సంచికలో తాజాగా

Related Articles

17 Comments

  1. 1

    ramasundarimsbpnv

    విధి మిమ్మల్ని చేర్చాల్సిన చోటికి తీసికెళ్లడానికి ఎన్నో నిచ్చెన మెట్లు వేస్తూ వచ్చింది. గాడ్ ఫాదర్ ఎవరూ లేని సినీ ప్రపంచంలో కేవలం తపన, సృజనాత్మకతతో ఇంతకాలం నిలబడడమంటే అది కేవలం ‘సమయానికి (సందర్భానికి) తగు మాటలాడే (తగ్గట్టు రాసే)’ శక్తి మీకుండడమే. దైవం తన సృష్టిలో ప్రాణికోటికి వివిధ శక్తులిస్తుంది. ఎవరి శక్తిని వారు గుర్తించి ప్రయత్నిస్తే చాలు, అది ప్రభవిస్తుంది. మొన్న ఫ్రెండ్షిప్ డే నాడు తెలుగు వాళ్లంతా ఇదే పాటని వైరల్ చేశారు. అయితే ప్రతి పాట వెనకా కవి పడే వేదన మామూలుగా ఉండదు కదా! మీ ఎదుటకొచ్చి నిలబడి ఏం రాస్తావోనని పాట చేసే ఛాలెంజ్ ని మీరు అన్నిసార్లూ అద్భుతంగా నిరూపించుకున్నారు. మీ ప్రయాణం వూహాతీతంగా సాగుతోంది.
    చండి (రమాసుందరి)

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మాధురి ఇంగువ గారి స్పందన: *ఆహా! అద్భుతం sir. మీ ప్రయాణం, మీరు నిమిషాలలో పాటలు వ్రాయడం, ఆత్రేయ వంటి వారు భేష్ అని మెచ్చుకోవడం! మీ అభిమానిగా నాకు చాలా చాలా ఆనందాన్నీ , స్ఫూర్తిని కలిగిస్తోంది sir 🙏🙏🙏😊*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గౌరీ ఏ ఐ ఆర్ ఆల్ ఇండియా రేడియో వారి స్పందన:* నమస్తే. మీ “జీవితం ఓ ప్రయాణం” ఆసక్తికరంగా సాగుతోంది. ప్రతి ఎపిసోడ్ చదువుతున్నాను. 7th episode లో “పక్షికి గూడుంది పాముకి పుట్టుంది” ఈ విషయం ఆకాశవాణిలో మిమ్మల్ని పరిచయం చేసినప్పుడు పేర్కొన్నారు. 🙏 *

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీధర్ వాడపల్లి గారి స్పందన: *శుభోదయం. చదివాను పోతన భాగవతంలో పద్యం శ్రీరాముడు పూర్తి చేసినట్లు. ఎర్నేస్ట్ హెమింగ్వే మాట మీ పాటగా మారింది. ఇది భువనమ్మ దీవెన కవన చంద్రునికి.*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఆముక్తమాల్యద గారి స్పందన:*అద్భుతంగా సాగింది కథనం. 👌🏻👍🏻🙏🏻*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సుద్దాల అశోక్ తేజ గారి స్పందన: *నమస్కారం భువనచంద్ర గారూ. ఈ వారం మీ అనుభవాలు పంచుకున్నాము.
    చాలా హాయిగా ఉంది కదూ. మీరు వ్రాసిన స్నేహపూర్వక కవిత్వం చాలా బాగుంటుంది. అప్పడు ఇప్పుడు ఎప్పటికి ఏనాటికైనా.
    మీరు నీడకు నీడలా ఉండే నీడకు విశ్లేషణ చేయడం చాలా కష్టం అయినది అయినా చాలా చక్కగా వివరణ ఇచ్చారు.
    మీలో ఉన్న అంతర్గత శక్తి మరోటి మిమ్మల్ని నడిపిస్తుంది అని అనిపిస్తుంది నాకు.
    ఎదుటి వ్యక్తిని వారి వ్యక్తిగత బలహీనతలును కూడా చాలా విజ్ఞతతోనే భరించి మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేసారు.
    మీలోని క్రమశిక్షణ వివేకాన్ని విజ్ఞతని సహనాన్ని విత్తనం వేసిన మీలోని మీకు జ్ఞానానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అభినందనలు అండి.
    చాలా బాగుంది ఈ రోజు మీ ఆలోచనా అనుభవం.*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బ్నిం గారి స్పందన: *భువనచంద్ర గారు.. అయాచితంగా ఆత్రేయ గారి ఆశీస్సులు లభించడం ..మీ కలంలో అక్షయ సిరా పోసినట్టే అయింది !
    స్నేహానికన్న మిన్నా.. తిరుగులేని పాట తెలుగుదేశానికి దొరికింది!
    మీ అమృత వర్షిణి ఝరిస్తోనే ఉంది.. (అబ్బో కొత్త ప్రయోగం.. ఝరించడం)*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన: *భువన్ జీ! మంచి, కలకాలం నిలిచే సినిమా పాట అంటే కేవలం కాలక్షేప మాటల ప్రోగు కాదు. అవీ ఉంటాయి. థియేటర్ బయటకు రాగానే మర్చిపోతాం. కానీ “స్నేహానికన్న మిన్న” పాట సినిమా “స్నేహ” గీతాల్లో కలకాలం నిలిచివుండే పాట.
    ఇక దొంగకోళ్ళు లోని పాట ఒక “personality development” కౌన్సిలర్ చెప్పే బోధ లాంటిది. శ్రీశ్రీ “కలకానిది ” పాట లాంటిది. ఒక వైపు హీరోయిన్ తన బాధను చెప్తూ, వెంటనే తనకు తను ధైర్యం చెప్పుకుంటూ, ప్రేక్షకులకు కూడ ఒక ధైర్యాన్నందిస్తున్న మెసేజ్ లా అందించారు భువన్ జీ!
    సినీ పరిశ్రమకు వచ్చిన కొద్ది రోజుల్లోనే వేటూరి గారి, ఆత్రేయ గారి మెప్పు పొందడం కేవలం అదృష్టం కాదు, మీ ప్రతిభ, శ్రమ, వినయం, సహనం కూడ.*

