సంచికలో తాజాగా

Related Articles

14 Comments

  1. 1

    Yamini Devi

    నమస్సులు గురువర్యా 🙏
    మీరు అల ద్వారా చెప్పించిన ఉత్తరాలలోని భావమాధుర్యం, కవిత చాలా చాలా బావున్నాయ్.
    అల పుస్తకాలు గురించి చెప్పడం.. మహతి లైబ్రరీకి వెళ్లడం పుస్తకాలు గురించి మళ్ళీ ఆలోచించడం నన్ను కూడా ఆలోచనలో పడేసింది.
    పాటలతో చెప్పిన జీవితసత్యాలు (నరుడి బ్రతుకు నటన)అన్నీ బావున్నాయ్.
    సినిమాలగురించి అందులోని భావావేశాలు గురించి మహతి వాళ్ళు చర్చించడం ఇంకా కొన్ని చూడాలి అని అనుకోవడం మేము ఏం మిస్ అవుతున్నామో గుర్తు చేసింది.
    త్రిపురగారి ద్వారా చాలా మంచి విషయాలు చెప్పించారు.
    మంచి నేర్చుకోవాలి అన్న ఆలోచన మనిషికి ఉండాలి కానీ ఎక్కడనుంచి అయినా తీసుకోవచ్చు.
    శ్యామల, త్రిపుర గారి బంధం మనిషి కి మనిషికి మధ్య ఉండాల్సింది ఇది కదా అనిపించింది.
    మహతి వాళ్ళ అమ్మ గారి గురించి తెలుసుకోవాలి అన్న తపన కొన్ని వారాల నుంచి వెంటాడుతుంది. వచ్చేవారం కోసం ఎదురు చూస్తూ..
    మరోసారి నమస్సులు మీకు🙏🙏💐

    Reply
    1. 1.1

      BhuvanaChandra

      యామిని గారు పూర్వ కాలం నాడుసిరి చుక్క అనే వాళ్ళు. ఈ వారం సిరి నీవే చక్కని విశ్లేషణతో ఎంతో స్ఫూర్తిని నాకు ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు థాంక్యూ సో మచ్

      Reply
  2. 2

    Rama Sandilya

    భువనచంద్ర గారు, చాలా బావుందండీ. మళ్ళీ వచ్చే భాగం కోసం ఎదురుచూస్తున్నాము.

    Reply
    1. 2.1

      BhuvanaChandra

      రామాజీ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అనేక పనులతో సమస్యలతో ఉండి కూడా సీరియల్ చదివి మీ స్పందన తెలియజేసినందుకు మరోసారి మరోసారి ఆ హృదయపూర్వక ధన్యవాదాలు

      Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన:
    *శ్ర‌ీ భువన చంద్ర గారూ నమస్కారం. ఈ ఆదివారం రచనాగీతికలతో కడుపు నిండుగా ఉంది. జీవితంలో మననషికి కావలసిన అవసరం అయిన రచనలు లోని
    లోతుల్ని సినిమా ద్వారా మానసిక తృప్తిని ఎలా అనుభూతి పొందాలో చాలా విశ్లేషించి చెప్పారు. చాలా బాగుంది అభివందనాలు.
    నవల చదువుతున్నట్టులేదు, హాయిగా అందరం కలిసి అన్నీ అనుభవిస్తూ ఆనందించిన తృప్తిగా ఉంది అండి. బహుశా కళకి అర్థం ఇదే కదా.
    మనకి ఏమి తెలిసినా, తెలియక పోయినా ఆ కాసేపూ మనం మమేకమై అనుభూతి పొందుతూ హాయిగా ఆ కాసేపు అన్నీ మరచి ఆనందించేలా చేస్తుంది.
    మీరు వ్రాసిన పాట మీ భావాల మూలాలు తిరిగి వ్రాయనక్కరలేదు. చాలా అర్థవంతంగా కళాత్మకంగా రసవంతరంగా ఆత్యీయపరంగా ప్రయాణంలా ఉంది అండి. చాలా ఆత్మీయ ధన్యవాదాలు అభినందనలు అండీ. నమస్కారము.*

    Reply
    1. 3.1

      BhuvanaChandra

      రమాదేవి గారు హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా రెగ్యులర్గా మీ స్పందన తెలియజేస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది థాంక్యూ సో మచ్ అండి

      Reply
  4. 4

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్సులు. ఉత్తరాలు వ్రాయడం చదవడం మర్చే పోయాము. ఉత్తరాల ప్రాముఖ్యత,పుస్తక పఠనం అవసరం బాగా తెలియ చేసారు. త్రిపుర, శ్యామల మధ్య అనురాగం చూస్తే రక్తసంబంధాలే అవసరం లేదు ప్రేమించడానికి అనిపించింది. మీ కవిత బాగుంది. సినిమా విలువ అది జనాలకు ఏమి ఇచ్చిందో అర్ధం అయ్యేలా వ్రాసారు. ధన్యవాదాలు తెలుపుతూ 🙏-రోహిణి

