[శ్రీ కస్తూరి రాజశేఖర్, కస్తూరి వేణుగోపాల్ రచించిన ‘జైత్రయాత్ర’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[రాయుడు పాలెం జిల్లా కేంద్రానికి 150 కిలోమీటర్ల దూరంలో ఎవరికీ పట్టనట్టు విసిరేసినట్టుండే పల్లె. రాయుడు ఆ ఊరి మోతుబరి. తన పల్లె వేపు ఎవరూ చూడకుండా, తన అధికారానికి అహంకారానికి ఎదురు లేకుండా జాగ్రత్తపడుతూంటాడు. ఆ ఊర్లో మొబైల్ సిగ్నల్స్ కోసం ప్రయత్నం చెయ్యనివ్వలేదు. అరకొరా సదుపాయాలున్నా వాటిని ప్రజల వరకూ చేర్చనీయకుండా, వాళ్ళని తన అదుపాజ్ఞలలో పెట్టుకుంటాడు. ఆ ఊరికి వెంకట్రావు కాలేజీ పిల్లలని ఎన్.సి.సి. క్యాంపుకు తీసుకువస్తాడు. బస్సు లోంచి ఖాకీ దుస్తులు ధరించిన కేడెట్స్ దిగుతుంటే ముందు గ్రామస్థులు భయపడతారు. వెంకట్రావు ఊరి ప్రెసిడెంటు ఎవరని అడిగితే, రాయుడి గుమాస్తా శీనయ్య ముందుకొచ్చి, రాయుడిని చూపిస్తూ ఆ ఊరికి అన్నీ ఆయనే అని అంటాడు. తాము వచ్చిన పని చెప్తాడు వెంకట్రావు. ఊరి బడిలో కుర్రాళ్ళకి వసతి ఏర్పాటు చేయించి, ఆ పూటకి భోజనాలు తమ ఇంటి నుంచి పంపిస్తాడు. సాయంత్రం రాయుడి పిలుపు మేరకు గ్రామస్థులంతా పంచాయితీ ఆఫీసు వద్దకి చేరుతారు. పట్నం విద్యార్థులు గ్రామసేవ కోసం వచ్చారని చెప్తాడు రాయుడు. అంతా కూర్చుని మాట్లాడుకుని ప్రణాళిక తయారు చేసుకుని శ్రమదానం చేద్దామని వెంకట్రావు ప్రతిపాదిస్తాడు. మా ఊరికి బావి తవ్వించండి అంటూ గుంపులోంచి ఎవరో అరుస్తారు. దేవుడు లాంటి రాయుడి గారి బావి ఉండగా మళ్ళీ ఇంకో బావి ఎందుకంటూ శీనయ్య అరుస్తాడు. వాళ్ళ సమస్యలని వాళ్ళనే చెప్పమనండి అని వెంకట్రావు అంటే, నిరక్షరాస్యులు, వాళ్ళేం చెప్తారంటూ కొట్టిపడేస్తాడు రాయుడు. మర్నాడు వంట ప్రయత్నాలు చేస్తూ, నీళ్ళు తెచ్చే బాధ్యతని మిత్రత్రయానికి అప్పజెప్తాడు వెంకట్రావు. ఎనిమిది దాటేసరికి సుబ్బు ఆకలికి ఆగలేకపోతాడు. ఇంకా ఎంతసేపు సార్ అని వెంకట్రావుని అడుగుతాడు. బాగా ఆకలేస్తే మీ అమ్మమ్మ ఇచ్చినవి తిను అంటాడాయన. కాసేపటికి టిఫిన్ రెడీ అవుతుంది. సుబ్బు మూడు పళ్ళేలు పట్టుకెళ్ళడం చూసి, మూడెవరికి అని అడిగితే, ఒకటి నాకు, రెండు నా మిత్రులకి అని చెప్తాడు. వెంకట్రావు బఫే టేబుల్ దగ్గరికి వచ్చేసరికి శ్రీనివాస్, ఆంజనేయులు ఇద్దరూ ఓ ప్రక్కగా తింటూ కనిపిస్తారు. అదేంటి, మీకోసం సుబ్బు టిఫిన్ తీసుకెళ్లాడుగా అని అడిగితే, అటు చూడండి అంటారు వాళ్ళు. అప్పటికే ఆ మూడు ప్లేట్లు తినేసి, మరో మూడు ప్లేట్లలో పెట్టించుకుని వెళ్తుంటాడు. హతాశుడైన వెంకట్రావు, టేబుల్ వైపు చూస్తాడు. సర్వింగ్ టీమ్ ఖాళీ గిన్నెలు తీసేస్తుంటారు. తానింకా తినలేదంటాడు వెంకట్రావు. మీకోసమని చెప్పి సుబ్బు పట్టుకెళ్ళాడు సార్ అంటారు వాళ్ళు. నీరసం, ఆకలితో అక్కడున్న కుర్చీలో కూలబడతాడు వెంకట్రావు. – ఇక చదవండి.]
