సంచికలో తాజాగా

Related Articles

23 Comments

  1. 1

    Sagar

    అన్నీ అనుకున్నట్లు జరగకపోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తారసపడే సంఘటనలే సర్ . అయితే పుస్తకాన్ని మీ అత్తగారికి అంకితం ఇవ్వాలనే మీ ధృక్పదం ముందు అన్నీ తేలిపోయి కొంచెం ఆలస్యమైనా మేడం గారి పుట్టినరోజు కూడ కలసి వచ్చిన ఆనంద సమయంలో పూర్తికావడం ఆనందించవలసిన విషయం. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు.

  2. 2

    డా. సిహెచ్. సుశీల

    మనిషి జీవితంలో క్రమశిక్షణ ఎంత అవసరమో నిక్కచ్చిగా చెప్పారు ప్రసాద్ గారు! మనం నియమంగా కొనసాగించాలనుకొనే కఠినమైన క్రమశిక్షణ ఒక్కోసారి ఇబ్బంది కలిగించవచ్చు. బాధని మిగల్చవచ్చు. కానీ నమ్ముకొన్న ధర్మం, నడుస్తున్న క్రమశిక్షణ ఎప్పటికైనా విజయవంతమైన ముగింపు నిస్తుంది. ఆశించిన దానికంటే మిక్కుటమైన ఆనందాన్నిస్తుంది. దానికి మీ పుస్తకావిష్కరణే మరో నిదర్శనం. మంచి సంకల్పానికి ఒక్కోసారి ఊహించని ఆటంకాలెదురైనా, ఓర్పు సహనాలతో ఎదురుచూస్తే ఆనందంతో కూడిన సంతృప్తి అందివస్తుంది.
    నాలుగో కధల సంపుటి ఆవిష్కరణ సందర్భంగా అభినందనలు.

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      హృదయపూర్వక ధన్యవాదాలు.
      మీ స్పందనకు ప్రత్యేక ధన్యవాదాలండీ.

  3. 3

    Shyam kumar chagal . MA astrology. Hyd

    క్రమశిక్షణ వల్లనైతేనేమి అనుకున్నది సాధించాలనే పట్టుదల తో అయితేనేమి మొత్తానికి విజయం సాధించడం అన్నది డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ కి వెన్నతో పెట్టిన విద్య. ఈ రోజుల్లో పుస్తకం రాయడం దాని ప్రచురించడం అనుకున్నంత తేలికైన పని కాదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అప్పటికీ వాటిని అధిగమించి తను అనుకున్నది సాధించిన రచయితకు నా అభినందనలు. పుస్తక ఆవిష్కరణ చాలా మంచి శుభ ముహూర్తంలో చేయటం సంతోషదాయకం. కాకపోతే నేను అందులో పాల్గొన్న లేకపోవటం నా లోపమని భావిస్తాను. ఇక ముందు ముందుగా తను రాయబోయే కథల పుస్తకాల ఆవిష్కరణ కు నేను కూడా పాల్గొనాలని నా కోరిక. వారం వారం జ్ఞాపకాల రూపంగా ఇంటర్వ్యూల రూపంగా ఎంతోమంది జీవిత సాఫల్య లను మన ముందుకు తీసుకు వస్తున్న రచయిత ప్రసాద్ గారి ఓపికకు మరియు సాహిత్యం మీద ఉన్న అంకితభావానికి నా జోహార్లు

    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      నీ స్పందన కు ధన్యవాదాలు శ్యామ్.

  4. 4

    డి. వి. శేషాచార్య

    మీ పట్టుదల, క్రమశిక్షణ లకు అభినందనలు.
    ఆటంకాలనన్నింటినీ అతిగమించి మేడమ్ గారి పుట్టిన రోజున ఆవిష్కరణ చేయడం మీ దాంపత్య మాధుర్యానికి ప్రతీక గా వుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆవిష్కరణ చేయడంతో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినారు.

