సంచికలో తాజాగా

Related Articles

14 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “బాలభారతం” చిత్రంలోని పాటను వివరించిన తీరు చాలా బాగుంది. ప్రతివారం పాట చిత్రీకరణ గురించి చెప్పే మీరు, ఈ పాటలో మాత్రం భావం గురించి వివరించటం వైవిధ్యంగా ఉన్నది. ఊర్ధ్వ, అధోలోకాల వివరణ, పురాణాల విశిష్ట్యం గురించి చెప్పటం కూడా అభినందనీయం. ఈ కాలం యువత చదవవలసిన మంచి వ్యాసం ఇది……భీముడు బాణాల నిచ్చెన ఎక్కుతున్నప్పుడు అతడి నీడ నగరం మీద పడినట్లు చూపించటం అధ్బుతం అనిపిస్తుంది. భవనాలు బొమ్మరిళ్లు లాగా, నది పిల్లకాలువ లాగా చూపిస్తూ భీముడి నీడ పెద్దదిగా చూపించటం నాటి కళాదర్శకుడి ప్రతిభకు నిదర్శనం…..ఇందులో భీముడి గా మాస్టర్ మూర్తి, అర్జునుడి గా మాస్టర్ శేఖర్ నటించారు. హిందీ నాటి టి.జయశ్రీ నాగకన్య గా నటించింది.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది త్రినాథరాజు గారి స్పందన: *చిన్నతనంలో చూసిన చిత్రం తాలూకు జ్ఞాపకాలను మరల చూస్తున్నట్లుంది మీ విశదీకరణ. ఆ వయస్సులో మీరన్నట్లు అర్జునుడు_ భీముడు ప్రయత్నంచూస్తూ లీనమైపోయాంకానీ మీ వివరణ పాటలో వేదాంత స్ఫురణ అవగతమైంది. ధన్యవాదములు.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వెంపటి కామేశ్వరరావు గారి వ్యాఖ్య: చదివాను. అద్భుతంగా ఉంది మీ రివ్యూతో ఆ పాటలో కొత్త కొత్త అర్థాలు స్ఫురిస్తున్నాయి. నేను మీ రివ్యూస్ అన్ని చదువుతున్నాను.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఉడుత చంద్రశేఖర్ గారి వ్యాఖ్య: *అద్భుతమైన సంగీత,సాహిత్య మేళవింపులతో కూడిన ప్రబోధ గీతం 👏👏 మంచి వివరణతో కూడిన సమీక్ష 🙏🙏*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అయ్యప్ప శాస్త్రి గారి స్పందన: *చాలా అద్భుతంగా విశ్లేషించారు, కృతజ్ఞతలు 🙏*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సుశీలమ్మ గారి వ్యాఖ్య: *మంచి పాట. గ్రీన్ మ్యాట్, గ్రాఫిక్స్ లేని ఆ రోజుల్లో చిత్రీకరణ. ముఖ్యంగా రచన అద్భుతం.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గాప్రసాద్ గారి వ్యాఖ్య: *మా చిన్నప్పుడు ఈ చిత్రాన్ని చూసేను. మానవుడే..పాట అత్యంత అద్భుతమైన చిత్రీరణ. ఆరుద్ర ఒరిజినల్ గా హేతువాది. అందుకే ఆయన ఈ పాటని మానవుడు పదం తో మొదలుపెట్టేడు. కానీ ప్రేక్షకులను చిత్రం గా ఆ సన్నివేశాల్లో ములిగేలా చేసిన స్వరం ఘంటసాల గారిది. ఒక మంచి పాట, మంచి చిత్రీకరణ.👏👏👏*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లక్ష్మి గారి వ్యాఖ్య: *అమ్మో ఒక పాట నేపథ్యం ఇంతుందా? మా చిన్నతనంలో ఈ పాటని పాడుకునేవాళ్ళం.*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. శ్రీమతి కొఠారి వాణీచలపతిరావు గారి స్పందన: *మధురగీతాలు.. మనోహరదృశ్యాలులో ఈ వారం నాకు ఇష్టమైన ‘మానవుడే మహనీయుడు’ పాట విశ్లేషణ అద్భుతంగా వుంది.. నేను ఈ పాటని ఎప్పుడూ కోట్ చేస్తూవుంటాను. మనిషి గొప్పతనాన్ని చెప్పే, మహనీయతను చాటి చెప్పే ఈ పాట రచన, గానం, శంతను శర్మిష్ఠ గారి వ్యాఖ్యానం, కస్తూరి మురళీకృష్ణ గారి అనువాదం అన్ని అద్భుతంగా వున్నాయి.. అభినందనలు 🌷🙏🌷🙏*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రోహిణి భైరవజోశ్యులు గారి వ్యాఖ్య: *బాల భారతం సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అన్ని పాటలూ మాకు నోటికి వచ్చేవి. తరువాత ఎన్నో సార్లు టీవీలో చూసాము. ముఖ్యంగా నవంబర్ 14 న (Children’s day) ఇలాంటి బాలల సినిమాలు వేసేవాళ్ళు. మానవుడే మహనీయుడు అన్న పాటలో మానవుడు అనుకుంటే దేన్నైనా సాధించగలడు అంటూనే దానికి దైవబలం కూడా తోడైతే విజయం తథ్యం అన్నది వివరించారు. స్వర్గం ఎక్కడ ఉంది అన్న ప్రశ్నకు జవాబు ఈ పాటలో ఉంది. అప్పట్లో పిల్లలమైన మేము ఇలాంటి సినిమాలు చూసి పురాణాల గురించి తెలుసుకునేవాళ్ళం. బాల నటుల పేర్లు నాకంతగా తెలియవు. కానీ మాస్టర్ ప్రభాకర్ దుర్యోధనుడిగా, చి. శ్రీదేవి దుశ్శలగా బాగా చేశారు. మధుర గీతాలు – మనోహర దృశ్యాలు శీర్షికలో శంతను శర్మిష్ఠ గారు మాకు మంచి మంచి పాత పాటలను పరిచయం చేస్తూ, మాకు ఆ మధుర జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నందుకు ధన్యవాదాలు.*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి స్పందన: *మానవుడు తన శ్రమ, బుద్ధి బలం, పట్టుదలతో దైవత్వాన్ని కూడా సాధించగలడు అని చాటి చెప్పేలా ఆరుద్ర వ్రాసిన ‘ మానవుడే మహనీయుడు ‘ పాట తెలుగు సినిమా పాటల్లో ఎన్నదగిన పాటల్లో ఒకటి.
    పాట సాహిత్యం ఒక ఎత్తు అయితే, సంగీతం మరొక ఎత్తు. ఘంటసాల మాస్టారు ఆ పాటా పాడిన విధానం, పాట చిత్రీకరించిన తీరు ఒకదానిని మించి మరొకటి ఉంటాయి.
    సాంకేతిక విజ్ఞానం అంతగా అభివృద్ధి చెందక పోయినా, అందుబాటులోని వనరులతో, ఆబాలగోపాలాన్నీ అలరించేలా పాటలోని ప్రతి వాక్యాన్ని కన్నుల పండువుగా దృశ్య రూపంలోకి అందించిన టీం కు అభినందనలు తెలియచేయాలి.
    ధ్రువుడు, భగీరథుడు, విశ్వామిత్రుడు ఇలా అందరూ మానవులే. అద్భుతాలు సృష్టించినవారే.
    ఉపగ్రహాలు, గ్రహాలు, తారలు ఆ తరువాత వేరే పాల పుంతలకు ప్రాణంతో వెళ్లి రాగలిగే మనిషి ఇంత శక్తివంతుడే. ఇంద్రలోకం, చంద్రలోకం వెళ్ళినా తిరిగి రాగల శక్తిమంతుడు మానవుడు.
    జీవితం మీద విరక్తి కలిగి పాల్పడే యువతకి ఈ పాట కనువిప్పు కాగలదు.
    మధురగీతం, మనోహర దృశ్యాలు శీర్షికన ఇంత చక్కటి పాటను అందించినందుకు శంతను – శర్మిష్ఠ గార్లకు ధన్యవాదాలు.*

