బ్రహ్మయ్య, పసల కృష్ణమూర్తి, పత్తి శేషయ్య, కందుల వీరరాఘవస్వామి, డేగల సూర్యనారాయణ, శ్రీమతి గంధం అమ్మన్నరాజా, వంకా సత్యనారాయణ, కమ్మల సుబ్బయ్య, రోక్కం శ్రీరామమూర్తి, సర్దార్ పద్మనాభం తాత, కొడాలి ఆంజనేయులు, తల్లాప్రగడ రామారావు, వల్లూరి రామారావు, అన్నే వెంకటరత్నం, గూడూరు వెంకటాచలం, వడ్లమూడి సత్యనారాయణ, బోబ్బా రంగారావు, చెరుకువాడ నరసింహము, స్వామి నారాయణానంద, అయ్యదేవర కాళేశ్వరరావు, కోటగిరి వెంకటకృష్ణారావు, వెన్నేటి సత్యనారాయణ, డా.బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం, కళా వెంకట్రావు, పళ్ళంరాజు, మండపాక రంగయ్య, అన్నపూర్ణయ్య, లింగరాజు, బిక్కిని, గద్దే రంగయ్య, రామచంద్రుని వెంకటప్పయ్య;
రాయలసీమలో కడప కోటిరెడ్డి, రామ సుబ్బమ్మ, శంకరరెడ్డి, సంజీవరెడ్డి, రామకృష్ణంరాజు, కన్నయ్య, వరదాచార్యులు, కల్లూరి సుబ్బారావు, మారేపల్లి రామచంద్రశాస్త్రి; నెల్లూరులో వెన్నెలకంటి రాఘవయ్య, ఓరుగంటి వెంకటసుబ్బయ్య, బొమ్మా శేషురెడ్డి; నౌపాడలో ఉన్నవ రామలింగం, రావూరు రామకృష్ణరావు, పుల్లెల శ్యామసుందరరావు, జగన్నాథ గుప్తా, జానకీబాయమ్మ, ద్వారకా దీక్షితులు, గౌతులచ్చన్న;
పశ్చిమగోదావరిలో కేశిరాజు వేంకటనృసింహఅప్పారావు, లక్ష్మిబాయమ్మ, మూల్పురి చుక్కమ్మ, తల్లాప్రగడ ప్రకాశరాయుడు, దండు నారాయణరాజు, ఆత్మకూరి గోవిందాచార్యులు, మాగంటిబాపినీడు, అల్లూరి సత్యనారాయణరాజు, బసవరాజు శ్రీరంగశాయి, డా.ముల్పురి రంగయ్య, డా.జోగయ్యశర్మ, వీరమాచనేని నారాయణ, వడ్లపట్లగంగరాజు, ముదిగంటి జగ్గన్నశాస్త్రి, వి.బి.నాగేశ్వరరావు, పాలకోడేటి గురుమూర్తి, ప్రకాశరావు.
గుంటూరు జిల్లాలో గొల్లపూడి సీతారామశాస్త్రి, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గుళ్లపల్లిరామకృష్ణ, నాగళ్లకృష్ణయ్య, కల్లూరి చంద్రమౌళి, బ్రహ్మండం నరసింహం, కొండా వెంకటప్పయ్య, చింతమనేని భావయ్య, శరణు రామస్వామి, తుమ్మల సీతారామమూర్తి, మంతెన వెంకట్రాజు, కన్నెగంటి సూర్యనారాయణ, గుళ్లపల్లి పున్నయ్యశాస్త్రి, ఇటికాల రామమూర్తి.
