సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    Kasturi muralikrishna

    this is the opinion of dr. Gali Rajeswara rao.
    షరతులు లేని నిబద్ధత పాదచారిది. ధృడమైన మనో వైరాగ్యం పాదచారిది.. కలియుగం లో నవజీవన పథంలో జీవించడం గొప్ప కళ ..ఆ జీవనకళ పాదచారి సొంతం.. అశాశ్వతాలకోసం, వగపు కూడదంటాడు..మనసుతోనే వుంటూ మనసుకేదీ అంటించుకోకుండ కర్మలకతీతంగా వుండగలిగే గంభీరమైన నివృత్తి పథం పాదచారిది….
    క్షణం క్షణం కరిగిపోతోంది..కణం కణం కాలిపోతోంది…తానా పాదచారి పాదాలు ఆగలేదు……గరిక కూడా హీరోనే! గరికవీరుడంటే గ్రీకు వీరుడే..మరి!..గడ్డిపూవుకూ వుందొక అస్తిత్వం!…అవన్నీ మీ ఆహ్వానాన్ని విని నవ్వుకున్నాయా!? పరిహసించాయా!?….పాపం పాదచారి!అలుపెరగని బాటసారి…(పాటసారి కూడా) నాకెందుకో మయసభ, దుర్యోధనుడు గుర్తొచ్చారు………నిజమే మనిషికి భయపడనిదెవరు?అన్ని ప్రాణులకూ వాడే యముడు..జంతువులకు వేట అవసరార్థం…మనిషికి వేట వినోదార్థం…అదీ దొంగచాటు వేట…చివరాఖరికి కప్పకు కూడ కరుణ లేకపోయింది..మనిషి తప్ప అన్నీ నిష్కామంగానే వున్నాయి వుంటాయి..
    మనిషి దేవునిమాటా వినడు. ప్రకృతి మాటను అస్సలు పట్టించుకోడు..సాహిత్య వచనాన్ని ఏమాత్రం లెక్క పెట్టడు…….కాగా…మమ్మల్ని మేము మరిచిపోతే మీపుస్తకమెందుకు?..సరే..సరే..పుస్తకాన్ని పట్టుకున్నాక ఇంకో లోకమెందుకు? అదంటూ వుంటేకదా…నేనే లోకం..లోకమే నేనైపోతే!?….ఇక, ”నీలోని నీ లోకం లోకి”…అని అంటారు గానీ…అది ”నీ” ”నా” లు లేనిలోకం కదా…ఇప్పటిదాకా కచ్చితంగా నాకు తెలియని లోకమది.

    Reply
  2. 2

    Kasturi muralikrishna

    ఇది Dr గాలి రాజేశ్వరి గారి అబ్జిప్రాయం
    మరుపు మనిషికి కొండొకచో వరం! కొండొకచో శాపం!…”మరుపు,ఙాపకం” రెండూ మనిషికే సొంతం….నన్ను నేను మరిచిపోతే నీదగ్గరకెలా రాగలను దేముడా!?….నన్ను నేను మరిచిపోతే,అస్తిత్వాన్ని కోల్పోతే నిన్నెలా చూడను ప్రేమా!?…సరే..సరే..నన్ను నేను మరిచిపోతా! ఆలోచనలను,అహాలనూ వదిలేస్తా!…ఓ ప్రకృతీ.. నాప్రకృతిని వదిలేస్తే దర్శనమిస్తానంటావు!!…ఆఁహాఁ ఓహో..ఇన్నింటిని వదలగలిగితే ఇంక దేముడెందుకు?ప్రేమా, ప్రకృతీ ఎందుకటా!?………….ఔను స్నేహపరిష్వంగంలోనే సర్వాన్నీ మరిచిపోగలం…నన్ను నేను అలాగే మరిచిపోయా! మరి నాస్థానంలో నీ తిష్టేంటట?? మోసం..దగా.. అన్యాయం….ఏవండోయ్ చదువరులారా, పాఠకులారా, ”ఆపంక్తులు” జాగ్రత్తగా మనలను తమతో నడిపించవు…తమలో కలిపేసుకుంటాయి…జాగ్రత్త పడండి.అనుభవంతో చెబుతున్నా….

    Reply
  3. 3

    యామినీ దేవి కోడే

    మనిషికీ మనసుకూ మద్య ఊసులు
    పాదచారి వెంట పాత్రలు..
    ఎవరి లోకంలో వారిని ఉండనివ్వక సత్యమేమిటో చూపిస్తాయి.
    నిత్యం వైపు నడిపిస్తాయి.

    కావాలనుకున్న కాంతి నక్షత్రం
    దూరపు కొండ.. మనిషికీ మనసుకూ మద్య శ్వాసలూ.. నిట్టూర్పులూ.. ఎన్ననీ.. చెప్పలేనన్ని శ్వాసలు ఎదురుగా నిలిచి నిలతీస్తున్నాయి.

    రేయి.. పగలు చీకటి.. వెలుగు ఇలా అనేకం వెలిగి ఆరే నక్షత్రాలు.. ఎంత చక్కటి పోలికలివ్వన్నీ.. జీవితం క్షణకాలపు బంగురం అనే మాట ఎందుకో నా కిప్పుడు గుర్తు వచ్చింది..

    ఈ ప్రస్తావన ఇప్పుడు సరైనదో కాదో కానీ.. నాకు అదే అనిపించిది.
    ఏదో ఉందనుకోవడం.. కావాలనుకోవడం..
    ఊహలో ఉన్నదీ.. కావాలనుకున్నదీ..
    అప్పుడే తెలిసింది తృప్తి అనేది ఉండేది ఎక్కడని.

    పాదచారి పార్కులో ప్రేమికుణ్ణి అడిగే ప్రశ్న ఆలోచన రేకెత్తించదూ..
    నక్షత్రాలను అడిగే ప్రశ్నలు కూడా అంతే ఆలోచనలో పడేసాయి.
    ఈ ఆరోమెట్టు కథే నాక్కావాల్సిందనిపించిందిప్పుడు.. చేరవలసిన తీరమేదో అక్కడే ఉన్నట్టుంది..

    Reply
  4. 4

    Dr. Lakshmi Raghava

    దృఢమైన మనో వైరాగ్యం ! మనసును తరిమేయాలన్న ఆలోచన ! శ్వాస పలకరింపు … ఉఛ్వాస , నిశ్వాస! నక్షత్రాల నవ్వుల మధ్య నేనున్నానంటూ తట్టి లేపేప్రేమ ! ఆరోమెట్టు తో తొలిఘట్టం ఎలా ప్రారంభమవుతుందో అన్న ఉత్కంఠ !

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!