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. పంజాల నరసయ్య గారి స్పందన: *ఆసాంతం చదివాను. పాటలు ఎలా రాస్తారో తెలుసుకున్నాను. Congrats 🎉. *

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బలభద్రపాత్రుని రమణి గారి స్పందన: *బాగుంది.. స్నేహానికి కన్న మిన్నా.. పాట పుట్టుక!*

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. చంద్ర శేఖర ఆజాద్ గారి స్పందన:*ఈ భాగం మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంది.. హెమ్మింగ్వే ప్రస్తావన, స్నేహం మీద గీతం, ఆత్రేయ గారి ప్రస్తావన, ఇవన్నీ జరిగిపోయిన క్షణాలు.. కానీ వాటికి మరణం లేదు.. తరాల్లోకి ట్రావెల్ చేస్తాయి.. మరోసారి మీకు నమస్సులు.*

    Reply
  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రోహిణి గారి స్పందన:*నమస్కారములు 🙏7వ సంచిక చదివాను అండీ. సినిమా రైటర్ గా పేరు ప్రక్యాతులు సంపాదించిన మీ జీవితం కూడా సినిమా పక్కీలోనే హాట్ హాట్ గా, స్వీట్ స్వీట్ గా అద్భుతమైన మలుపులతో ఆసక్తి వుంది. ఎప్పుడో జరిగిన సంగతులు అయినా చాలా ఇంటరెస్టింగ్ ఇన్స్పైరింగ్ గా వున్నాయ్.ఇవ్వన్నీ అక్షర బద్దం చేసి అందించడం అద్భుతమైన ఆలోచన అండీ. డైరెక్టర్ గారు కోపంగా పేపర్ విసిరినా సహనంగా వినయంగా మీరు పంపిన క్యాసెట్ చూడండి అని భయం లేకుండా వారికి వినిపించడం, మీలో నిర్భయం, సహనం, వినయం, పసితనం ఉన్నాయి. సమయానికి ఏది వాడాలో అది ఉపయోగిస్తూ అంచెలంచెలు గా ఎదిగిన మీ ప్రయాణం ఆసక్తి గా వుంది అండీ. ఓపాట వెనుక వున్న కష్టం, విలువ తెలియ చేస్తున్నారుఅండీ.నీడకు, గూడుకు, స్నేహానికి మీరు ఇచ్చిన క్లారిఫికేషన్ అద్భుతం అండీ -ధన్యవాదములు అండీ -రోహిణి 🌹🙏🌹

