సంచికలో తాజాగా

Related Articles

43 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తోటపల్లి సాయినాథ్ గారి వ్యాఖ్య: *కథ లో కొత్తదనం ఉన్నది. కథా గమనం చక్కగా ఉన్నది. మంచి రచనలు చేయగల సత్తా ఉన్నది మీకు. ఆల్ ద బెస్ట్. తోటపల్లి సాయినాథ్ ( సినీ కథా రచయిత)*

    1. 1.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      సాయినాథ్ గారు, సితార, స్వర్ణ కమలం లాంటి గొప్ప సినిమాలు వందకు పైగా సినిమాలకు కథలను వ్రాసిన మీరు , నా కథ చదివి మిచ్చుకోవటం, నా అదృష్టం. ధన్యవాదాలు అండి. 🙏

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నాగజ్యోతి గారి వ్యాఖ్య: *చాలా వైవిధ్యమైన తాత్విక చింతన ఉన్న కథ. చివరి వరకూ ఉత్కంఠగా చదివించింది. అభినందనలు 💐💐💐🤝🤝🤝 రైటర్ నాగజ్యోతి*

    1. 2.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      అవునండి, సమాజం లో నిజాలు చాలా పచ్చిగా, మింగుడు పడనట్టు ఉంటాయి. చదివి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు 🙏

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కె. వి. శర్మ గారి వ్యాఖ్య: *నేను ఈ మధ్య చదివిన కథల్లో ఉత్తమమైన కథ, కథనం చాలా చక్కగా ఉన్నాయి. పరిశీలనాత్మక విషయాలను జోడించి , చాలా పరిశోధనాత్మకతతో చక్కగా రక్తి కట్టించారు. జీవిత సత్యాలను, పరమార్థాన్ని పదబంధాలతో శబ్ధసౌందర్యం తో మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. K.V. శర్మ*

    1. 3.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      సమాజాన్ని కాస్తంత దగ్గిరగా చూస్తూ ఉంటే గొప్ప కథలు పుడతాయి. ..అంతర్లీనం గా, నిజాలే ఉంటాయి. మంచి కథ గా మీరు తలచి, చదివి, కామెంట్ పెట్టినందుకు, ధన్యవాదాలు.
      🙏

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఆనంద్ వేటూరి గారి వ్యాఖ్య: *చాలా బాగుంది సార్. చదువుతున్నంత సేపు యండమూరి గారి అంతర్ముఖం గుర్తొచ్చింది. 👏👏 ఆనంద్ వేటూరి (రచయిత)*

    1. 4.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      మీరు స్వయం గా ఒక రచయిత. మీరు నా రచనను, శైలిని, మరో గొప్ప రచయితతో పోల్చటం, నాకు ఒక అద్భుతం గా అనిపిస్తున్నది.
      కథను చదివి, కామెంట్ చేసినందుకు, ధన్యవాదాలు 🙏

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి డా. కొఠారి వాణీ చలపతిరావు గారి వ్యాఖ్య: *కళ్యాణ్ శ్రీనివాస్ గారి థ్రిల్లర్ కథ లోకాంతర సాక్ష్యం బాగుంది .చాలా టైమ్ వెచ్చించి ,డేటా కలెక్ట్ చేసి మరీ కథలో ఒక దెగ్గర పొందుపరిచారు.
    చనిపోయిన వ్యక్తి రెండు నెలల తర్వాత ఇంటికి తిరిగి రావటం అన్నది చాలా సస్పెన్స్ తో ఉండి ఉత్కంఠను కలిగించింది .చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి వస్తే కుటుంబసభ్యుల ప్రవర్తన ఎలావుంటుంది అన్నది చాలా సహజంగా వుంది. రచయితకు అభినందనలు..💐💐 – శ్రీమతి డా. కొఠారి వాణీ చలపతిరావు*

    1. 5.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      పరిస్థితి, అవసరం, మనిషిని ఏ స్థితికి ఐనా తీసుకు పోతుంది. అప్పటి వరకు ఉన్న జీవిత చిత్రం ఒక్కసారిగా, రంగులు మార్చుకుంటుంది.
      చదివి, కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు 🙏

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మాధవి గారి వ్యాఖ్య: *బాగుంది, కాని బాధాకరంగా. *

    1. 6.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      పరిస్థితి, అవసరం, మనిషిని ఏ స్థితికి ఐనా తీసుకు పోతుంది. అప్పటి వరకు ఉన్న జీవిత చిత్రం ఒక్కసారిగా, రంగులు మార్చుకుంటుంది.
      చదివి, కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు 🙏

    2. 6.2

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      ధన్యవాదాలుఆదవి గారు.
      నిజం కు రుచి ఉండదు. ఆది గొంతుకు అడ్డుపడే తత్వం మాత్రం ఉంటుంది..

