పొగడ్తలతో ముంచెత్తనవసరంలేదు!
గంటల కొద్ది సమయాన్ని కేటాయిస్తూ
ఫోన్లో మాట్లాడ నవసరం లేదు!
వేల కోట్లు వెచ్చించనవసరంలేదు!
సదా సమక్షంలో ఉంటూ
హిత వచనాలు పలకనవసరం లేదు!
..స్నేహితుడు ఆపదలో ఉన్నాడని తెలియగానే
చేతనైన సాయం చేస్తే చాలు!
అప్పుడప్పుడు చిరునవ్వుల పలకరింపులతో చేరువవుతూ
‘నేస్తం ఒకరు తోడుగా ఉన్నారన్న భరోసా’ కల్పిస్తే చాలు..
స్నేహాలు పరిపూర్ణమవుతాయి!
నీ ఉన్నతిని అందరూ కాంక్షించేలా చేస్తూ..
నిన్ను విజయతీరాలకు చేర్చే వారధులు స్నేహాలవుతాయి!

గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.