  5. 5

    ఎన్.వి.ఎన్.చారి

    ముందుగామీ ఆహార్యానికి అభినందనలు
    ఏ సమయానికి ఏది జరగాలో విధి.నిర్ణయిస్తుంది.తదనుగుణంగా.వ్యవహరించడమేమన విధి. చక్కని జీవన సహచరిని భాగస్వామిని
    ప్రసాదించిన అత్తగారికి మంచిపుస్తకాన్ని.అంకితం ఇచ్చి తదృణాన్ని తీర్చుకున్నారు

    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    76 వ సంచిక ఇవాళనే చదివిన.క్రమశిక్షణ ఈసారి విషయమన్నమాట.
    అట్లా క్రమశిక్షణ పిల్లలకు అలశాటూచేయాలనుకున్న నా మిత్రుడొకరు క్రమ శిక్షణ నేర్పలేకపోగా మానసిక వ్యథకు గురైండు.ఒక దశలో మనమనుకున్న క్రమశిక్షణ తమకో గుదిబండ అని పిల్లలు భావించటమూ జరుగవచ్చు. దానివలన సంబంధాలు మారనూ వచ్చు.నేను మామిత్రునితో అనేవాడిని–నియమబద్ధంగా వుండటం మంచిదే గాని మొండితనం పనికి రాదేమో.to be principled is good but to be rigid is not advisable. అయితే ఇదంతా ఒకరినొకరు అర్థం చేసుకోవటంవో ఉంటది
    —-రామశాస్త్రి

    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  7. 7

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    Nizame!
    Pusthaka prachurana ee rojullo chaalaa kashtame!
    Kaani meeru maro pusthakam prachurinchinanduku Dhanyavaadaalandi 🙏

  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    “ అంతామనమంచికే “ అన్నమాట ఒకటుంది … ఇప్పుడు మీ కథలపుస్తక ప్రచురణ అనుకున్న సమయం మించిపోయి కొంత బాధ కలిగించినా , గొప్ప సందర్భశుద్ధి తో ఆవిష్కరణ కొత్తపద్ధతిలో చక్కగా జరిగింది … అభినందనలు మిత్రమా !!
    ముందు ప్రొలాగ్ లో మీరన్నట్టు క్రమశిక్షణ మనిషి ఉజ్జ్వల భవిష్యత్తుకు అవసరమైన విషయం … కాకపోతే క్రమశిక్షణ ఉండటం , ఇతరులను క్రమశిక్షణ లో ఉంచటం కత్తిమీది సామే , కానీ తప్పదు … దాని ఫలితం మహత్తరంగా ఉంటుంది , సందేహం లేదు …. ఒక్కోసారి పిల్లల్ని దండించాల్సికూడా వస్తుంది కానీ ఆచరించాల్సిందే … మళ్ళీ అర్థవంతం కాని క్రమశిక్షణ పనికిరాదు .. దీనికి కొంత పట్టువిడుపులుండాలి … ముందుగా మనం దాన్ని ఆచరించాలి … ఆ విషయంలో మీరు ఆచరణవాదులే … కొంత అసౌకర్యం ఉన్నా కట్టుబడితే మంచి ఫలితమే ఉంటుంది … ఆలస్యం కావచ్చు … మీ పుస్తకావిష్కరణే చక్కని నిదర్శనం !!!
    —-జి.గిరిజా మనోహర్
    హన్మకొండ.

    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      గురువుగారు.