    3. 6.3

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      “నిజం” కు అద్భుతమైన రుచి, వాసనా ఉండవు, పైగా గొంతు కు అడ్డు పడే తత్వం ఉంటుంది.
      నిజం ఇలా నే పచ్చిగా ఉంటుంది.
      మీ విలువైన కామెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు మాధవి గారు 🌿🌹

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఉదయ్ భాస్కర్ గారి వ్యాఖ్య: *మీ కథ “లోకంతర సాక్ష్యం” చాలా ఓపికగా చదివాను. కథ చదివిన తరువాత నా అభిప్రాయం (candid) తెలియబరుస్తున్నాను.
    – కథ కొంత సాగతీతగా అనిపించింది
    – మనకు తెలుగు భాష మీద పట్టు ఉన్నది అన్నట్టుగా మీరు తెలుగు పదాల ప్రయోగం చేశారు, వీటిలో చాలా మటుకు చదివే చాలా మందికి అర్ధం కాకపోవచ్చు
    – కొన్ని చోట్ల అచ్చు తప్పులు ఉన్నాయి
    – కథ వ్రాసిన శైలి బాగుంది కానీ ఎందుకో పాఠకుడిని ప్రభావితం చేసినట్లుగా అనిపించలేదు
    – ఆఖరున చెప్పిన ఆరు సూత్రాలకు కథ వ్రాసినట్టు అనిపించింది
    – అన్యోన్యమైన అమాయకురాలైన భార్య పిల్లల తో కలిసి భర్తను దూరం చేసుకోవాలనుకోవడం కొంచెం డ్రమాటిక్ గా అనిపించింది.
    మొత్తమీద ఒక మంచి ప్రయత్నం చేశారు, అభినందనలు 👍🏼💐
    ఉదయ్ భాస్కర్, సినీ డైరెక్టర్.*

    1. 7.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      మీ కామెంట్ ను, నిర్మొహమాటం గా ఇచ్చినందుకు ధన్యవాదాలు.

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రామలింగేశ్వర్ గారి వ్యాఖ్య: *నిజంగా నువ్వే రాశావా… అనైతికం నవల, బ్రో సినిమా.. వీటితో కొంచెం పోలిక ఉంది కానీ, పాత్రల పరిచయం.. కథనంలో వేగం.. అబ్బా.. చెయ్యి కొబ్బరి తాడులా తిరిగింది.. ఒక్క అనవసరపు అక్షరం లేదు.. అవసరాల రామకృష్ణారావు, వివిన మూర్తి.. బలివాడ కాంతారావు పేరు కూడా చెప్తే ఎవరైనా తిడతారేమో కానీ ఆ స్థాయి లో ఉంది.. నువ్వే రాసేవని నమ్మడానికి నా జెలస్ ఒప్పుకోవడం లేదు…😏 చిన్ననాటి మిత్రుడు రామలింగేశ్వర్ (తిరువూరు)*

    1. 8.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      కథ మనసుకు నచ్చితే, ఇలాంటి పదాలే జాలువారతాయి. నీకు నచ్చినందుకు సంతోషం మిత్రమా.🌿

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కొమ్మనాపల్లి గణపతిరావు గారి వ్యాఖ్య: *ఎక్కడో విన్న లేదూ చూసిన కథలా అనిపించినా.. చదివించే శైలి.. హృద్యంగా వున్న ఇతివృత్తంతో కళ్యాణ్ ఒక క్లిష్టమైన ప్రయోగం చేశాడు.. ఎప్పుడో మార్క్స్ చెప్పినట్టు ఈ ప్రపంచంలో సామాజిక బంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న నిజానికి సాక్ష్యంలా.. ఈ మధ్య కాలంలో కన్నబిడ్డలు.. తల్లిదండ్రులతో ఉన్న అనుబంధాలని వ్యాపార సంబంధాలుగా భావించడం చూస్తూ బాధపడుతున్న వేళ.. అదే కాన్సెప్ట్ అందంగా ఇన్ఫర్మేటివ్‌గా ప్రెసెంట్ చెయ్యడం సాహసమే అయినా సాధించాడు.. అభినందనలు కళ్యాణ్.. కొమ్మనాపల్లి గణపతిరావు, ( సినీ, టీవీ, కథా రచయిత)*

