[ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్. సియస్. శర్మ రచించిన ‘డాక్టర్ అన్నా బి.యస్.యస్.’ నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]
[అన్నాకి పావని ఫోన్ చేసి మర్నాడు తాను అన్నాని హాస్పిటల్లో కలవబోతున్నానని చెప్తుంది. ఫోన్ చేసింది ఎవరని శ్యామ్ అడిగితే, తనతో పాటు విమానంలో ప్రయాణించిన పావని అని, తనని కలవాడిని వస్తానంది అని చెప్తాడు అన్నా. ఎందుకొస్తోందో అడిగావా అని శ్యామ్ అడిగితే, ఆడపిల్లల విషయంలో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని అన్నా బదులిస్తాడు. తర్వాత శ్యామ్‌ని నిర్మాణంలో ఉన్న తమ హాస్పిటల్ వద్దకు వెళ్ళి పనులను పరిశీలించమని చెప్తాడు అన్నా. శ్యామ్ వెళ్ళిపోతాడు. ఇంతలో అన్నాకి నారాయణమూర్తి ఫోన్ చేస్తాడు. తన మిత్రుడు, అన్నా తండ్రి ధర్మతేజ చనిపోయినట్టు శ్యామ్ ద్వారా తెలిసిందని చెప్పి, అన్నాకి ధైర్యం చెపుతాడు. తను ఫోన్ చేసిన అసలు కారణం చెప్తాడు. మర్నాడు పార్వతి పుట్టినరోజు అని, అన్నా తప్పకుండా రావాలని ఆహ్వానిస్తాడు. సాయంత్రం ఏడు గంటలకి వస్తానని చెప్తాడు అన్నా. మర్నాడు ఉదయం డా. శృతితో కలిసి రౌండ్స్ ముగించుకుని వచ్చాకా, ఎండి పార్వతీశం అన్నాకి కబురు చేసి తన గదిలోకి రమ్మంటాడు. అక్కడ పావని ఉంటుంది. పావని తన స్నేహితుని కూతురని, ఆమెకి శిక్షణ ఇవ్వమని అన్నాకి చెప్తాడాయన. తాను ఆమెను ఇంతకుముందు ఫ్లయిట్లో కలిసిన సంగతి పార్వతీశానికి చెప్తాడు అన్నా. పావని బాధ్యతని అన్నాకి అప్పజెప్తాడు. ఇంతలో పార్వతి అన్నాకి ఫోన్ చేసి సాయంత్రం తమ ఇంటికి వస్తున్నారు కదా అని అడుగుతుంది. వస్తున్నానని చెప్తాడు అన్నా. డా. శృతికి పావనికి పరిచయం చేస్తాడు. తమ బృందంలో పావని చేరుతోందని చెప్తాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు అన్నా. మాధవయ్య తన ఊరికి వెళ్ళిపోతానంటే, వద్దని కొన్ని రోజులు ఇక్కడే ఉండాలని నచ్చజెబుతాడు. ఈలోపు శృతి ఫోన్ చేసి, పావని భుజంగవర్మ కూతురని తెలిసిందని అన్నాకి చెపుతుంది. ఫర్వాలేదు, ఏం కాదు అని అంటాడు అన్నా. పార్వతి కోసం చక్కటి వాచ్ కానుకగా కొని వాళ్ళ ఇంటికి చేరుతాడు అన్నా. వారంతా అన్నాని సంతోషంగా స్వాగతిస్తారు. ఇక చదవండి.]
“రండి బాబు.. రండి..” అంది ఇంద్రజ.
పార్వతి అన్నాను సమీపించి “గుడ్ ఈవినింగ్..” చిరునవ్వుతో మెల్లగా చెప్పింది.
“లేటయిందా!..”
“లేదు.. యు ఆర్ ఇన్ అడ్వాన్స్..”
అందరూ ఆనందంగా నవ్వుకున్నారు.
వేరే గదిలో ఉన్న బంధుగణం ఆడా మగ దాదాపు ఇరవైమంది హాల్లోకి వచ్చారు. వారికి నారాయణమూర్తి అన్నాను పరిచయం చేశాడు.
