ఎక్కడికి పోయిందో ఆ పండగ సందడి ఎక్కడ చూసినా ఎన్నికల హడావిడే హడావిడీ ఉగాదిని కూడ కబ్జా చేశాయి కదా ఎన్నికలు
కోయిల కూతల్లో కూడా కోటిగొంతులలో ఓటేయమని వినయపూర్వక ప్రార్థన అవిశ్రాంతంగా వినిపిస్తోంది… విసిగిస్తోంది
తెల్లగా విచ్చుకోవలసిన మామిడి పూత రాజకీయ పార్టీల రంగులు రంజుగా పులుముకొని పంచరంగుల్లో పకపకా నవ్వుతోంది
శుభాకాంక్షలు చెప్పుకునే పరిచయాలు గెలుపు గుర్రమెవరనే పందాలు కాస్తున్నాయి లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నాయి.
అలాయ్ బలాయ్ కౌగిలింతలలో బలాన్ని ప్రదర్శించేందుకు యావ బలగంతో కలుపుకునే తోవ స్పష్టమవుతుంది.
పలచగా జారిపోయే పచ్చడి పులుపు షడ్రుచుల సంగమాన్ని విదిలించి దులిపేసుకుని, మ్యానిఫెస్టో తీయదనాన్ని మదినిండా నింపేసుకుంది.
పంచాంగ శ్రవణంలోని ఆదాయ వ్యయాలూ, రాజపూజ్య అవమానాలు వ్యక్తి గతాన్ని, ఒంటరిగానే వదిలేసి రాజకీయపు భవితత్వాన్ని బట్టబయలు చేస్తున్నాయి
ఉగాది పండుగ ఒక్క ఏడాది మంచి చెడులకు, తలుపు తీసి సాదరంగా స్వాగతం పలికితే, ఎన్నికల పండగ మాత్రం ఐదేళ్ళ ఏలుబడికి ఆశల ఆకాంక్షల వేడుకలకు తెర లేపుతానంటోంది అహా… ఉగాదిని కూడా కబ్జా చేశాయి కదా ఎన్నికలు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
మనసున మనసై…
మూడు తరాల విషాద కుటుంబ ప్రేమ కథ – ది థార్న్ బర్డ్స్
తప్పకచూసి ఆనందించవలసిన చిత్రం – కొండ పొలం
సరిగ పదమని-21
నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-32
అగ్నిప్రవాహం ‘కృష్ణమ్మ’
కాజాల్లాంటి బాజాలు-132: రసగుల్లా ఇడ్లీ
రామగిరి – రామాలయం..
కొత్తగా ఇంకొన్ని
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®