    1. 9.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      కాల గమనం లో, జీవన ప్రయాణం లో ఎదురైన అనుభవాలు, వరుస లైన్లలో పేరుస్తూ పోతే కథ అవుతుంది. అలాంటి కథలు, మీలాంటి గొప్ప రచయితలు వ్రాసినవి చదివితే, అలా చదవగా ఏర్పడ్డ అనుభవం నుండి వచ్చిందే ఈ కథ .
      మీ కాలాన్ని వెచ్చించి, కథ చదివి, కామెంట్ పెట్టినందుకు, ధన్యవాదాలు సార్.

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చింతపల్లి శ్రీహరి రావు గారి వ్యాఖ్య: *హాయ్ కళ్యాణ్ గారు, ముందుగా మీకు ఈ కథ ఆలోచన వచ్చినందుకు అభినందనలు. మానవ సంబంధాలు ఎలా ఉంటాయో ఈ కథ ద్వారా తెలిసింది. మానవ సంబంధాలు అన్ని ఒక విధంగా చూస్తే ఆర్ధిక కోణం లో ఉన్న ఒక మనిషి జీవితం. ఇటువంటి కథ సైన్స్ తో ముడిపడి ఉంటుంది అనే విషయం చాలా బాగుంది. మీరు ఈ కథ ని సినిమా స్క్రిప్ట్ గా తయారు చేసి ప్రస్థుత పరిస్థితులలో ఒక కొత్త మెసేజ్ ఇవ్వచ్చు అని నా అభిప్రాయం. ధన్యవాదములు. చింతపల్లి శ్రీహరి రావు, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్.*

    1. 10.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      ధన్యవాదాలు అండి. మీ విలువైన కాలాన్ని వెచ్చించి కథ చదివి, కామెంట్ పెట్టినందుకు. 🙏🍀

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సీతగారి వ్యాఖ్య: *బావుందండి. మానవ సంబంధాలన్ని,, రాను రాను, ఆర్థిక సంబంధాలేమోఅని ఒక లిప్త పాటు భయం వేస్తుంది మీ కధ చదువు తుంటే. బావుంది. సీత, తిరువూరు*

    1. 11.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      నిజం కూడా అదే అండి. మానవ సంబంధాలు అన్నీ ఒక అవసరం మీద ఆధార పడి ఉంటాయి.
      అవసరం యొక్క ఇంటెన్సిటీ తగ్గగానే, నిజాలు బయటకు వస్తాయి.
      చదివి, కామెంట్ పెట్టినందుకు, ధన్యవాదాలు🌿🙏

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Anil: *It is very unfortunate that many people are gaining wisdom at the fog end of their life. we must understand the actual reality of life through our Traditions and Literature while we are in this Samsara. In this story, he had wisdom after he left the physical body which doesn’t have any value to other except to Him. To be frank, Story content is Old one, but your presentation is excellent. – Anil, Senior HR in software company, Hyderabad.*

    1. 12.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      Anil, Thanks for your feedback. 🌿The narrative is purely a work of fiction designed as a dramatic exploration 🍀 Of the human condition, using a series of events as a ‘litmus test’ for emotions and feelings.🌹

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కిబశ్రీ గారి వ్యాఖ్య: *చాలా బాగుంది. ఫాంటసీకి చక్కటి తత్వజ్ఞానాన్ని జోడించి చాలా ఆసక్తికరరంగా నడిపారు. చనిపోయినవారు ఆత్మగా తిరిగి వస్తే కలిగే అనుభవాలమీద చాలా కథలే వచ్చాయి. కానీ బొందితో తిరిగిరావడమన్న కావ్సెప్ట్ భలే తెచ్చారు.- కిబశ్రీ, USA.*