సభాముఖంగా అందరినీ ఓ సారి చూచి చిరునవ్వుతో చేతులు జోడించాడు అన్నా..
ఆ ఫోజ్‌ను మాధవ్ ఫొటో తీశాడు. అందరినీ కవర్ చేస్తూ వీడియోను కూడా తీశాడు.
అందరూ టేబుల్ పైన వున్న కేక్‌ను చుట్టుముట్టారు. మాధవ్ రెండు పెద్ద క్రొవ్వొత్తులను ఓ వైపు ఏడు చిన్న క్రొవ్వొత్తులను వాటికి ఎదుటి వైపు అమర్చి వెలిగించాడు.
అందరూ చెప్పగా నవ్వుతూ పార్వతి జ్యోతులను వూది ఆర్పింది. కేకు కట్ చేసి ముక్కలను తన తల్లి.. తండ్రి.. తమ్మునికి నోటికి అందించింది. వారూ ఆమెను తినిపించారు.
పార్వతి అన్నాకు ఒక ముక్కను అందించింది. చిరునవ్వుతో అందుకొన్నాడు అన్నా.. తిన్నాడు..
పార్వతి నయనాలు అన్నా నయనాలను ఎంతో ప్రీతిగా చూచాయి.
అందరూ కేకు తిన్నారు. పార్వతిని ఆశీర్వదించారు.
తెచ్చిన కానుకలను పార్వతికి అందించారు అందరూ..
చివరగా అన్నా తాను వాచ్ ప్యాకెట్‌ను పార్వతికి అందించి “విష్ యు 120 గ్రేట్ రిటన్స్ ఆఫ్ డే.. గాడ్ బ్లెస్ యు..” తన మనోభావాన్ని చెప్పాడు.
చిరునవ్వుతో.. పార్వతి పాకెట్‌ను అందుకొంది.
వచ్చిన వారిలో చాలా మంది.. ఇరుగు పొరుగులు బఫే డిన్నర్ చేయడం ప్రారంభించారు.
అన్నా ఓ ప్రక్కగా నిలబడి వాచ్‌ని చూడ్డం పార్వతి గమనించింది.. పార్వతి అతన్ని సమీపించి.. చేసిన పదార్థాల పేర్లను చెప్పి..
“ఏం తీసుకొంటారు?..” ఆప్యాయంగా అడిగింది.
“పెరుగన్నం.. వడ..” చిరునవ్వుతో చెప్పాడు అన్నా..
పార్వతి వెళ్లి రెండు ప్లేట్లలో అన్నాచెప్పిన పదార్థాలను పెట్టుకొని అన్నాను సమీపించి ఒకదాన్ని అన్నాకు అందించింది. “ప్లీజ్!.. హ్యావ్!..” ఎంతో అభిమానంనతో చెప్పింది.
“ఓకే.. థాంక్యూ..”
“నో మెన్షన్ ప్లీజ్!.. ఇటీజ్ మై డ్యూటీ.. యు ఆర్ మై..” ఆగిపోయింది పార్వతి నవ్వుతూ..
“గెస్టు!..” వెంటనే నవ్వుతూ అన్నాడు అన్నా.. పార్వతి భావనను బయట పెట్టనీయకుండా..
“ఇంకా ఏమైనా కావాలా!..”
“మీ చేయి చాలా పెద్దది.. చాలా పెట్టారు.. అంతా తినలేను..”
“ఓ సారీ!.. కావల్సినంత మాత్రమే తినండీ.. సరేనా!..”
“ఆ.. అలాగే..”
“మొహమాట పడకండి. నేను అమ్మా నాన్నా తప్పుగా అనుకోము.. మీ విషయంలో!.” చిరునవ్వుతో చెప్పింది పార్వతి.
మాధవ్ ఇరువురికీ మంచినీళ్ల గ్లాసులు అందించాడు. “ఏమైనా కావాలా..” అడిగాడు.
ఇరువురూ వద్దు అన్నట్టు తలలు ఆడించారు.
నారాయణమూర్తి.. ఇంద్రజ వచ్చి అన్నాను భోజనం ఎలా వుందని అడిగారు.
“ఎక్స్లెంట్ సార్!..” అని చెప్పి ప్లేటును ప్లాస్టిక్ ట్రేలో వేసి చేయి కడుక్కొన్నాడు.. అన్నా.
