సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    శ్రీమద్రామాయణం ను వివిధ భాషలలో వివిధ కవులు రచించగా మీరు వివరించిన తీరు ప్రశంసనీయం…అందుకే “కవులెల్ల నీ దివ్యకథలెన్నో రీతుల కొనియాడి ముక్తి గైకొంద్రు గాక!” అని వశిష్ఠ మహర్షి శ్రీరాముడిని ఆశీర్వదించినట్లుగా చెప్పారు పానుగంటి వారు. ఏ గ్రంథం ప్రత్యేకత దానిదే అయినా శ్రీనివాస శిరోమణి గారి శైలి సుధామధురంగా ఉంటుంది…ఎప్పుడో 1954 లో ఆంధ్రపత్రిక లో ధారావాహికంగా వచ్చినా పుస్తకరూపంలో ఇప్పటికీ ఎన్నోసార్లు పునర్ముద్రణ పొందుతూనే ఉన్నది వారి రచన…..వాల్మీకి తన కథను తనే రాసుకున్నాడా! అని చెప్పారు ఒకచోట. ఎందుకు రాయకూడదు? శ్రీరాముడితో సమకాలీకుడు ఆయన…వ్యాసభారతంలో వ్యాసపాత్ర లేదా!…..మీరు ఉటంకించిన పద్యాలు కూడా వేమన పద్యాలు లాగా సులభశైలి లో బాగున్నాయి…..చివరగా “సెల్ఫీ రామాయణం” లో సెల్ఫీ అనే పదం వినగానే గుండెల్లో ఎక్కడో కలుక్కుమన్నది. ..అంతకన్నా “స్వీయ రామాయణం” అంటే బాగుండేదేమో!

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది భువనచంద్ర గారి స్పందన: *సుశీలమ్మ గారు మీరు బ్నిం గారి సెల్ఫీ రామాయణం గురించి రాసిన వ్యాసాన్ని చదివాను అద్భుతంగా ఉంది. వారి రచన మీ విశ్లేషణ రెండూ చాలా ఆహ్లాదకరంగా అద్భుతంగా ఉన్నాయి
    తమ గురించి తామే రామాయణ పాత్రలు చెప్పుకోవడం దానికి సెల్ఫీ రామాయణం అని పేరు పెట్టడం చాలా మదావహంగా ఉంది. రచనలు ఎంత లోతు ఉందో మీ విశ్లేషణలోనూ అంత లోతూ ఉంది. అలతి అలతి పదాలతో అద్భుతాన్ని ఆవిష్కరించిన మీ ఇద్దరికీ అభినందనలు శుభాకాంక్షలు నమస్సులు తెలుపుకుంటూ. మీ భువనచంద్ర.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శీలా సుభద్రాదేవి గారి స్పందన:*రామాయణపాత్రలే తమని తాము పరిచయం చేసుకోవటం అనేది కొత్త ప్రక్రియ. దానిని సరళ తేటగీతిలో, చిత్రాలతో సహా రాయటం మరీ బాగుంది. ఈ విషయాలన్నీ సమగ్రంగా పరిచయం చేస్తూ మీ సమీక్షా బాగుంది 👏👏👌 *

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దర్భముళ్ళ చంద్రశేఖర్ గారి స్పందన: *చాలా గొప్పగా సమీక్షించారు. అభినందనపూర్వక నమస్కారాలు. 🙏🏼 మాన్యులు ‘బ్నిం’ గారి విశేషాలు తెలుసుకున్నాను. ఇంత చక్కటి సమీక్షావ్యాసం పంచినందుకు ధన్యవాదాలు. 👍🏼👌🏼👏🏼💐 *

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తటవర్తి నాగేశ్వరరావు గారి స్పందన:*సెల్ఫీ రామాయణం అంతా అద్భుతంగా వినిపించారు. ధన్యవాదాలు 🙏 *

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జొన్నలగడ్డ శ్యామల గారి స్పందన:*భమిడిపల్లి నరసింహమూర్తి గారి (సంక్షిప్త నామాన్ని రాద్దామని ప్రయత్నిస్తే మొబైల్‌లో కుదరలేదు) సెల్ఫీ రామాయణం పై ప్రొఫెసర్ సుశీలమ్మ గారి సమీక్షా వ్యాసం బాగుంది. అసలు సెల్ఫీ అన్న పదమే ఇప్పటి ధోరణి (ట్రెండ్) కి దగ్గరగా ఉండి.. ఆకట్టుకునేలా ఉంది. రాజమండ్రిలో తెలుగు యూనివర్సిటీలో జరిగిన, రామాయణ పాత్రలు తమకు తాము పరిచయం చేసుకునే కార్యక్రమంలో సుశీలమ్మగారు కైకగా పాత్ర పోషణ .. వాచకాభినయ పోషణ అనవచ్చా? చేసిన విషయం తెలియడం పాఠకులకు బోనస్ అంశం. సమగ్ర సమీక్షను అందించిన సుశీలమ్మ గారికి అభినందనలు. 💐 *

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కొరికాన ఆనంద్ గారి స్పందన: *’ముంజేతి కంకణం చూడటానికి అద్దం ఎందుకు?’ సుశీలమ్మ గారి సమీక్ష కు కితాబులు అవసరమే లేదు కదా.. సెల్ఫీ రామాయణం లో రచయత ఏమి చెప్పినా.. చెప్పకున్నా.. ఇప్పుడు మళ్లీ సుశీలమ్మ గారి సమీక్షలో తన సునిశిత విమర్శనా దృష్టి బయటపడి.. కొత్త ఎరుకను కలుగ జేస్తోంది ఈ సమీక్ష.. ఈ అవకాశం అంటే సుశీలమ్మ గారి సమీక్ష చదివే అవకాశం మాకు ఇలా కలగజేసిన ‘బ్నిం’ గారికి, సంచిక వారికీ ధన్యవాదాలు. 🙏🙏🙏. సుశీలమ్మ గారికి అభినందనలు.*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బ్నిం గారి స్పందన: *సంచిక లో నా సెల్ఫీ రామాయణ యాత్ర సమగ్రంగా ఉంది, ముఖ్యంగా డాక్టర్ సిహెచ్. సుశీల గారు సమీక్ష చేయటం పుస్తకానికి మంచి ప్రెస్టేజ్ లభించింది. అలాగే సంచిక టీమ్ అడిగిన ప్రశ్నలు.. దానికి నా సమాధానాలు.. కూడా సహజ సజీవంగా సాగాయి.. ఎంతోమంది నాకు ఫోన్ చేశారు.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!