    Reply
  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గోటేటి మోహన్ గారి స్పందన:*ఈ వారం కూడా మీ జీవిత ప్రయాణం చాలా బాగుంది మాస్టారూ.. మొదట్లోనే మీరు మధుసూదనరావు గారి వంటి ఉద్దండుల చేతిలో పడడం మీ కెరీర్ కి ప్లస్ అయింది. ఆయన సినిమాకు పాటలు రాయడం అంటే మాటలు కాదు! ఆ అవకాశాన్ని మీరు చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. స్నేహితుల దినోత్సవానికి మీరిచ్చిన అపురూప కానుక “స్నేహానికికన్న మిన్న..” పాట! స్నేహంపై వచ్చిన పాటల్లో మీ పాట అగ్రభాగాన నిలుస్తుంది. ‘నీడ’ అన్న పదానికి మీరిచ్చిన నిర్వచనం.. వివరణ అద్భుతంగా వున్నాయి. అభినందనలు మాస్టారూ!*

    Reply
  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి. శ్రీధర్ గారి స్పందన:*కదనరంగానికి.. కవనరంగానికి చాలా దూరమే ఉంది. కానీ ఆ రెండు రంగాల్లోనూ తనదైన ముద్ర వేసిన రచయిత – భువనచంద్ర. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో దేశానికి సేవలందించిన భువనచంద్ర.. ఆకాశంలో విహంగ వీక్షణంతో అఖండ భారతాన్ని చూసిన సైనికుడు. ఆ తర్వాత సాహిత్యంపై ఉన్న పట్టు, సినిమా పాటలపై ఉన్న మక్కువతో మద్రాస్ చేరి, తన పాటల తోటకు అక్షరబీజాలు చల్లుకున్నారు. ఆ బీజాలకు దర్శకుడు విజయబాపినీడు గారి ప్రోత్సాహం నీరందించగా.. అవి మొలకెత్తి, కొమ్మలై, రెమ్మలై.. చివరికి ఎన్నో ఉత్సాహభరితమైన, మధురమైన తెలుగు పాటలుగా పూశాయి. ఆ పూలకు పద పరిమళాన్ని అద్దిన సినీమాగేయ కవి భువనచంద్ర.
    మీ పాట, కన్నె గోదారిలా కొంటె, కావేరిలా వయ్యారంగా, విలాసాల దారి కాసి, సరాగాల గాలమేసి, కులాసాలను అడుగుతుంది. వయ్యారాల మాల వేస్తుంది. “భువనం గగనం.. హృదయం సకలం ప్రేమే..” అంటూ ప్రేమకు భువనమంతా, గగనమంతా అర్థం చెబుతుంది.“కాఫీ గీఫీ కంచం మంచం అల్లం పెసరట్టు వన్ బై టూ” అంటూ జీవితంలోని చిన్న చిన్న సరదాలను కూడా చిలిపి పదాలుగా మార్చేస్తుంది. ఎంచక్కా ఆ సరదాల కోసం మనసును తాకట్టు పెట్టమంటుంది. “స్నేహాన్ని కన్న మిన్న లోకాన లేదని అంటూ స్నేహగీతాన్ని ఆలపిస్తుంది. జాబిలమ్మ జాజిమల్లెలాంటి తెల్లని చీర చుట్టుకుంటే.. స్వాతిమాలై ఒళ్లు తాకి తుళ్లిపోయేటట్లు చేస్తే.. ఆ పాట భువనచంద్రుని కవనమని చెప్పకనే చెబుతుంది.
    ప్రియరాగాలు గుండెలో పొంగితే చిటపట చినుకులు సైతం కిటుకులు నేర్చుకుంటాయి. ఓర్పులోనూ.. నిట్టూర్పులోనూ.. పదాలపైనే ధ్యానం. వెన్నెల వేడెక్కి పున్నమికి ఈడొస్తే.. తనువుకు తనువే అర్పణం. తమరికి వయసు వాటం తెలుసు.. టక్కరి మనసు వేషం వేసిన ప్రతిసారీఅక్షర మధువుల కోసం మీ కలం వెతుకుతుంది. ఉదయం గేయ చుంబన సేవనం.. మధ్యాహ్నం కవి లోగిలి కౌగిలిలో భోజనం.. సాయంత్రం పుష్ప నివేదన రాత్రివేళ మహా నైవేద్యం.. ఇలా మీ సినీగేయ సంతర్పణం తెలుగు శ్రోతలకు అందించిన విందు అక్షరాలా ఒక మధురానుభూతి.మరి పరువాన స్వరవీణ మృదుపాణి.. సరస మధుర లయ లావణి పలికిన మీ మాటలు, మదనుని శరములై.. స్వరములై.. శ్రోతల హృదయాలను తాకుతాయి