మాధవ్ టవల్ అందించాడు. తుడుచుకొని నారాయణ మూర్తిని సమీపించి.. “సార్ ఇక నేను బయలుదేరుతాను.. గుడ్‌నైట్..” చెప్పి వేగంగా ఆ హాలునుండి బయటికి నడిచాడు అన్నా.
***
పదిన్నరకు అన్నా రాజమండ్రిలో ప్రవేశించాడు. రైల్వే స్టేషన్ వద్ద ఆశ్రమాలను గురించి విచారించాడు. వయన్పయిన పండ్ల వ్యాపారి రెండు పేర్లను చెప్పాడు.. అన్నా.. ఏ ప్రాంతంలో ఉన్నది తెలిసికొన్నాడు..
హెూటల్ రూమ్‌లో బస చేశాడు. ఉదయం.. ఆరుగంటలకు లేచి కాలకృత్యాదులు తీర్చుకొని టిఫిన్ తిని క్రిందికి దిగి కార్లో కూర్చున్నాడు.
సెల్ మ్రోగింది.. నారాయణ మూర్తిగారి కాల్..
“నారాయణ మూర్తిగారు కదూ!..”
“అవును బాబూ..”
“గుడ్‌మార్నింగ్ సార్!..”
“బాబూ!..”
“ఏమిటండీ విషయం?..”
“ఎక్కడవున్నారు బాబూ?..”
“రాజమండ్రి.. ఓ ముఖ్యమైన పనిమీద వచ్చాను!..”
“ఓ.. అలాగా!..”
“అవునండీ.. ఆ.. ఎందుకు ఫోన్ చేశారో చెప్పలేదు!..” చిరునవ్వుతో అడిగాడు అన్నా.
“ఆ.. మరేంలేదు బాబూ.. అమ్మాయి..”
“ఎవరూ.. పార్వతా !.. ఏమయిందండీ?..” ఆతృతతో అడిగాడు అన్నా..
“ఏం కాలేదు బాబూ.. నిన్న మీరు తనకు చెప్పకుండా వెళ్లిపోయారని..”
“బాధ పడుతూవున్నారా!..”.
“అవును బాబూ!..”
“ఫోన్ ఒకసారి వారికి ఇస్తారా!..”
“అలాగే బాబూ..”
ప్రక్కనే వున్న పార్వతికి సెల్ అందించాడు నారాయణమూర్తి.
“హలో!..” మెల్లగా అంది పార్వతి.
“ఆ.. పార్వతి గారూ!.. నేను బయలుదేరాలనుకొన్నప్పుడు మీరు నాకు కనిపించలేదు. అవసరం.. బయలుదేరాను..” అనునయంగా చెప్పాడు అన్నా..
“అలాగా!..” సాగదీస్తూ మెల్లగా అంది పార్వతి.
“అవునండీ..”
“ఓకే.. ఓ మాట చెప్పాలి!..”
“ఎవరు.. నేనా.. మీరా!..”
“అబ్బా.. మీరు చాలా స్పీడ్..”
“అవునండీ.. టైమ్ సెన్స్!.. ఇంతకీ విషయం?..”
“మీ వాచ్.. చాలా బాగుంది.. అందరికీ నచ్చింది..”
“ఓకే.. సంతోషం..”
“ఎందుకు?..”
“మీకు నచ్చినందుకు..”
“ఎప్పుడు తిరిగి వస్తారు?..”
“పని పూర్తికాగానే..”
“సరే!.. జాగ్రత్త..”
“థాంక్యూ.. పార్వతి గారూ!..”
“నో.. గారూ.. పార్వతి ఒన్లీ..” అందంగా నవ్వింది పార్వతి.
చిరునవ్వుతో అన్నా ఫోన్ కట్ చేశాడు.
కొద్ది నిముషాల్లో అన్నా కారు.. ఆశ్రమం ముందు ఆగింది. కారు కాంపౌండు వాల్ ప్రక్కన ఆపి.. గేట్ కీపర్ పర్మిషన్తో
లోపలికి ప్రవేశించాడు. ఆఫీస్ గదిని సమీపించాడు.