కృష్ణాజిల్లాలో వెలిదండ్ల హనుమంతరావు, ఘంటసాల సీతారామశర్మ, వేలూరి యజ్ఞనారాయణశాస్త్రీ, పేట బాపయ్య, అన్నే కేశవాచార్య, శనగవరపు వెంకటసుబ్బయ్య, మల్లాది రామచంద్రశాస్త్రి, శంకర వెంకట్రామయ్య, ఇంటూరి వెంకటేశ్వరరావు, గద్దే లింగయ్య, భాగవతుల సుబ్బరామయ్య, పాదర్తి సుందరమ్మ, రాయప్రోలు సీతారామశాస్త్రి, నూకల వీరయ్య, కల్లూరి పాపయ్య, డా.శివలెంక మల్లికిర్జునరావు, దుగ్గిరాల రాఘవచంద్రయ్య, పిడికిటి రామకోటయ్య, కాకాని వెంకటరత్నం, జొన్నవిత్తుల కుటుంబ సుబ్బారావు, పోతిన గణపతి, అద్దేపల్లి గురునాధ రామశేషయ్య, పెద్దర్ల వెంకటసుబ్బయ్య, మల్లెల్ల శ్రీరామచంద్రమూర్తి, ఊటుకూరు లక్ష్మినరసింహారావు, అన్నేఅంజయ్య, కాకుమాను లక్ష్మయ్య, మరుపిళ్లచిన అప్పలస్వామి, కాట్రగడ్డ మధుసూధనరావు, ఎరమల కొండప్ప, కోటా నారాయణదొర, చింతపల్లి కృష్ణమూర్తి, కూనిశెట్టి వెంకటనారాయణ, గాజులనరసయ్య, మరియూ, ముట్నూరి కృష్ణారావు, తంగిరాల వీరరాఘవరావు, తంగిరాల సీతారావమ్మ, దుగ్గిరాల బలరామకృష్ణయ్య, గొర్రెపాటి వెంకటసుబ్బయ్య, వల్లభనేని రామబ్రహ్మం, వల్లభనేని సీతామహాలక్ష్మమ్మ, కొల్లిపర సూరయ్య, ఆత్మకూరి నాగేశ్వరరావు, అట్లూరి శ్రీరాములు, ముక్తేవి కేశవాచార్యులు, కాటూరి వెంకటేశ్వరరావు, అయినంపూడి శ్రీనివాసులు, ఎర్నేని సుబ్రహ్మణ్యం, యీ.సూర్యనారాయణ, గుళ్ళపల్లి శ్రీరాములు, కానూరి రామానందం, కాశీనాధుని పూర్ణమల్లికార్జునరావు, కానూరి వెంకటరత్నం, కానూరి బలరామయ్య, బొబ్బా వీరభద్రుడు, పూల వెంకటరమణప్ప, పేటా బాపయ్య వంటి మరెందరో మహనీయులు వేలాదిమంది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు.
బాలలు మనం వందేమాతరం కథ గురించి చెప్పుకుందాం!
పారిపోతున్న సిపాయిలకు ధైర్యం చెప్పి సంఘటితం చేసారు సైనిక అధికారులు.
సూర్యుడు అస్తమించడంతో చీకటి కమ్మసాగింది.
పరుగులాంటి నడకతో వచ్చిన ఒక సైనిక అధికారి కలెక్టర్కు సెల్యూట్ కొట్టి “సర్ వాళ్లపై రాత్రి సమయంలో దాడి చేసేందుకు అనుమతి ఇవ్వండి, లేందంటే శివయ్య, అతని మనుషులు తప్పించుకు పారిపోతారు” అన్నాడు.