    ఎరుపు లోలాకు కులికితే.. ముక్కు బుల్లాకు మెరిస్తే.. రాజస్థానీ కన్నెపిల్ల కళ్లతో కొంటెగా సైగలేవో చేస్తే.. మనసంతా మరుమల్లెల పులకింత. అదే.. మీ ప్రేమలేఖ. మీ కవితల కవ్వింతలో ఏ ఊరి చల్లగాలి ఈ ఊరికొచ్చి ఒంటె మీదకెక్కి ఊరు చుట్టినట్టుగా ఒక చిలిపి ఊహ ఉంటుంది. మనకందని నవలోకంలో ఆ అందం ఏనుగెక్కి పోతుంటే.. నీకు గజారోహణం జరిగినట్టే అనిపిస్తుంది.ఎన్నెన్నో సంగతులు.. ఏటిగట్టు, ఊరిగట్టు వంతులేసి చెప్పినట్టు మీ పాటలు మన జీవితాల కథలను మనకే తిరిగి వినిపిస్తాయి.
    పచ్చని చిలుకలు తోడుంటే.. పాడే కోయిల వెంటుంటే.. భూలోకమే ఆనందానికి ఇల్లు.. ఈ లోకంలో కన్నీరింక చెల్లు.. ప్రేమ ఉంటే చాలునంట.. డబ్బు గిబ్బు లెందుకు?”అంటూ ప్రేమలోని అసలైన సంపదను చూపించిన మీ కలం.. “అందని మిన్నే ఆనందం.. అందే మన్నే ఆనందం.. భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందం.. మంచుకి ఎండే ఆనందం.. వాగుకి వానే ఆనందం.. ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం.. బ్రతుకే నూరేళ్ల అందం.. బ్రతుకే బ్రహ్మానందం.. ఇతరులకై కను జారే కన్నీరే ఆనందమానందం..” అంటూ ప్రకృతితో మమేకమైన మానవ జీవన గమనాన్ని, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే ప్రాకృతిక భారతాన్ని తన అక్షరాల్లో ఆవిష్కరించిన అక్షరశిల్పి. మౌన సరస్సుల దాహానికి హిమశంఖ నాదం చేస్తే.. చంద్రసుమం వికసిస్తుంది. వాత్సాయన వనవాసినికి సూర్యకిరీటమై తళుకులద్దుతుంది. తనువును పెనవేసిన చీర గర్వంతో యవ్వన గిరులను తాకుతుంది. ఆపర శ్రీనాథా.. సాహో! అలా మౌనానికి నాదం, నిశ్శబ్దానికి భావం, భావానికి స్వరం, స్వరానికి గేయరూపం ఇచ్చిన మీ కల తెలుగు సినీగేయానికి ఎన్నో అక్షర ఆణిముత్యాలను అందించింది.మీ సినీగీతం…
    “మాఘమాస వేళలో మల్లెపూల మాలగా.. మరుని కూడి మెల్లగా చల్లగా.. మధుమాసపు మన్మథరాగమై మదిలో మెదిలే మధువుగా..” మారుతుంది. చిరు చిరు పెదవులపై ఊరుతున్నదీ మధువా.. కాటుకా.. అది నీలిమేఘ చారికా.. తిలకమ పురివిప్పిన మన్మథ బాణమా.. అంటూ అందానికే అక్షరరూపం ఇస్తుంది.“బావవి నువ్వు.. భామని నేను..” అంటూ జాజిమల్లె కొంటెగా కూనిరాగం తీస్తుంది. కలం చెలిస్తే.. జ్వలించే జీవితాల కథనాన్ని పెద్దరికంగా చెబుతుంది. పదం పలికితే.. భావానికి ప్రాణం పోస్తుంది. పాట పుడితే.. తరతరాల జ్ఞాపకంగా మిగులుతుంది.అందుకే భువనచంద్ర గారి పాటలు కేవలం సినీగీతాలు కావు.. అవి ఒక కాలపు జ్ఞాపకాలు. ఒక తరపు అనుభూతులు. ఒక భాషకు దక్కిన అక్షర ఆణిముత్యాలు. విహంగ వీక్షణంతో అఖండ భారతాన్ని వీక్షించి దేశాన్ని రక్షించిన సైనికుడిగా మీ సేవా నిరతికి సాహో. అదే కలంతో తెలుగు పాటల లోకాన్ని విహరించి, వేలాది శ్రోతల హృదయాలను గెలుచుకున్న గేయకవిగా మీ సాహితీ సేవకు సలాం. భద్రాచలం కొండ సీతమ్మవారి ఆండ.. సదా మీకు ఆండదండగా ఉండాలి. మీ జీవితం మధుమాసంలా పరిమళించాలి. మీ కలం వసంత వీణలా నిరంతరం మ్రోగాలి.
    మీ అక్షరాలు స్వాతి చినుకులై మరెన్నో ముత్యాలమాలలను సృష్టించాలి.మీ పాటలు మరెన్నో తరాల హృదయాల్లో పల్లవించాలి.కదనరంగంలో సైనికుడు.. కవనరంగంలో అక్షరశిల్పి.. గేయరంగంలో మధురభావాల మాంత్రికుడు – భువనచంద్ర.
    భువనచంద్ర గారికి హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీ కలం చిరంజీవి కావాలి.. మీ కవనం కలకాలం పరిమళించాలి.. మీ గీతాల స్వరం తెలుగు హృదయాల్లో ఎప్పటికీ మార్మోగాలి!*

