సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “మధుర గీతాలు – మనోహర దృశ్యాలు” లో ఈవారం పాట గురించి ఎప్పటిలా చిత్రీకరించిన విధానాన్ని కాకుండా భావాన్ని, పాడిన విధానాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించారు. నిజజీవిత సత్యాలను కూడా సందర్భోచితంగా అంతర్భాగం చేసి చెప్పారు…..”మాయాబజార్” లో పండితులు చెప్పినట్లు “మీరు కూలంకష ప్రజ్ఞావంతులు. ఇందులో శంకించటానికి ఏమీ లేదు. సందేహించటానికి అంతకన్నా లేదు”……….ఈ పాటలో నర్తించింది జ్యోతి, నటరాజన్..సగం పాట తర్వాత వాసంతి, నాగభూషణం తాము పాడుతున్నట్లు ఊహించుకుంటారు…(జ్యోతి మంచి నర్తకి…సీతారామ కళ్యాణం చిత్రంలో “గోవింద మాధవ దామోదరా….” పాటలో దశావతారాలను అద్భుతంగా ప్రదర్శిస్తుంది.)…

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బి. రోహిణి గారి స్పందన:*మావ.. మావా.. మావా… అద్భుతమైన విరుపులతో జమునా రాణి పాడిన పాట మహాద్భుతం. ఇప్పటి తరం వాళ్ళు వివాహం ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ అనీ పెళ్లి కాకుండానే వేసే వెర్రి వేషాలు, దానికి అనుమతి ఇచ్చే తల్లి తండ్రులు.. ఎవరిని తప్పు పట్టాలి? పక్కవాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేమూ చేస్తాం అని వాదించే పిల్లలు, పెద్దలు ఉన్నంతకాలము ఇది ఇలాగే కొనసాగుతుంది. ఇంకా విపరీత ధోరణి ఏమిటంటే ఇద్దరూ అర్థం చేసుకోవాలి అంటూ చేసే సహ జీవనం గురించి చెప్పుకుంటే సిగ్గు పడాల్సిన సమాజం, దానిని చట్టబద్దం చేయడం ఎంతవరకు న్యాయం? పెళ్లిని వ్యాపార ధోరణిలో విడాకులు తీసుకోవడం, ఇంకో పెళ్లి చేసుకోవడం.. పిల్లలు ఇలాంటి సమాజంలో పెరిగితే, వాళ్ళ ఆలోచనలు ఇలాగే పెడ దోవన పడతాయి.
    ఈ పాటలో యువతీ యువకులకు సున్నితంగా సమాజ నియమాలు చెప్పడం చెప్పడం చాలా మెచ్చుకోవాల్సిన విషయం ఇప్పటి పాటలు స్పష్టత లేకపోవడం వల్ల ఏం పాడుతున్నారో, ఆ పాటలోని సాహిత్యమేమిటో అర్థం కాకపోవడం మా అదృష్టం.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మి గారి వ్యాఖ్య:*శంతనూ-శర్మిష్ట పాటలను ఎంపిక చేసుకోవడం వివరిండం బావుంది. మూసలో వెళ్లిపోకుండా పాత, కొత్త పాటలను తీసుకుని విశ్లేషించడమూ ముదానహం. వారికి, సంచిక వారికీ ధన్యవాదాలు.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అల్లురి గౌరీలక్ష్మి గారి స్పందన:*యువతకు చక్కని సందేశం ఉన్న మంచి పాటను తీసుకుని present societal scenario తో పోలిక చేస్తూ అద్భుతంగా, పరమ సత్యంగా సాగింది ఈ వ్యాసం. రచయితకు అనేక అభినందనలు.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®