వెంకట్రావు దూరంగా ఆరుబయట ఓ కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఆ రోజు కార్యక్రమాల్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో –
“నమస్కారమండీ” అంటూ అతని దగ్గరకు వచ్చింది ఓ యువతి.
“నమస్కారం.. మీరూ?”
“నా పేరు విద్య. మా అన్నయ్య పేరు పంచనాథం. సంగీత పాఠాలు చెబుతూ ఉంటాడు. నేను బి.ఏ. చదివాను. ఇక్కడ పిల్లలకి ట్యూషన్లు చెబుతూ వుంటాను.”
“ఐ సీ. గ్లాడ్ టు సీ యు. కూర్చోండి. నా పేరు వెంకట్రావు.. ఏమిటి విషయం?”
విద్య ప్రక్కనే వున్న కుర్చీలో కూర్చుంది.
“మీరు శ్రమదానంతో గ్రామాభ్యుదయం కోసం వచ్చినట్లు తెలిసింది. చాలా సంతోషం. జనాలు కోరినట్లు బావి తవ్వించమని అడిగేందుకు వచ్చాను.”
“నిన్న మీరు మీటింగ్‌కి రాలేదా?”
“వచ్చాను. అందుకే ఇప్పుడు మిమ్మల్ని కలుసుకొని చెప్పాలని వచ్చాను.”
“మరి అక్కడే ఎందుకు చెప్పలేదు?”
“ఈ వూళ్ళో మీటింగులు కేవలం చెప్పేది వినటానికి గానీ, ఎదురుచెప్పేందుకు కాదు.”
“ఊరి వాళ్లందరికీ రాయుడిగారి బావి కల్పతరువులా ఉందని నిన్ననే చెప్పారు కదా..?”
“మీరు నిజంగానే ప్రభుత్వం పంపితే వచ్చారా?”
“ప్రభుత్వం తరఫున స్వచ్ఛందంగా చేయటానికి వచ్చాం. ఎందుకు?”
“మీకు తెలియని కొన్ని నిజాలు చెప్పాలని..”
“చెప్పండి.”
విద్య ఒక్క క్షణం చుట్టూ అనుమానంగా చూసింది. వెంకట్రావు అర్థం చేసుకుని,
“ఏ భయమూ లేదు.. మీరు చెప్పండి.”
“రాయుడి బావి నిజంగా కల్పతరువే.. కానీ, ఊరివాళ్ళకి కాదు.. రాయుడి ఖజానాకు.”
నమ్మలేనట్లు ఆశ్చర్యంగా చూసాడు వెంకట్రావు.
“అవును. ఒక్కో బిందెకు పది రూపాయలు లెక్క రాస్తూ పెరిగిన లెక్కలకు ఏదో ఒక వస్తువో, నగో, మరీ పెరిగినప్పుడు గజం, రెండు గజాలు అంటూ కొండచిలువలా మెల్లగా మాకు తెలీకుండానే మా ఆస్తుల్ని ఆక్రమించేస్తాడు రాయుడు.”
“అలాగా” కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు. “బి.ఏ. తర్వాత ఈ పల్లెటూరికి ఎందుకు వచ్చారు?”
“ఇది నా జన్మభూమి.”
“చాలా సంతోషం. మీ జనాలు మాతో కలసి పనిచేసేందుకు మీరు సహకరిస్తారా?”
తనకర్ధం కానీ రాజకీయాలు ఈ వూళ్ళో ఉన్నట్టు అర్థమౌతోంది.
