సంచికలో తాజాగా

ఘాలి లలిత ప్రవల్లిక Articles 1

శ్రీమతి ఘాలి లలితా ప్రవల్లిక కవయిత్రి, కథా, నవలా రచయిత్రి. మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాలసంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల వెలువరించారు. త్రేతాగ్ని నవల, గగనవీధిలో, కొలిమి అనే నవలలు వివిధ ఆన్‌లైన్‍ పత్రికలలో వ్రాశారు. జీవన సౌందర్యం సరళవచన శతకం, వెన్నెల జలపాతం, ఋతువుల ఆత్మకథ (దీర్ఘ కవిత) వంటి కవితలు తపస్వి మనోహరంలో వచ్చాయి. మిన్నాగు, మేఘమహల్, సైకత శిల్పం, అశ్రుతర్పణం అముద్రిత నవలలు. అనేక పత్రికలలో అనేక ప్రభుత్వ, ప్రభుత్వేతర సంకలనాలలో, రేడియోలో కవితలు, కథలు, గజల్స్, పద్యాలు, నానీలు, నాటికలు గేయాలు వెలువడ్డాయి. కథలకు, కవితలకూ అన్నిరకాల బహుమతులూ పొందారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి పలు పురస్కారాలు, బిరుదులు పొందారు. పలు సాహితీసంస్థలలో వివిధ హోదాలలో సేవలందిస్తున్నారు. అక్షర యాన్ బాల బాలికా అధిపతిగా, బాలికా, బాలుర విభాగములను నెలకొల్పి, వారిలో రచనా శక్తి పెంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో వారికి పోటీలు నిర్వహిస్తూ.. వారి రచనలు పత్రికలలో వచ్చేట్టు చేస్తున్నారు. N.H.R. Creations అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా (మాయాలోకం) కథా పఠనం చేయిస్తున్నారు.

All rights reserved - Sanchika®