సంచికలో తాజాగా

గోటేటి లలితాశేఖర్ Articles 9

శ్రీమతి గోటేటి లలితా శేఖర్ గారి జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామం. ఇప్పటి వరకు వివిధ వారపత్రికల్లో వచ్చిన కథలు ముప్పై. ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం చేయబడిన కథానికలు నాలుగు.'రాగ రంజిత' పేరుతో ఒక అనుబంధ నవల, 'మూడో అందం' పేరుతో వచ్చిన కథల సంపుటి. 'ఐదు కలాలు ఐదేసి కథలు' సంకలనం, 'సంగమం' కధల సంపుటి, పలు సభల్లో సాహితీ ప్రసంగాలు. 2018 లో యువ కళావాహిని వారి 'తెలుగు వెలుగులు' అవార్డ్ అందుకున్నారు. 2018 గుంటూరులో ఆదర్శ్ రోటరీ వారు 'ది బెస్ట్ ఉమన్ రైటర్ ఆఫ్ గుంటూరు' తో సత్కరించారు. చదువు ఎం.ఎ. ఉద్యోగం - గుంటూరు అపెక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ నందు ఫ్యాకల్టీగా 14 ఏళ్ల అనుభవం. తండ్రి డా. భోగరాజు వెంకట జోగిరాజు, తల్లి శ్రీమతి భోగరాజు సీతా కృష్ణకుమారి, భర్త రాజశేఖర్, కొడుకులు కోడళ్ళు, డాక్టర్ చైతన్య, ప్రవల్లిక ఆదిత్య, ప్రియాంక. చిరునామా: కంచర్ల పేరడైజ్- 2బి, శ్యామల నగర్, 5వ లైన్, గుంటూరు- 522006

All rights reserved - Sanchika®

error: Content is protected !!