    Reply
  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పులగం చిన్నారాయణ గారి వ్యాఖ్య:*సర్, ఇప్పుడే ‘సంచిక’ వెబ్ సైట్ లో మీ “జీవితం ఓ ప్రయాణం” “సీ ‘రియల్’” చదివాను. ఒక కథ లా అద్భుతంగా రాశారు. “జీవితమనే సీ.డి.ని ఎన్నిసార్లైనా రివైండ్ చేసుకోవచ్చు. బట్ నో ఫాస్ట్ పార్వర్డ్”, “కలలు నా ప్రాణస్నేహితులు. పడుకున్న మరుక్షణం అవి నా కనుపాపల్లో వాలిపోతాయి” వంటి వాక్యాలు అయస్కాంతాల్లా ఆకర్షించాయి. వచ్చే వారం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ – మీ పులగం చిన్నారాయణ.*

    Reply
  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమా సుందరి (చండీ) గారి స్పందన: భువనచంద్ర పాటలు వేటికవే మేటి. ఇదేలే తరతరాల చరితం.. మరల తెలుపనా ప్రియా.. రా రా సరసకు రారా.. ఇలా వేల పాటల్ని సిట్యువేషన్‌కి తగ్గట్టు రాసి చరిత్రలో తనకై స్వర్ణ పుటల్ని పదిలపరుచుకున్నారు. ఆయనలో ఎందరో తత్వవేత్తలు, సిద్ధపురుషుల సారం ఉంది. అది వారి జీవన సందర్భాల్లో ప్రకటీకృతమవుతుంది. ఎందరో మహనీయుల ప్రతిభకి సినిమా పట్టం కడుతుంది.

    Reply
  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఉమాభారతి గారి స్పందన:*అప్పుడు అంటే ఆ టైమ్‍లో అక్కడ లేను.. 1980 లో ఇక్కడికి వచ్చేశాను. సినిమాలు అప్పుడప్పుడు వెళ్లాడమే.. మరీ serious cinegoer ని కాను. కానీ ఒక ఏడాది నుండి.. పాత సినిమాలు.. చూస్తున్నాను regular గా.. రాజేంద్రప్రసాద్ సినిమాలు అసలు చూసిందే లేదు.. ఇప్పుడు దాదాపు అన్నీ చూశానేమో.. మీ పాటలన్నీ విన్నవే కొన్ని బాగా నచ్చినవే.. అయినా ఆ పాటలకి మీకు ఉన్న కనెక్షన్ తెలుస్తుంది ఇప్పుడిప్పుడే.. ఎంతో ఆనందంగా ఉంది భువచంద్ర గారు.. వాటితో ముడిపడి ఉన్న మీ సంగీత జీవన యానం.. మీరు చెబుతుంటే వినడం చదవడం.. మరింత ఆనందంగా ఉంది.. ఈ పాట ఎవరు రాశారు అని పర్టికులర్‌గా పట్టించుకుంది.. మాత్రం.. ‘బంగారు కొండా.. మరుమల్లె దండా..’ అదీ theatre లో చూసాము. గొప్ప లిరిసిస్ట్ మీరు.. మీతో పరిచయం .. మహా భాగ్యం 🙏🌺 *

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®