    Reply
    1. 4.1

      BhuvanaChandra

      రోహిణి గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు వారం వారం చక్కగా చదివి నీ స్పందన చక్కగా అందిస్తున్నందుకు మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు అందుకోండి
      రచయితకి పాటకుల యొక్క స్పందన శ్వాస లాంటిది. అది ఎంతో ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది అలా ప్రతివారం ఆనందం కలిగిస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటున్నాను థాంక్యూ సో మచ్

      Reply
  5. 5

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    ఈమధ్య మహతి కంటే అల ను, అల భావుకతను ప్రేమించేస్తున్నాను ఏమిటో! తిమ్ము తో తిక్క తిక్క గా ప్రవర్తించిన అల క్రమంగా ఎంత కుదురుగా తయారైంది! అందమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటోంది! అల రాసిన ఉత్తరాలను మహి తో పాటు పాఠకులూ ఉద్విగ్నత తో చదువుతారనుకుంటా. అందులో తన చిరు కవితలతో పాటు, హిందీ తెలుగు సినిమా పాటల్ని ఉదహరిస్తోంది.
    కథలో చక్కని పాటల్ని చేరుస్తున్న భువన్ జీ!
    అభినందనలు!!

    Reply
    1. 5.1

      BhuvanaChandra

      సుశీల గారు నమస్కారం. చాలా చాలా హృద్యంగా వివరంగా మీ స్పందన తెలియజేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
      మీరు చాలా చక్కగా చదివి పాత్ర లను విశ్లేషిస్తూ రాసే చిన్న సమీక్షలు నాకు చాలా స్ఫూర్తిని ఆనందాన్ని ఇస్తాయి
      మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్సులు.

      Reply
  6. 6

    Sobharaja

    🙏ఈ శీర్షిక రసవత్తరంగా, కళాత్మకంగా చక్కని జీవి త సత్యాలతో మనసుకు పసితనపు జ్ఞాపకాలను కళ్ళముందు కనిపించేలా చేశారు.
    మిత్ర దేవోభవ అనే కొత్త పదాన్ని సృష్టించి స్నేహపు స్థాయిని దైవత్వంగా రూపుదిద్దారు.
    ఈ శీర్షిక చదువుతున్నట్లు లేదు. హాయిగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నట్లు మమ్మల్ని నిమగ్నుల్ని చేసారు. కాసు మనిషి అవసరాలను తీరుస్తుంది. కళ మనసు అవసరాలను తీర్చి ఆనందాన్నిస్తుంది అనే నగ్నసత్యాన్ని చెప్పారు.
    చిన్నప్పటి నులకమంచం,వెన్నెల్లో ఆడుకోవడం,నక్షత్రాలను లెక్కపెట్టడం ,వర్షపు చినుకుల్లో తడవడం గుర్తుచేసి మనసును మధుర జ్ఞాపకాల్లోకి మళ్ళించారు
    మీ కవితలతోబాటు మహా కవుల పాటలను, నవలలను గుర్తు చేస్తూ ఈ శీర్షికను రసవత్తరంగా తీసుకెళ్ళారు.
    ధన్యవాదాలు🙏🌹🙏

    Reply
    1. 6.1

      BhuvanaChandra

      సోమ గారు మీరు ఎంతో అందరంతో రాసిన ఈ సమీక్ష నాకు చాలా ఆనందాన్ని ఉత్తేజాన్ని ఇచ్చింది
      చాలా చక్కగా చదివి పాత వ్యక్తిత్వాన్ని విడిచిపెట్టి మీ స్పందన కోసం మళ్లీ మళ్లీ ఎదురు చూస్తూ ఉంటాను
      మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు
      భువనచంద్ర

      Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కాదంబరి గారి స్పందన: *భువన చంద్ర గారు నమస్సులు. మహతి చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. అలా ఉత్తరం ద్వారా తెలియపరచడం విశేషాలు అని అక్షర సత్యాలు. తాతయ్య శ్యామల శ్రీధర్ త్రిపుర గారి సంభాషణ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. వచ్చే భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.*

    Reply
    1. 7.1

      BhuvanaChandra

      హృదయపూర్వక ధన్యవాదాలు కాదంబరి గారు వారం వారం క్రమం తప్పకుండా
      మహతి సీరియల్ పై మీ స్పందన అందజేస్తున్నందుకు మీకు నా ధన్యవాదాలు నమస్సులు

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!