ఎంతిదిగా కులాసాగా కాలం గడిపేవాణ్ణి నిదురలో కలలను కంటూనో మెలకువ సమయంలో లలితకళలను కనులారా కంటూనో వీనుల విందుగా వింటూనో అనుభూతుల లోకంలో ఆడుకుంటూనో పదాలు పద్యాలు రాసుకుంటూనో చిత్రాలు గీసుకుంటూనో చలనచిత్రాలను చూసుకుంటూనో ఎంత దిలాసాగా కాలం గడిపేవాడిని
కడుపునిండిన కమ్మని కథలను ఎండిన, కడుపుమండిన కన్నీటి గాథలను చదువుకుంటూనో భావజగత్తు దృశ్యాలను రాగతాళాల మేళవింపులో రసరమ్యంగా పాడుకుంటూనో ఎంత హాయిగా కాలాన్ని జమా లెక్కల బెదురు లేకుండా జాంఝామ్మని ఖర్చు చేసేవాడిని నాకున్న తీరిక సమయాన్ని తీరైన రీతిగా తీర్చి దిద్దుకునేవాడిని
ఏ పాపిష్టి కళ్ళ దిష్టి తగిలిందో నా ఖాళీ సమయాన్ని కాకెత్తుకెళ్ళింది తీరిక సమయాన్ని తటాలున తీసుకెళ్ళిపోయింది మాగన్నుగా ఉన్న అదను చూసి మళయాళ మంత్రగత్తెలా మాయం చేసేసింది
ఖాళీ సమయం ఖాళీ అయిపోయిన ఆ ఖాళీ కంతలన్నింటి నిండా అలా ఖాళీగా ఉండటం బాగోదేమోననుకుని ఎక్కడినుండి రాలిపడిందో ఏమో దట్టంగా దిట్టంగా “పని” నిండి పోయింది
ఇంటిపని బయటి పని వంటపని వంటింటి అంట్ల పని సొంతపని, అరువు పని బరువు పని, బతుకుతెరువు పని ఆ పనీ, ఈ పనీ, అదేదో పనీ… అంతటా పనీపనీ
ఇపుడు పనితో ఊపిరి సలపటం లేదు ఊపిరి పీల్చేసినా, “ఉఫ్” అని విడిచేసినా పని వాసనే, పని వేడిమే తగులుతోంది
పని, సమయంతో బంధాన్ని ఎంత పదునుగా పెనవేసుకుందో ఏమో ఇపుడెక్కడా ఖాళీ సమయం కనిపించటంలేదు తీరిక దృష్టి పథంలో అగుపించటంలేదు
అంతే… నా నిన్నటి ఆనందాల అలవాట్లకు తీరిక ఏమాత్రం చిక్కటం లేదు నా మొన్నటి ఆటవిడుపు ఆటపాటలకు అవకాశం అణుమాత్రం దక్కటం లేదు
ఏమండీ… కాస్త మీ చుట్టుపక్కల వెతుకుతారా నా ఖాళీ సమయాన్నెత్తుకెళ్ళిన కాకి తీరిక సమయాన్ని తీసుకెళ్ళిన కాకి అక్కడెక్కడైనా పారేసిందేమో కాస్త తెచ్చిస్తారా
చౌడారపు శ్రీధర్ చక్కని కవి. దీర్ఘ కవితలు వెలయించటంలో దిట్ట.
Nice
ధన్యవాదాలు మహేశ్ గారూ
Your email address will not be published. Required fields are marked *
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
గంటుమూటె : మూటకట్టుకున్న జ్ఞాపకాలు
జీవన రమణీయం-86
లోకల్ క్లాసిక్స్ – 5: బారువా ఊహాల్లో ఆమె!
కావ్య పరిమళం-19
కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు-5
All rights reserved - Sanchika™