“మీ సహాయం మా కుంటే మా సహకారం మీ కెప్పుడూ ఉంటుంది..” అని లేచి బయల్దేరింది విద్య.
‘ధర్మో రక్షతి రక్షితః’
***
ఉదయం.
ఎన్.సి.సి. పెరేడ్ మొదలయ్యింది. బళ్ళోనే.
క్యాడెట్స్ కొందరు లేటుగా వచ్చారు. వాళ్ళని మూడు జట్లుగా నిలబెట్టాడు వెంకట్రావు. జట్టుకు ఆరుగురు.
“శ్రద్ధగా వినండి. మీరందరూ ఊరిచివర వేపచెట్టు కొమ్మలు కోసుకుని పావుగంటలో రావాలి. లేటుగా వచ్చిన వారికి బ్రేక్‌ఫాస్ట్ ఉండదు.”
ఎవరికీ వాళ్ళు రెడీ అయిపోయారు.
“సుబ్బిగాడికి ఎన్ని కస్టాలు వచ్చాయిరా.. ఒరేయ్ సుబ్బిగా నువ్వు ఫిక్స్ అయిపో.. బ్రేక్‌ఫాస్ట్ లేదు అని” అన్నాడు శ్రీనివాస్.
“పొనీలేరా.. ముందుగా వస్తే ఏమన్నా డబల్ టిఫిన్ పెట్టారుగా?” అన్నాడు సుబ్రహ్మణ్యం.
“పావుగంటలో రాకపోతే సింగల్ టిఫిన్ కూడా ఉండదు మరి.”
“పర్లేదు.. నాకీపూట బొత్తిగా ఆకలి వేయటంలేదు” బింకంగా అన్నాడు సుబ్రమణ్యం.
“ఏంట్రోయ్.. జోకులేస్తున్నావా?”
“కాదురా.. వాడు గిన్నిస్ బుక్‌లో ఎక్కాలని ట్రై చేస్తున్నాడు.”
“మీరెన్నైనా అనుకోండి. నేను పస్తైనా ఉంటానుగానీ అంత దూరం ఆదరా బాదరా పరిగెత్తటం నా వల్ల కాదు” అన్నాడు మోకాళ్ళు రుద్దుకుంటూ.
“నౌ స్టార్ట్” అని విజిల్ వేసాడు వెంకట్రావు.
అందరూ పరుగు మొదలెట్టారు. ‘తప్పద’న్నట్టు భారంగా అడుగులేస్తున్నాడు సుబ్రహ్మణ్యం. భారీకాయానికి ఆ ప్రయాస భరించలేనిదిగా ఉంది.
ఒకటే రొప్పు.. ఆయాసం.. నీరసం.. మధ్యలో జేబులోంచీ ఇంటినుంచీ తెచ్చిన నిమ్మతొన బిళ్ళలు నోట్లో వేసుకుంటున్నాడు. మళ్ళీ పరిగెత్తుతున్నానుకుంటూ నడుస్తున్నాడు. చిన్న పర్వతం కదులుతున్నట్టూ, గున్న ఏనుగు గునగునా నడుస్తున్నట్టు..
రెండో వార్డు వీధి చివరకొచ్చేసరికి కళ్ళు తిరిగి ఒళ్ళు తేలిపోతోంది.
ఆ ఇంటి ముందు ముగ్గు పెడుతోంది శోభ. పాపయ్యశెట్టి కూతురు. ఆ దెయ్యం లాంటి ముగ్గు చూసి క్రిందపడి పోయాడు..
శోభా అతన్ని చూసి దగ్గరికొచ్చి “అయ్యో.. అబ్బాయి.. అబ్బాయ్.. ఏంటి అట్టా పడిపోయావ్?” అంది.
పలక్కపోయేసరికి సుబ్రహ్మణ్యం నెత్తిన చెంబెడు నీళ్లు కుమ్మరించింది. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు.
“ఏమయ్యింది నీకు?” అడిగింది శోభ.
“మరి.. మరి.. రన్నింగ్..” అంటూ ఏదో చెప్పబోయాడు నెమ్మదిగా లేస్తూ.
“రన్నింగ్ అంటే?” రెట్టించింది శోభా అమాయకంగా. “ఇదీ” అంటూ పరుగెత్తి చూపించబోయి “అబ్బా” అని మూలిగాడు. మోకాలు పట్టేసింది.