  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది, ఒక సారి మనం ఎంత ప్రయత్నం చేసినా పనులు ముందుకు సాగవు. మరి కొన్నిసార్లు ఇటే జరిగిపోతాయి,
    ఏదైనా మానవ ప్రయత్నం నూటికి నూరు పాళ్లు ఉండాలి, అని నేను భావిస్తాను, మీ కన్న వయసులో చిన్న వాడిని , ఇలాగ రసానని తప్పు పట్ట వద్దు. 🙏🏻
    —-డా.డి.సత్యనారాయణ
    హైదరాబాద్

  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    డాక్టర్ గారు నమస్కారం  .                            పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కుటుంబ సభ్యుల మధ్య సాంప్రదాయబద్ధంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. వ్యయ ప్రయాసలకోర్చి అన్ని అడ్డంకులను అధిగమించి మేడం గారి షష్టిపూర్తి సందర్భంగా   ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం మీ అఖండిత దీక్షకు నిదర్శనం . ప్రత్యేకంగా ఈ పుస్తకాన్ని మీకు మాతృ సమానురాలైన అత్త గారికి అంకితం ఇవ్వటం… మీరు పెద్దలకు ఇస్తున్న గౌరవానికి చిహ్నం. ఈ కార్యక్రమము జరిగిన క్రమము, మధ్య మధ్యలో ఛాయాచిత్రాలు, మీరు తెలియజేసిన విధానము అక్షర రూపంలో  ఉన్నా ,ఆ సన్నివేశాలను ప్రత్యక్షంగా వీక్షించిన అనుభూతి కలుగుతుంది.
    ఇటువంటి పుస్తకాలు ఎన్నో మరెన్నో రావాలని మనసారా ఆకాంక్షిస్తూ…. రామకృష్ణారెడ్డి.

    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారూ
      ధన్యవాదాలండీ

  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరిలో జీవితంలో క్రమశిక్షణ ప్రాధాన్యత వివరించారు. నిజంగా ప్రతి ఒక్కరి జీవితంలో అడుగడుగునా క్రమశిక్షణ అవసరమే. కథల సంపుటి ప్రచురణ మీరు అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయినా, మీ శ్రీమతి అరుణ గారి 60వ పుట్టిన రోజున ఆవిష్కరించడం బాగుంది. చక్కటి కథనంతో సాగింది మీ రచన. అభినందనలు.
    –జి.శ్రీనివాసాచారి
    కాజీపేట

  12. 12

    Rajendra+Prasad

    Dear Sir
    Two good occasions. Congratulations to your entire family in particular ma’am.
    I am interested to read your new book. It is true that instead of gain, a writer nowadays has to spend a lot for his/her book. All the best sir

  13. 13

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 76 సంచిక జీవితంలో క్రమశిక్షణ ప్రాధాన్యతను చక్కగా వివరించారు.మీరు వ్రాసిన (కథలు)పుస్తకాన్ని మీ అత్తగారి పుట్టిన రోజు వరకు తేవాలనుకున్న, అది ఆలస్యం కావడం అనుకోని పరిస్థితుల్లో వారు అత్తగారు మీ ఇంటికి రావడం యాదృచ్చికంగా జరిగి,సెప్టెంబర్ నెలలో మీ శ్రీమతి గారికి 60 సంవత్సరాలు నిండిన సందర్భంలో కల్సి వచ్చిన సెప్టెంబర్ 12 న పుస్తక ఆవిష్కరించే నిర్ణయం, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మీ కుటుంబ సభ్యుల మధ్యలో కార్యక్రమ రూపకల్పన భాధ్యతను పూర్తిగా మీ కూతురు వారి అన్న గారి సూచనలతో చక్కగా నిర్వహించిన వారికి అభినందనలు మరియు పుస్తక ఆవిష్కరణ చాలా మంచి శుభ ముహూర్తంలో చేసి మీరు అనుకున్న విధంగా మీ అత్తగారికి అంకితం ఇవ్వడం ఒక అద్భుతం సర్. మీ పుస్తకాన్ని మీ అత్తగారికి అంకితం ఇవ్వాలనే దృక్పధం,కొంచెం ఆలస్యం అయినా మేడంగారి పుట్టినరోజు కూడా కల్సి వచ్చిన సమయంలో పూర్తి కావడం ఆనందించవల్సిన విషయం. డాక్టరు గారికి హృదయపూర్వక నమస్కారములు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!