“నో సార్జంట్, భారతీయులు పిరికివారు కారు. వారి లక్ష్యసాధన, పోరాట పటిమ అపారమైనది. శివయ్య పారిపోడు, అతను శత్రువు ఆకలి తీర్చిన వీరుడు, పారిపోయేవారు ఎవ్వరూ యుధ్ధానికి సిధ్ధపడరు. వారి కోరికలో న్యాయం ఉంది. ఎక్కడనుండో వచ్చిన మనం ఇక్కడి నేలను ఆక్రమించుకోవడం కోసం పోరాడుతుంటే, ఇక్కడపుట్టి ఈ నేలపై పెరిగిన వాళ్లు తమ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల కోసం పోరాడటంలో తప్పేముంది, వాళ్ల పోరాటంలో నిస్వార్థత, నిజాయితీ ఉంది, జీతం డబ్బుల కొరకు మనం పోరాడుతున్నాం. ఆశయ సాధనకు వాళ్లు పోరాడుతున్నారు. తాత్కాలిక విజయం మనదైనా, శాశ్వత విజయం ఏనాటికైనా భారతీయులదే! వెళ్లండి మరణించిన, గాయపడిన మనవారి సంగతి చూడండి, యుధ్ధం రేపు ఉదయం కొనసాగిద్దాం” అన్నాడు కలెక్టర్.
“బాలలు ఇక్కడ కొంత గత చరిత్ర విషయాలు మీకు చెప్పాలి” అన్న తాత పాలెగాళ్ళ వ్యవస్థ గురించి చెప్పసాగారు…
పాలెగాళ్ళ వ్యవస్ధ:
క్రీ.శ.1901 నుంచి 1905 వరకు పాలెగాళ్ల వ్యవస్ధలో వారు దేశం కోసం ఉరికొయ్యలపై వేళ్లాడారు. క్రీ.శ. 1336నుండి 1680 వరకు విజయనగర పాలనకాలంలో పాలెగాళ్లవ్యవస్ధ ఏర్పడింది. ప్రజలకు రక్షణ కలిగించడం, శాంతిభద్రతలు కాపాడటం, పన్నులు వసూలు, రాజు కోరినపుడు సైన్యం సమీకరించడంలో వీరు ముందు ఉండేవారు. 1800 సంవత్సరంలో బ్రిటీష్ వారికి సీమప్రాంతం ధారాదత్తమయ్యేవరకు “ముప్పై” యుధ్ధాలు జరిగాయి. గత నాలుగు వందల యాభై సంవత్సరాలుగా కొండమార్గాలలో దుర్గాలు, కోటలు నిర్మించుకుని ప్రజల క్షణ బాధ్యతలు నిర్వహిస్తూండేవారు.
పాలెగాళ్లను తమిళంలో ‘పాలైయాక్కరర్’ అని, కన్నడంలో ‘పాళెయగరరు’ అని అంటారు. వీరు సమాజంలో ఆనాటి పాలకులు. క్రీ.శ.1600 నుండి 1800 సంవత్సరాల వరకు (దత్తమండలాలు)గా ఉన్న రాయలసీమ ప్రాంతంలో బలమైన రాజు పాలన లేదు. పాలెగాళ్ల పాలనే ఉంది.
1565లో జరిగిన తళ్లికోట యుధ్ధంలో సుల్తాను చేతులలో పరాజయం పొందిన విజయనగరం రాజులు తమ రాజధానిని బళ్లారి జిల్లాలోని హంపీ నుండి అనంతపురంజిల్లా పెనుగొండకు మార్చారు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సలహాతో బీజాపూర్, గోల్కొండ నవాబులు ఉమ్మడిగా 1650లో పెనుగొండపై దాడి చేసి విజయనగర రాజ్యాన్ని ధ్వంసం చేసారు. ఆ యుధ్ధాలు అన్నింటికి యుద్ధభూమి రాయలసీమే!
(సశేషం)
రచనలతో పాటు సంఘసేవకుడిగా ప్రసిద్ధిచెందిన బెల్లంకొండ నాగేశ్వరరావు 12-05-1954 నాడు గుంటూరులో జన్మించారు. వీరి నాలుగు వందలకు పైగా రచనలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. రాష్ట్రేతర బాలసాహితీవేత్తగా జాతీయస్థాయి గుర్తింపు పొందిన నాగేశ్వరరావుకి రావూరి భరధ్వాజ స్మారక తొలి పురస్కారం లభించింది. చెన్నైలో తెలుగులో చదివే బాలబాలికలకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™