కురుస్తున్న మంచుబిందువుల జల్లుల్లో
తడుస్తూ నడుస్తున్నాను!
జతగా నువ్వు ..
నా తోడై కలిశాక
అడుగులు ధీమాగా ముందుకే సాగుతున్నాయి!
సంపెంగలు,సన్నజాజులు
పున్నాగలు,నందివర్ధనాలు
దారికి ఇరువైపులా చేరి
స్వాగతం పలుకుతుంటే
సుపరిమళాల నడుమ
‘నేస్తమైన’ నీ చిరునవ్వుల సడిలో..
తన్మయమై.. వలపుపారవశ్యంలో..
చైతన్యమై..సంబరంగా..
అడుగులు ధీమాగా ముందుకే సాగుతున్నాయి!
గెలుపుశిఖరాలపై.. విజయబావుటా ఎగురవేయాలని..
ప్రేరణ నరనరాన విజయకాంక్షను నింపగా..
అడుగులు ధీమాగా ముందుకే సాగుతున్నాయి!

గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.