సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పొత్తూరి సునీత గారి వ్యాఖ్య: *అబ్బా.. చాలా బాగుంది మీ ఇంటర్వ్యూ రమా..! ఒక్కసారైనా మీతో కలిసి ప్రయాణం చేస్తే బాగుండును అనిపించింది.
    మీ పుస్తకం రివ్యూ కూడా చాలా బాగా చేశారు. మేమూ కలకత్తా టూర్ వెళ్లాలని అనుకున్నాం. ఎప్పటికి కుదురుతుందో!
    లింకులు ఇచ్చినందుకు ధన్యవాదాలు. భగవదాశీస్సులు!*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మధునాపంతుల సత్యనారాయణ గారి వ్యాఖ్య: *కొల్లూరి సోమశంకర్ గారు చక్కటి విశ్లేషణ చేశారు.
    మీ యాత్రా విశేషాలు ఒక చారిత్రక అన్వేషణ, ఒక సామాజిక పరిశీలన, ఆధ్యాత్మిక ప్రయాణం..
    లోపల శుభ్రపరిచే కథనం.
    ఇలా అనేకం చెప్పుకోవచ్చు.అభినందనలు.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హేమమాలిని మొదలిగారి స్పందన: * అమ్మ మీ గురించి చెప్పాలంటే నాకున్న అనుభవం అసలు సరిపోదు అమ్మా🙏
    కానీ మీరు ఇంటర్వ్యూ లో చెప్పినది చాలా అద్భుతంగా ఉంది మరియు అక్షరాలా సత్యం 🙏🙏🙏
    మీ అనుభవాలు,మీరు వివరించే తీరు అద్భుతం🙏🙏🙏 *

  4. 4

    aanasuya81

    ఈ ఇంటర్వ్యూ చాలా ఆసక్తికరంగా ఉంది.
    ముక్తి క్షేత్రం నాకు బాగా నచ్చిన పుస్తకం. అది చదివి కాశీ వెళ్లటం ఇంకా బావుంది.
    గుడులన్నిటి గురించి మా అందరికీ వివరాలు బాగా తెలియచేస్తున్నారు రమ గారూ. ధన్యవాదాలు 🙏

