అది అవని, అందులో ఓ వని
ఆమని వస్తే చెప్పను ఏమని
ఏ కవనము వర్ణించగలదు
ఆ వన విలాసము
మలయమారుతము వీయగనే
తరువులు తన్మయమై తలలూపును
కోయిల గానం హాయిగ వినగలం
మయూరి వయారి నాట్యం
హరిణముల పరుగుల విన్యాసం
శశి సమూహములను చూడ
మేఘమాల భువిపై దిగినట్లు
కుసుమ సుగంధ ఆఘ్రాణం
మత్తెక్కించి మైమరపు కలిగించు
అది ఒక హిరణ్య అరణ్యం-.
.నాడు…………
మరి నేడు…?
కర్కశ ముష్కరుల యంత్రఛేదనంతో
కూలిపోయిన మహా వృక్షాలు
గూడు లేక చెదరిపోయిన పక్షులు
నీడలేక బెదిరిపోయిన మృగాలు
గాలిలేక ఆరిపోయిన ఆకాశం
వానలేక ఎండిపోయిన నేల
నీరులేక తడారిన గొంతులు
ఎడారిగా మారిన హరితవనం
ఈ వేదన రోదన వినేదెవరు
అడవితల్లిని సాకేదెవరు
ఈ నా వనగీతి అరణ్యరోదనే కదా….!

భావుకుడు, కవి శంకరప్రసాద్. ఇప్పుడిప్పుడే తన కవితలతో, కథలతో సాహిత్య ప్రపంచంలోకి అడుగిడుతున్నాడు.
6 Comments
KSRAO
Shankar is a very thought provoking poet. It’s always inspiring to read his poems . He would soon be a great poet in Telugu.
Best Regards,
K S Rao
Shanker Prasad
Thanks Koti
Raghava
Very nice, you have touched the tender
s, Raghava.
Shanker Prasad
Thanks Sir
Sureshkumar
……ఈ. నా వనగీతి అరణ్యరోదనే కదా!!!!
కాకూడదని ఆశిద్దాం…సురేష్ కుమార్ భోగెల.
Shanker Prasad
As you wish Suresh