గదినుంచి బయటకు వచ్చిన ఒక వనిత అన్నాను ఆశ్చర్యంగా చూసి విష్ చేసింది.
“సర్.. ఎవరు కావాలి?..”.
“ఈ ఆశ్రమ స్థాపకులు..”
ఆఫీసు గదిలో గోడకు వున్న ఫొటోను చూపుడు వ్రేలితో చూపిస్తూ..
“వారే సార్!.. పేరు వెంకటేశ్వర్లు గారు!..
“వారిని నేను కలవాలి..” అని,
“ఆసీస్ వ్యవహారాలు అంటే రికార్డు అనీ ఎవరు చూస్తుంటారండి..” అని అడిగాడు.
“నేనేనండీ.. నా పేరు సుమతి.. సార్!..”
“మీరు ఎంతకాలంగా పనిచేస్తున్నారు?..”
“పది సంవత్సరాలుగా..”
“నాకు ఇరవై సంవత్సరాలు క్రిందటి ఇన్ఫర్మేషన్ కావాలి!..” జిజ్ఞాసగా చెప్పాడు అన్నా.. కొన్ని క్షణాల తర్వాత..
“అన్ని సంవత్సరాల క్రిందటి రికార్డును భద్రంగా వుంచారా!..” ప్రాధేయ పూర్వకంగా అడిగాడు అన్నా..
“సార్.. మొదటి నుంచి రికార్డులన్నింటినీ భద్రంగా వుంచుతారు..” అంది సుమతి.
“వారు ఎప్పుడు వస్తారు?..”.
“సాయంత్రం నాలుగు గంటలకు..”
“అవి ఎక్కడ ఉన్నదీ మీకు తెలుసా!..”
“తెలుసు కానీ.. వాటిని సార్ పర్మిషన్ లేకుండా బయటికి తీయకూడదు. తాళాలు వారి వద్దనే ఉంటాయి..”
“ఓహో.. ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు?..”
“రెండు వందలమంది.. నూట ఇరవై బాలికలు.. ఎనభైమంది బాలురు..”
“వారికందరికి సరిపోయే గదులు.. వసతులు ఉన్నాయా!..”.
“ఆ.. వున్నాయి సార్.. అమెరికా నుంచి ఒక మహానుభావుడు నెలకు లక్ష రూపాయలు పంపుతారు. వారే కాక మరికొందరు వారివారికి తోచిన సహాయాన్ని ఆశ్రమానికి చేస్తూ వుంటారు. పన్నెండు మంది టీచర్సు.. పాతికమంది ఆయాలు ఉన్నారు. ఈ ఆశ్రమ విస్తీర్ణం పదిహేను ఎకరాలు.. బిల్డింగ్సు, స్కూలు హాస్టల్ ఐదెకరాల్లో ఉన్నాయి.. పది ఎకరాల్లో వ్యవసాయం.. ధాన్యం, కూరలు, పండ్లు.. అన్నీ ఆయా ఋతువుల ప్రకారం పండుతాయి..” చిరునవ్వుతో చెప్పింది సుమతి.
“సరే అమ్మా!.. నేను నాలుగు గంటలకు వస్తాను. అమెరికా నుంచి ఓ మహానుభావుడు.. అన్నారే.. వారి పేరు మీకు తెలుసునా!..”
“తెలుసు సార్!.. ధర్మతేజ..”
‘ఆ..’ ఆశ్చర్యపోయాడు అన్నా.. ఆ మహనీయుడు తన తండ్రి ధర్మతేజ.. ముఖంలో ఎంతో సంతోషం.. మనస్సున ఎంతో ఆనందం.. ‘నాన్నా.. నాన్నా!.. యు ఆర్ రియల్లీ గ్రేట్.. గ్రేట్!..’ అనుకొన్నాడు. ఆనంద పారవశ్యంతో ఆమెకు నమస్కరించి ఆ ఆవరణాన్ని దాటి కార్లో రూమ్‌కు చేరాడు.