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అల్లూరి గౌరీలక్ష్మి గారి వ్యాఖ్య: *ఈ పాట పదం పదం మ్యూజిక్ తో సహా బట్టీ మాకు.భావం లోతు తెలీదు.ఈ పాట ఆరుద్ర గారు రాశారని చెబుతూ ఇంత అద్భుతమైన విశ్లేషణ చేసిన రచయితలిద్దరికీ ధన్యవాదః 🙏🏻🤗.*

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గీతాంజలి గారి వ్యాఖ్య: *మానవుడే మహనీయుడు పాట చిన్నప్పుడు అమ్మా నాన్నలతో అన్నతమ్ములతో థియేటర్ లో బాలభారతం సినిమాలో చూడ్డం ఇప్పటికీ మధురమైన అనుభూతే.భూమి నుంచి ఆకాశానికి నిచ్చెన వేస్తే ఆ నిచ్చెన మీద నుంచి భీముడు ఆకాశాన్ని చేరుకునే దృశ్యాన్ని నోరెళ్ళబెట్టి పరమాశ్చర్యానందాలతో చూడ్డం ఇంకా జ్ఞాపకమే.*

  14. 14

    పి. దినకర్ రెడ్డి

    చక్కగా మంచి విషయాల్ని తెలిపారు.
    ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే

    ఈ వాక్యానికి ఇంకోలా కూడా అర్థం చేసుకోవచ్చు. మీరు చెప్పినది ప్రేరణ దైవం ఇచ్చినా మనిషే కార్యాన్ని పూర్తి చేయాలి.
    ప్రేరణ ఇచ్చిన దైవం మనిషి చేత కార్యాన్ని పూర్తి చేయిస్తాడు. అంటే కేవలం నారు పోసిన వాడు నీరు పోయాడా అనే అర్థం గురించి కాదు. ఒక సత్కార్యాన్ని, ఒక రకంగా అద్భుతం లేదా నమ్మశక్యం కానిదాన్ని కూడా దైవం ఆలోచన అనే ప్రేరణను కలిగించి మనిషి దాన్ని పూర్తి చేసేలా మార్గం చూపిస్తాడు అనే భావం ఉండొచ్చు అనిపించింది. అంటే సాక్షాత్తూ ఆ దైవమే ప్రేరణ ఇస్తే ఇక మనిషి సాధించలేనిది ఏముంది అనే అర్థం నాకు కనిపించింది. ఇది కేవలం నా ఆలోచనే. పాట గురించి ఎన్నో విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!