“ఏందుకలా పరిగెత్తటం? ఎవరైనా కొట్టటానికి వస్తున్నారా?”
“కాదు” ఆక్రోశంతో అరిచాడు సుబ్రహ్మణ్యం.
“మరి”
“ఊరి చివరనున్న వేపచెట్టు కొమ్మ తెమ్మని చెప్పారు మా సారూ. తొందరగా వెళ్లకపోతే మాకు బ్రేక్‌ఫాస్ట్.. అదే.. పొద్దున్న తిండి ఉండదు.. ఈ పూట పస్తే.. వస్తా..” అని కదలబోయాడు.
“అమ్మో.. మళ్లీ అంత దూరమా? మధ్యలో నీవు ఎన్నిసార్లు పడిపోతావో.. పాపం” జాలిగా అంది శోభ.
“అవును.. నా ఒళ్ళే నేను మోయలేను. మా ఇంట్లో కారు ఉంది. ఇక్కడ సరిగా నడిచేందుకు రోడ్లు కూడా లేవు. పరిగెత్తాలి. వస్తా..”
శోభ ఏదో ఆలోచిస్తూ, “అబ్బాయ్.. అబ్బాయ్.. ఆగు..” అంది
సుబ్రహ్మణ్యం ‘ఏమిట’న్నట్లు చూసాడు.
శోభ దగ్గరికొచ్చి “నేనో ఉపాయం చెప్పనా?” అంది.
“ఉప్మానా?” కళ్ళు మెరుస్తుంటే అడిగాడు.
“నీకు నాకన్నా తిండి పిచ్చి ఉన్నట్టుందే?.. ఉపాయం.”
“ఏం ఉపాయం? ఎందుకు?”
“నీవు అంత దూరం పరిగెత్తకుండా ఉండేందుకు.”
సుబ్రహ్మణ్యం మొహం వెయ్యి కాండిల్ బల్బులా వెలిగిపోయింది.
“అమ్మాయ్.. నీవెంత మంచిదానివో?.. చెప్పు చెప్పు.. చెప్పు..” మీద పడిపోతూ అడిగాడు.
“వేపకొమ్మ విరుచుకుని వెళ్ళాలి.. అంతే కదా.?”
“‘అంత దూరం పరుగెత్తి నేను వేపకొమ్మ వదిలేయి. నేను ప్రాణాలతో తిరిగివస్తానా’ అని భయపడి చస్తుంటే.. నువ్వు తేలిగ్గా తీసేస్తున్నావే?”
“నిజంగానే ఎంతో తేలిక.”
“అదెలా?” ఆశ్చర్యంగా..
“మీ సారుకి ఈ వూళ్ళో ఆ ఒక్క వేపచెట్టు మాత్రమే ఉందని తెలుసు. కానీ ఇంకో చెట్టు మా దొడ్లో ఉంది. పెద్ద చెట్టు కాదు. కానీ కొమ్మలున్నాయి. నీకు ఒక కొమ్మ ఇస్తాను. హాయిగా వెళ్లి నువ్వే అంత దూరం నుంచీ తెచ్చినట్లు చెప్పు.” అంటూ లోపలి పరిగెత్తింది. భూకంపం వచ్చినట్లు సుబ్రహ్మణ్యం ఊగిపోయాడు. దేవుడికి దణ్ణం పెట్టి ప్రార్థిస్తూ నుంచున్నాడు.
మరొక్కసారి భూమి కంపించింది. కళ్ళు తెరిచాడు. శోభ కనిపించింది. చేతిలో వేపకొమ్మ.
వెంటనే ఆ కొమ్మ లాక్కుని, “థాంక్స్ అమ్మాయి.. నా పేరు సుబ్రహ్మణ్యం. నీ పేరు?”
“శోభ” సిగ్గుపడుతూ చెప్పింది. కళ్ళు పెద్దవి చేసి ఆ ఆకారానికి ఆ పేరు ఏదో తేడాలా ఉందన్నట్టు చూసి,
“వస్తా అమ్మాయి.. నేను వెళ్ళేదాకా నువ్వు పరిగెత్తకు.. ప్లీజ్..” అంటూ పరిగెత్తాడు.