    1. 13.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      ధన్యవాదాలు సార్! బొంది తో, భూమిని చేరినా, నిజం తెలుసుకున్నాక, ఆత్మ స్వరూపం లో కైలాసానికి జ్ఞానం తో వెళ్ళటం, తృప్తి తో పాటు
      మోక్షానికి సులువు అనుకోవటం ముగింపు.
      చదివి కామెంట్ పంచుకున్నందుకు ధన్యవాదాలు.🙏🌺🍀

  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జీడిగుంట విజయసారథి గారి వ్యాఖ్య: * కథ చదివానండి. కాన్సెప్ట్ బాగుంది. ఈ మధ్య నేను చదివిన కథల్లో ఇది చాలా డిఫరెంట్‌గా అనిపించింది. కథాకథనం ప్రెజెంట్ చేసిన విధానం ఒక్కసారి మొదలు పెట్టాక చివరివరకూ తీసుకెళ్లి పోయింది. తన వారితో జరిగిన సంఘటనలను ప్రజ్ఞానంగా భావించమని వాటిని ఆరు సూత్రాలతో ముడిపెట్టి మంచి తర్కంతో తత్వం బోధించడం నచ్చింది. చివర్లో రాజారావు కోణం నుంచి ఇంకొంచెం క్లారిటీ తో ముగింపునిస్తే మరింతగా రక్తి కట్టేది. – జీడిగుంట విజయసారథి, యుఎస్ఎ

    1. 14.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      మీరు ఇప్పటికే కొన్ని వందల సంఖ్యలో కథలు చదివి ఉంటారు. మీరు స్వయానా సాహిత్య అభిలాషి మరియు స్వయాన మీరే ఒక రచయిత కూడాను. మీ తండ్రిగారి కిశే జీడిగుంట రామచంద్ర మూర్తిగారి
      రచనలు మీరు ఎన్నో చదివి ఉంటారు, అంత అనుభవము ఉన్న మీ వంటి వారి నుండి నా రచన పైన మీ అభిప్రాయాన్ని పంచుకోవటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ధన్యవాదాలు అండి.🙏🍀

  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి స్పందన: *చనిపోయాడు అనుకున్న రాజారావు బ్రతికి రావడమనే ఆసక్తికర అంశంతో మొదలైన కథ, ఆ తర్వాత అంతు చిక్కని గందరగోళంలో పడి, ఎటో వెళ్ళిపోతూ పాఠకుని అయోమయ స్థితిలో పడేసింది.
    వేర్వేరు కథావస్తువులు అన్నిటిని, ఒకే కథలో “dump” చేయడం వలన చదివేప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.*

    1. 15.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      చదివి మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు

  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గౌరినాధ్ గారి వ్యాఖ్య: *చచ్చి బతికినోడి నేపథ్యంతో, ఉత్కంఠ రేకెత్తించే కథాంశంతో, బిగి సడలని కథనంతో, మానసిక, శాస్త్రీయతను జోడించిన, జి.వి కళ్యాణ శ్రీనివాస్ గారి “లోకాంతర సాక్ష్యం” కథ చివరిదాకా చదివించింది. మానవ నైజానికి , స్వార్థం – ప్రేమ, భౌతికత – ఆధ్యాత్మికత, బొమ్మా – బొరుసును తెలిపింది. మంచి కథను వ్రాసిన రచయితకు, పబ్లిష్ చేసిన సంచికకు అభినందనలు. – గౌరినాధ్ , యూకె, ప్రెస్టన్.*

    1. 16.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      జీవితం లో అవసరాలు, అన్ని ఎమోషన్స్ నీ, పక్కకి నెట్టి, ఆ అవసరమే ముఖ్యం అనట్టు రాజ్యం ఏలుతుంది. మానవ వాంఛలు అన్నీ ఈ అవసరాల మధ్య ఒదిగి, చివరకు ఆత్మీయతలు అనేవి మచ్చుకు కూడా కనపడి చీకటి లోకం లోకి మనిషిని నెట్టి వేస్తుంది.
      చాలా కుటుంబాల్లో ఇవే ఇప్పటి కాలం లో కనిపిస్తూ ఉంటాయి.
      మీరు కథను చదవటమే కాక, నాకే తెలియని కొత్త కోణాన్ని చూపించారు, మీ వ్రాత లో.
      ధన్యవాదాలు🍀🙏🌿

  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అనూరాధ గారి వ్యాఖ్య: *బాగా వ్రాసారు కథ. ఈ మధ్య వస్తున్న కధలకు, భిన్నంగా ఉన్నది. మంచి ప్రయత్నం – అనూరాధ, యునైటెడ్ కింగ్డమ్.*

