సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రజని పుచ్చ గారి స్పందన: *తెలుగు సాహిత్యానికి సంబంధించి అనేకానేక అంతర్జాల పత్రికలు వెలువడుతున్న నేపథ్యంలో ..సంచిక పత్రిక తనదైన శైలిలో కథలు వ్యాసాలు కొత్త శీర్షికలతో పాఠకుల మనసులను రంజింప చేస్తున్నది..
    అలుపెరుగని యాత్రికురాలు శ్రీమతి రమా శాండిల్య..
    ఆధ్యాత్మిక జీవితం యాంత్రిక జీవితం వేరు వేరుగా కాకుండా చేయి చేయి కలిపి సాగాలి.. ఇప్పటినుండే ఈ భక్తి ఆధ్యాత్మికం అవసరమా.. దేవాలయ సందర్శన యాత్రలు అవసరమా.. పెద్దవాళ్ళం అయినాక చూసుకుందాం ..
    అనుకుంటూ గడిపేయడం సర్వ సాధారణం..
    కానీ ముదిమి మీద పడ్డాకా.. మానసికంగా శారీరకంగా అనేక రుగ్మతలు వెంటపడ వచ్చును..
    పూజలో ఎట్లాగయితే దైవానికి తాజా పూలను మాత్రమే సమర్పిస్తామో.. అట్లాగే వయసులో ఉన్నపుడే తాజాగా ఉన్న మనసుని దైవంపై లగ్నం చేయాలి..
    ఆ విధంగా యాంత్రిక జీవితంలో ఆధ్యాత్మికతకు దేవాలయ సందర్శనకు అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చిన వ్యక్తి శ్రీమతి రమా శాండిల్య గారు..
    జీవితానికి పరమావధి దైవంతో అనుబంధం.. అనే దిశలో సత్యపథం వైపు అడుగులు వేస్తున్న క్రియా యోగ సాధకురాలు.
    తాను దర్శించిన క్షేత్రాలు ఆయా దేవీ దేవతలతో తనకు కలిగిన ఆధ్యాత్మిక అనుభూతులు పుస్తక రూపంగా తీసుకువచ్చి మనముందు ఉంచుతూ.. ఆయా రచనలు చదివిన పాఠకులకు ఉత్తేజపూరితమైన ఆనందాన్ని పంచుతున్నారు.. జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారు…
    వారి ఈ ధార్మిక యాత్రలు విజయవంతంగా కొనసాగాలి.. మరెన్నో రచనలు చేయాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూ..*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది భానుమతి హట్టిగారి స్పందన:*
    శ్రీమతి రమాశాండిల్య గారి వంగదేశయాత్ర పుస్తకాన్ని శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారు సమీక్షిస్తూ ఒకమాట అంటారు.
    “రచయిత్రి కొల్ కత్తా అందాలనువంగదేశదేవాలయాలనూ,ప్రదేశాలనూ వివరిస్తూ గంగపై వంతెనలగూర్చి ఒకమాట చెప్పారని అంటారు.మనుషులమధ్య విభేధాలు వస్తే తెరుచుకోవడానికి పెద్ద వంతెనలు ,మనసులు కలిపే వంతెనలు కావాలి అని .ఆహా యెంత మంచి మాట.అలాటి వంతెనలు ప్రతి వారింటా వుండాలి.
    రచయిత్రి అందించిన వివరాలు,వారి ప్రతిస్పందనలు చదువుతూ వుంటే అయ్యో మనంఆప్రదేశాలను దర్శించలేదే అని అనిపించినా మానసికంగా రచయిత్రి దర్శింపచేశారన్న తృప్తి కూడా కలుగుతుంది.”
    మొత్తానికి యెప్పటిలాగే వారు మంచి యాత్రా వివరాలను అందించినట్లు తెలుస్తోంది.
    చదివితీరవలసిన యాత్రావిశేషాల సమాహారం వంగదేశయాత్ర.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది విజయా కిషన్ రెడ్డి గారి స్పందన: *రమా శాండిల్య గారూ, మీ వంగ దేశ యాత్ర సమీక్ష చదువుతుంటే మీతో కలిసి యాత్ర చేసి కాళికామాతను దర్శించినట్టుగానే ఫీలయ్యాను.
    వెస్ట్ బెంగాల్ తోపాటు బీహార్, జార్ఖండ్‍లో కొంత భాగం దర్శించుకున్నాను. చిన్నప్పుడు చదివిన రవీంద్రనాథ్ ఠాగూర్, శరత్చంద్ర ఛటోపాద్యాయ, మరిచిపోతున్న మహామహులను తలుచుకుంటూ, శాంతినికేతన్‌ను దర్శించుకున్నాను. యోగానంద ఆశ్రమం మేమూ చూసి వచ్చినట్టు మురిసి చేసిన సోమశంకర్ గారికి అభినందనలు. – విజయా కిషన్ రెడ్డి, జూబ్లీహిల్స్.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®