భూకంపం వచ్చినట్లు శోభ అటూ ఇటూ ఊగిపోయింది.
బిత్తరపోయి సుబ్రహ్మణ్యం వెళ్ళినవైపే చూస్తూ ఉండిపోయింది.
అందరికన్నా ముందొచ్చిన సుబ్రమణ్యాన్ని చూసి అందరికీ మతులు పోయాయి.
“అవాక్కయ్యారా బాబులూ” నవ్వుతూ అన్నాడు సుబ్రహ్మణ్యం.
“అసలు నువ్వు మాతో ఎప్పుడు వచ్చావ్? ఎక్కడా కనపడలేదు..?”
“ఒరేయ్ వినాయకుడు కుమారస్వామి కన్నా ముందు వచ్చాడా లేదా?”
“అవును.. దానికీ నీకూ ఏమి సంబంధం?”
“నేను ఓం మాతృదేవోభవ.. పితృదేవోభవ.. అంటూ పరిగెత్తాను. అంతే.. కళ్ళు తెరిచేసరికి ఇక్కడున్నాను. నా చేతిలో వేపకొమ్మ.”
“మా చెవిలో వెర్రి పువ్వు.. నిజం చెప్పరా?”
ఇంతలో వెంకట్రావు వచ్చాడు. అందరూ కంప్లైంట్ చేశారు.
“ఏరా సుబ్బిగా.. ఎలా ఫస్ట్ వచ్చావురా? నాకు తెలిసి వేపచెట్టు అక్కడ తప్ప ఎక్కడా లేదు..?”
“సార్.. కొంపదీసి వాళ్ళ అమ్మమ్మ వేపకొమ్మ కూడా ఇచ్చిపంపిందేమో సార్.. దయ్యం పట్టకుండా?” వెనకనుంచి ఎవరో అన్నారు. అందరూ నవ్వారు.
“అదేం లేదు సార్.. నాకు రన్నింగ్ అలవాటు సార్.. అంతే”
ఇంతలో టిఫిన్లు వచ్చినై. ఆకాశం ఉంచి జారిపడే అన్నం పొట్లాల కోసం వరదలో చిక్కుకున్న జనాలు పరిగెత్తినట్టు ఎగబడి కొట్టుకుంటూ తీసుకుంటున్నారు.
సుబ్రహ్మణ్యం అందులోనూ ఫస్ట్ అని నిరూపించాడు.
(సశేషం)
హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీ కస్తూరి రాజశేఖర్ వృత్తిరీత్యా -విశ్రాంత యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా (పూర్వ ఆంధ్రా బ్యాంక్) చీఫ్ మేనేజర్. ప్రవృత్తి రీత్యా రచయిత, అనువాదకులు. ఎం. ఏ. (తెలుగు), ఎం.ఎస్. (పబ్లిక్ రిలేషన్స్), ఎం.ఎస్ సి. (గణితం) విద్యార్హతలు. ప్రస్తుతం ఎం. ఏ. (సైకాలజీ) చేస్తున్నారు. అనువాదకునిగా – నేషనల్ బుక్ ట్రస్ట్, న్యూ ఢిల్లీ వారికి అనువాద/ప్రూఫ్ రీడింగ్ సేవలందించారు. జోతిరావు ఫూలే చరిత్ర, భక్త్ ఖాన్ అనువదించారు. ఈనాడు ఆదివారం పత్రికకు ఎన్నో సిండికేట్ ఆర్టికల్స్ అనువాదం చేశారు. పి. దినకర రావు గారి ‘Ramblings’ ఇంగ్లీష్ కవితా సంపుటి తెలుగులోకి అనువాదించారు. వీరి కథలు ఈనాడు ఆదివారం పత్రిక, విపుల (అనువాద కథలు), చతుర పత్రికలలో ప్రచురితమయ్యాయి. ‘ఓ సారి చూడండి అంతే.. whatsapp ప్రసారభారతి సంచిక’ నిర్వహించిన కథల పోటీలో వీరి కథ ‘ఎక్కడ ఉన్నా.. ఏమైనా..’ బహుమతి పొందింది వీరి నవల ‘చక్రవ్యూహం’ ఆంధ్రప్రభ దీపావళి నవలల పోటీలో 3వ బహుమతి పొంది 28 వారాల పాటు ధారావాహికగా ప్రచురితమైనంది. నాటక రచనలు: – ఆమె త్యాగం (చలం గారి కథకు నాటక రూపం – అజో విభో కందాళం సంస్థ వారి కథా నాటికల పోటీలో ప్రదర్శింపబడింది.) – నాతిచరామి (న్యూ ఢిల్లీ – శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్ వారు నిర్వహించిన