[అనూరాధ బండి గారు రచించిన ‘మబ్బుజాతి ముసురు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
గాలిపోసుకున్న ఆలోచనలు ఇటు వదిలి వేకువలో మాటలు నేర్పించు వేగంలో మార్పులు చూపించు వేలం వేయబడని సంగతులను ఉదహరించు
మనసుని ఇటు తెచ్చి మాటలను తినిపించు వాక్యాల పదును కాదు వాదాల విసురు కాదు వేకువ మెలకువని వినిపించు
మనిషన్న జ్ఞానీ! మర్మాలు ఏవీ? మబ్బుజాతి ముసురు వినిపించకు
అతి పలుచని శాలువా చలిని వేడి చెయ్యదు తెలిసినదేదైనా మరోటి చెప్పు ‘ఇది విని వదిలే కాలమని’..
ఉక్కపోతల మరో కాల ఉదయం నిన్ను తడిమేవరకూ ఈ కాలాన్ని ఇలానే పాలించు
ఇక్కడ మనం క్రొత్త మొక్కలు నాటడం మరిచినట్లున్నాం
పొగమంచు పట్టిన ఆకులు ఎక్కువ లేవు ఏ వ్రేలికొసలూ ఇప్పుడు నేలని తాకడం లేదు
వేగాలన్నీ మనిషి మెదడుని ఆక్రమించి మనసులు వేలం వేయబడుతున్నాయి
హృదయాల వాసన ఇప్పుడు చూడలేని వేకువ
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
తుమ్మల సీతారామమూర్తి కనకాభిషేక సన్మాన సంచిక-12
కాజాల్లాంటి బాజాలు-132: రసగుల్లా ఇడ్లీ
ప్రియమైన నీకోసం..
అష్టమి రోజు
కాంచన శిఖరం-10
కశ్మీర రాజతరంగిణి-53
మన సినిమాల్లో స్వప్నగీతాలు
36. సంభాషణం – కథా, నవల, నాటక రచయిత డా॥ వి. ఆర్. రాసాని అంతరంగ ఆవిష్కరణ
నూతన పదసంచిక-27
గొంతు విప్పిన గువ్వ – 11
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®