    1. 17.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      ధన్యవాదాలు అనురాధ గారు

  18. 18

    కొల్లూరి సోమ శంకర్

    ఇది విజయ్ గారి వ్యాఖ్య: *”లోకాంతర సాక్ష్యం” నేను ఇప్పటివరకు చదివిన కథలలో అత్యుత్తమమైనది. ఇది సాధారణ థ్రిల్లర్ కాదు, స్వచ్ఛమైన ఫాంటసీ కాదు, లేదా కేవలం ఒక తాత్విక కథ కాదు, ఇది మూడింటినీ కలిపి ఒకే ప్రశ్నను లేవనెత్తుతుంది:
    “ఒక వ్యక్తి జీవితంలో, ఎవరూ ఎవరికీ శాశ్వతం కాదు; అవసరం ముగిసిన తర్వాత, ప్రేమ కూడా ఒక లావాదేవీగా మారుతుంది.”
    ఈ కథ ఆ సత్యాన్ని క్రూరంగా, కనికరం లేకుండా, కానీ చాలా నిజాయితీగా చెబుతుంది. రచయితకు అభినందనలు. విజయ్. ఫ్రం యుకే.*

    1. 18.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      ధన్యవాదాలు విజయ్ గారు. ఒకానొక సమయం లో ప్రేమ కూడా లావాదేవీ గా మారుతుంది అనేది కఠిన సత్యం. ఇక్కడ సత్యం చాలా క్రూరమైన కత్తి, దానికి తన, పరా ఉండవు.

  19. 19

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మహా లక్ష్మీగారి వ్యాఖ్య: *బావుంది. ఇప్పటి రోజులకు దగ్గరగా ఉంది. మహా లక్ష్మీ, హైదరాబాద్.*

    1. 19.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      ధన్యవాదాలు మహా లక్ష్మీ గారు.
      అవును ఇప్పటి రోజులకు మరీ దగ్గిరగా!!

  20. 20

    కొల్లూరి సోమ శంకర్

    ఇది BV సత్య నగేష్ గారి వ్యాఖ్య: *ఫిలాసఫీ, సైకాలజీ, ఆధునిక లోకం పోకడను మేళవించి సృజనాత్మకంగా సృష్టించిన కథ ఆసక్తికరంగా సాగింది. అమాయకుడు అనుకున్న రాహుల్ తెలివి ప్రదర్శించిన తీరు బాగానే ఉంది కానీ.. రాజారావు భార్య సుజాత తన పిల్లలతో చేతులు కలిపి కుట్రలో భాగం పంచుకోవడం కొంత ఇబ్బందిగా అనిపించింది. కథ మొత్తం రసవత్తరంగా సాగింది. మీకు అభినందనలు. సామాజిక అంశాలపై మీరు ఇంకా చాలా కథలు రాయాలని కోరుకుంటున్నాను.*

  21. 21

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పాలగుమ్మి పద్మావిజయ్ గారి వ్యాఖ్య: *కళ్యాణ్ గారూ.. మీరు వ్రాసిన’లోకాంతర సాక్ష్యం’ చదువుతూంటే చుట్టుప్రక్కల పరిసరాలను మరిచిపోయాను. ఈ కథ వ్రాయటానికి కావలసిన సమాచారం సేకరించటానికి, దానికి అక్షరరూపం ఇవ్వటానికి మీరు పడిన శ్రమ కళ్ళముందు కనపడింది. మంచి తెలుగు పదాలతో, ఆధ్యాత్మికతను జోడించి మరణించిన వ్యక్తి తిరిగి వస్తే కుటుంబంలో జరిగేదేమిటో మీ కథ ద్వారా వివరించారు. ఒళ్ళు గగుర్పొడిచింది చదువుతుంటే. కథలు ఎందరో వ్రాయగలరు. వైవిధ్యమైన అంశాన్ని తీసుకుని స్మృతిలో నిలిచిపోయే ఇటువంటి కథలు వ్రాయటమే నిజమైన విజయం.🌹*

  22. 22

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మల్లిక్ గారి స్పందన” *కథ వెరైటీగా, చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంది. మల్లిక్ (నవల, కథా రచయిత, కార్టూనిస్ట్)*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!