జాతీయ నాటక పోటీలలో 2వ బహుమతి) – త్వమేవాహం (పరుచూరి రఘుబాబు స్మారక నాటక పోటీలో 8 బహుమహతులు), తిరుపతి మహతి స్టేడియం, మరెన్నో వేదికల పైన ప్రదర్శింపబడింది. – శతమానం భవతి (పరుచూరి రఘుబాబు స్మారక నాటక పోటీలో జ్ఞాపిక ) – సర్వేజనా సుఖినోభవంతు (హైదరాబాద్ BHEL నాటక పోటీలో ఉత్తమ బాల నటుడు బహుమతి) – పారిజాతం (డిసెంబర్, 2022 – న్యూ ఢిల్లీ ఆంధ్రా అసోసియేషన్, జనవరి, 2023 – హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ, జనవరి , 2023 – విజయవాడ లలో ప్రదర్శింపబడింది) – పరంపర (రస రంజని వారి ఆధ్వర్యం లో 26-10-2023న శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్, గుడివాడ వారిచే ప్రదర్శింపబడింది) – గురుభ్యోనమః ఇవి కాక, ఈనాడు అదివారం పత్రిక కోసం పుస్తక సమీక్షలు చేశారు. యండమూరి రచనల సమీక్షా వ్యాసానికి బహుమతి పొందారు. 2016 బాంకాన్ సమావేశ పత్రాల ముద్రణలో సహాయ సేవలందించారు. డా. బి. కామేశ్వర రావు వ్రాసిన ‘ఆనంద విజయం’ (బెర్ట్రాండ్ రస్సెల్ ఆంగ్ల రచన – ది కాంకేస్ట్ అఫ్ హ్యాపీనెస్‌కు అనువాదం) కు; సీహెచ్ శ్రీనివాస శాస్త్రి వ్రాసిన ఇంగ్లీష్ రచన – the unanswered questions కు, కొండపల్లి సనత్‌కుమార్ రచించిన ‘శ్రీ సాయి బాబా చరిత్ర’ (ఇంగ్లీష్)కు సంపాదకత్వ బాధ్యలు నిర్వహించారు. ఆంధ్రాబ్యాంక్ house magazine ‘magicart’ సంపాదక మండలి సభ్యులు. ఎన్నో కవితలు రాశారు. ‘కాల ధర్మం’ ప్రసిద్ధి చెందిన కవిత. ఆల్ ఇండియా రేడియోలో కవితా శ్రవణం. అభినందన పంచరత్నాలు వగైరాలు. ‘పడమటి ఉషస్సు’ అనే లఘుచిత్రానికి కథ, మాటలు అందించి, నటించారు. Kasturi Dreamworks అనేది వీరి యూట్యూబ్ ఛానెల్. పలు తెలుగు ప్రకటనలకు డబ్బింగ్ చెప్పారు. ఢిల్లీ, హైదరాబాద్ లలో ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈనాడు – ఆదివారం, విపుల, చతుర పత్రికలకు సబ్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఫోన్: 9848378034
Excellent
The Real Person!
This is a comment by Mr. Boggarapu Ramachandra Rao: *Very fine sir waiting for nextjaitrayaatra-5. Very interesting. Boggarapu Ramachandra Rao.*
This is a comment by Lion Govind Raj K: *I have read the story. It’s good. Congratulations. Lion Govind Raj K*
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
విమర్శకులా? వందిమాగధ భజన బృందాలా?
గులాబీ మృదుపాదాలు
కశ్మీర రాజతరంగిణి-59
కర్మయోగి-2
తిరుమలేశుని సన్నిధిలో… – 2
కైంకర్యము-8
ప్రకృతి కాంత
ఆసక్తికరమైన 102 నాటవుట్
తల్లివి నీవే తండ్రివి నీవే!-31
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®