నాన్నగారికి.. వెంకటేశ్వర్లు గారికి ఏమిటి సంబంధం?.. ఏ కారణంగా ప్రతి నెలా లక్షరూపాయలు ఆ ఆశ్రమానికి నాన్నగారు పంపుతున్నట్లు?.. ఏదో ఒక కారణం వుండాలి కదా!.. వారు వ్రాసిన.. ‘నేను ఆశ్రమానికి ఇచ్చింది చాలా తక్కువ.. వారు నాకు ఇచ్చింది ఎంతో ఎక్కువ..’ ఆ పదాలకు అర్థం ఏమిటి?.. ఆ ఆశ్రమవాసులు నాన్నగారికి ఇచ్చిన విలువ కట్టలేనంతది ఏమై వుంటుంది?.. ‘ఈ సందేహాన్ని తీర్చగలవారు ఆ వెంకటేశ్వర్లు గారే!..’ అన్నా మనస్సు ఎంతో వ్యాకులం..
తల్లిమాటలు జ్ఞప్తికి వచ్చాయి.
“చిన్నా!.. మనస్సుకు అశాంతి సోకితే.. భగవన్నామ స్మరణ.. హరి ఓం.. హరి ఓం.. శివ ఓం.. శివ ఓం.. అనేది సరియైన మందు.. ఇది నా స్వానుభవం.. నువ్వు పాటించు నాన్నా!..”
గుర్తుకు వచ్చిన ఆ శాంతి మంత్రాన్ని జపిస్తూ శయనించాడు అన్నా.
మూడు గంటలకు లేచి.. రెడీ అయి.. ఆశ్రమానికి బయలుదేరాడు.. మార్గంలో పిల్లలకు చాక్లెట్సు కొన్నాడు.
నాలుగు గంటలకల్లా ఆశ్రమంలో ప్రవేశించాడు. ఆఫీస్ రూమ్‌ను సమీపించాడు.
సుమతి లోన వున్న కిటికీ గుండా అన్నాను చూచింది. బయటికి వచ్చింది.
“సార్ వున్నారు. వేరొకరితో మాట్లాడుతున్నారు. మీరు కొంతసేపు వెయిట్ చేయాలి!..” సాదరంగా చెప్పింది.
తన చేతిలోని చాక్లెట్ల కవర్లను సుమతికి అందిస్తూ..
“పిల్లలకు చాక్లెట్లు.. ప్లీజ్ తీసుకోండి..” అభిమానంతో చెప్పాడు అన్నా..
(ఇంకా ఉంది)
సిహెచ్. సి. ఎస్. శర్మ అనే కలం పేరుతో రచనలు చేసే శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి జననం నెల్లూరు జిల్లా, కోవూరు తాలూకా ఊచగుంటపాళెంలో జరిగింది. ప్రాథమిక విద్య పెయ్యలపాళెం, బుచ్చిరెడ్డిపాళెంలోనూ, ఉన్నతవిద్య నెల్లూరులోనూ.
సివిల్ ఇంజనీరుగా రాష్ట్రంలోని పలు సంస్థలలో వివిధ హోదాలలో పని చేసి చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరక్టర్ స్థాయికి ఎదిగారు.
చిన్ననాడు బామ్మగారు చెప్పిన కథలతో ప్రేరణ పొంది బాల్యం నుంచే రచనలు చేశారు. మిత్ర రచయితల ప్రోత్సాహంతో రచనా రంగంలో విశేషంగా కృషి చేశారు. 20 నవలలు, 100 కథలు, 12 నాటికలు/నాటకాలు, 30 కవితలు రాశారు.
వివిధ సాహితీ సంస్థల నుంచి పలు పురస్కారాలు పొందారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
స్ఫూర్తిదాయక మహిళలు-1
అలనాటి అపురూపాలు-33
పదసంచిక-75
మహాప్రవాహం!-27
ఉర్దూ భాష స్త్రీ వాద రచయిత్రి ఇస్మత్ చుగ్తాయి కథలు, వ్యాసాల ఆంగ్లానువాదం LIFTING THE VEIL
సంభాషణం: మేడిశెట్టి తిరుమల కుమార్ అంతరంగ ఆవిష్కరణ
కశ్మీర రాజతరంగిణి-30
పొత్తాలు
యుద్ధ పోరాటం..
రెండు ఆకాశాల మధ్య-50
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®