[మణి గారు రచించిన ‘కాలం’ అనే రచనని పాఠకులకి అందిస్తున్నాము.]
![](http://sanchika.com/wp-content/uploads/2024/10/KaalamPoemFI.png)
![](https://sanchika.com/wp-content/plugins/wp-content-copy-protector/images/transparent.gif)
ఎన్ని ఉదయాలు!
ఎన్ని రాత్రులు!
అలుపు లేదు. సొలుపు లేదు.
పరిగెడుతూనే వుంటాయి!
ఒకదాని వెనుక ఒకటి!
ఎక్కడ మొదలు?!
ఎక్కడ చివర?!
నిరంతర అన్వేషణ!.
ఏవి పట్టుకున్నాయో,
ఏవి మిగుల్చుకున్నాయో,
వెలుగు నిలవదు!
చీకటి నిలవదు!
ఏ రంగు అయిన కాసింత సేపే!
అలుపు లేని గమనం..
ఆశల రాగాలు,
కలల సవ్వళ్ళు,
ఊహల ఊసులు,
ఆలోచనల అలజళ్ళు,
పగిలిన క్షణాలు,
పరుచుకున్న జ్ఞాపకాలు,..
ఏవయినా,.. ఏవయినా,..
తెరిచిన కాలం నోట్లో,
గుళికల్లా అదృశ్యమవుతాయి!
నిశ్శబ్దపు సునామి,
అన్నీ ముంచేస్తుంది!
రాళ్ళు అని చూడదు.
రత్నాలు అని చూడదు!.
రిక్త హస్తాలు,
శూన్యపు హృదయాలు,
అన్నీ ముంచేస్తుంది!
ఏదని చూడదు.
ఏదయినా వదలదు.!
లోపలకి లాక్కుంటుంది!..,
కాలం ఆగుతుంది,
ఆ శబ్దం లేని నిశ్శబ్దంలో!!
కాలం ఆగుతుంది,
ఆ శబ్దం లేని నిశ్శబ్దంలో!!!