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సరస్వతి కరవది గారి స్పందన: *నమస్తే సర్, ‘సంచిక పత్రిక’లో వచ్చిన శ్రీమతే రమా శాండిల్య గారి ఇంటర్వ్యూ ఇప్పుడే చదివాను ఆవిడ ఇటీవల కాలంలో ప్రచురించిన ‘నా వంగదేశ యాత్ర’ అనే పుస్తకం గురించి మీరు చాలా వివరంగా, విశదంగా ఎన్నో ప్రశ్నలు అడిగారు వాటికి ఆవిడ ఇచ్చిన సమాధానాలు కూడా చాలా వివరణాత్మకంగా బాగున్నాయి. ఏదో మామూలుగా ‘మీరు ఎప్పటినుంచి రాస్తున్నారు? ఎన్ని పుస్తకాలు రాశారు? అలాగే ఎక్కడెక్కడ యాత్రలు చేశారు?’ వంటి మామూలు ప్రశ్నలు అడిగి, ఇంటర్వ్యూ ని ముగించకుండా, ఆ పుస్తకం మొత్తాన్ని చదివి, అందులోని విషయాలు అన్నీ ప్రస్తావిస్తూ, ఆమె నుంచి సహేతుకమైన సమాధానాలు రాబట్టేలా మీరు అడిగిన ప్రశ్నలు నాకు ఎంతో నచ్చాయి. అలాగే ఆమె సమాధానాలు కూడా మీ ప్రశ్నలకు తగినట్లు చాలా చక్కగా ఉన్నాయి. అలాగే ఇంటర్వ్యూలో భాగంగా ఆమె వ్రాసిన ఇతర పుస్తకాల గురించి కూడా మేము తెలుసుకోగలగటం బాగుంది.
    ఈమధ్య మీరు ప్రచురిస్తున్న ఇంటర్వ్యూలు అన్నీ కూడా చాలా స్ఫూర్తిదాయకంగా, చాలా వి విభిన్నంగా, చదవటానికి ఆసక్తికరంగా ఉంటున్నాయి. అందుకు నా అభినందనలు. ఇంటర్వ్యూ చదవగానే మీకు అభినందనలు తెలియజేసుకోవాలనిపించింది. – సరస్వతి కరవది, సంపంగి పత్రిక.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కృష్ణవేణి గారి స్పందన: * మన రమా గారు వ్రాసిన నా వంగదేశ యాత్ర చాలా అద్భుతంగా వుంది. అందులోనూ గంగాసాగర్ గురించి చదివాక నేను తప్ప కుండా చూడాలి అనిపించింది .రమ గారు వ్రాసిన అన్ని రచనలు చదివాను. అందులో ముక్తి క్షేత్రం చాలా అద్భుతంగా వుంటుంది. ఆ పుస్తకం దగ్గర వుంటే అసలు కాశీ ఫస్ట్ టైమ్ వెళ్ళే వారు కాశీ ఎలా చూడా లో తెలుస్తుంది. అది ఒక encyclopedia.
    మీరు ఇలా ఎన్నో రచనలు చేయాలని మనసారా కోరుకుంటున్నా.
    మీకు మా అభినందనలు 💐💐💐
    ఇంకా చాలా చెప్పాలని వుంది. ‘గో’వాటిక చదివాక గోవాలో ఇన్ని వున్నాయా అనిపిస్తుంది. ‘అష్టాదశ శక్తి పీఠాలు ‘ చదివాక ఇంత కష్ట పడ్డారా అనిపిస్తుంది.చాలా అద్భుతంగా అనిపించింది కూడా. రమ గారి పుస్తకాలు చదివితే నాలాంటి వాళ్లకి కూడా వ్రాయాలని అనిపిస్తోంది. పుస్తకాలు కాదు మీ గురించి.😃 కృష్ణవేణి.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మాడభూషి అరవిందవల్లి గారి వ్యాఖ్య:* సంచిక వెబ్ మ్యాగజైన్లో రమా శాండిల్య గారి ఇంటర్వ్యూ చదివిన తర్వాత ఎంత ఆనందం కలిగిందంటే ఆవిడ చెప్తుంటే ఆ మాటల్లో అవన్నీ ప్రదేశాలన్నీ వెళ్లి వచ్చినట్టుగా అనిపిస్తూ చాలా ఆనందంగా అనిపించింది ఆవిడ అనే ఒక ఎన్సైక్లోపిడియాగా మనం అనుకోవచ్చు యాత్రల విషయాలను ఎవరు ఎక్కడికి వెళ్లాలన్నా ఆవిడని కనుక్కుంటే వివరంగా మనకు తెలిసిపోతుంది. ఆవిడ యాత్రలు చేయడమే కాకుండా ఆ యాత్ర వివరాలు పది మందికి తెలియజేసి తన కళ్ళతో మనకి చూపిస్తున్నారా అన్నట్టుగా ఉంటుంది.*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కిరణ్ ప్రకాష్ నిట్టల గారి స్పందన: *ఉచ్ఛ్వాసనిశ్వాసాలే జీవనంగా మార్చుకున్న ఒక హిమాలయ యోగిని రమా శాండిల్య గారు. నేను అమ్మా అని చాలా ఆప్యాయంగా పిలుచుకునే మనిషి. వంగ దేశ యాత్రానుభవాలను పొందుపరచడంలో వారి ప్రజ్ఞ అసలు ఆ వివరాలు తెలియని నాలాంటి వారికి విశేషమైన ఆసక్తిని కలుగజేసేలా రూపొందించారు. వారి అనుభవాలు మనకి చాలా ఆనందాన్నిస్తాయి కారణం వారు ముందుగా చెప్పినట్లు ప్రాణాయామ నియమాలతో వారి ప్రతి అనుభవాన్ని నిక్షిప్తం చేస్తూ తన జీవనాన్ని ఒక పరమపదసోపాన పఠం లోని నిచ్చెనలున్న విశేష ప్రయాణం లా కాఫు ప్రజ్ఞ తో కూడుకున్న ఆట లా మార్చుకున్నారు. వారి‌ పుస్తకాలు ~ కధనాలు~ శీర్షికలు~ అనుభవపాఠాలు అన్నీ తనలోని అకుంఠిత తపస్సు కు స్వరూపం గా నిలుస్తాయి.‌ కేవలం స్థలాలను చూడటం కాదు… ఆ స్థల దర్శనాలను యాత్రగా ~ ఒక అద్భుత దివ్య చరిత్రలు గా తాను అనుభవిస్తూ మనకూ అందజేస్తారు. కథ లుగా వారి దైనందిక జీవన సరళి మనలోని నిద్రాణమైన ఆధ్యాత్మిక ఆసక్తిని మరెంతో పెంచేదిగా ఉంటుంది. వారి ఈ కృషికి మనఃపూర్వకమైన కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాను – కిరణ్ ప్రకాష్ నిట్టల, ఆధ్యాత్మిక ప్రవచన విదుషీమణి.*

Leave a Reply

All rights reserved - Sanchika®