[శ్రీ శంకరప్రసాద్ రచించిన ‘శ్మశానం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
తల్లి గర్భంలో హాయిగా నవ మాసాలు నిదురించి ఊపిరి పోసుకొని భూమాత ఒడిలో వచ్చి పడతారు రాజు పేద పండిత పామరులంతా
తల్లి కడుపులో తల్లడిల్లక హాయిగా ఉన్నవారు నేల మీదకు కాలు మోపి నింగి వైపు చూస్తుంటారు అందలం అందుకుందామని ఆరాటం మొదలు
ప్రేమ కోపం ఈర్ష్య ద్వేషం స్వార్థం వంచనల వలువలు కట్టుకుంటారు విలువలు వదిలేసి కొట్టుకుంటారు జానెడు పొట్ట కోసం యోజనపు యోజనాలు వేసి ఎదురు చూస్తారు
కోట్లు కూడబెట్టి కోటలు కడతారు బంధు మిత్ర సపరివారమంతా చూట్టూ చేరగా ఏదో సాధించామని అంబరమంత సంబరం పొందుతారు
ఆయువు ఒకటి ఉంటుందని అది కాస్తా తరిగిపోతుందని మరచిపోతారు సాటి మనిషికి సాయం చేయటం చేయరు వీరు
కాలుడు వచ్చి కాలం తీరిందని పాశం వేసి తీసుకుపోతాడు ఒంటరిగా వస్తారు ఒంటరిగా పోతారు కోట్లు కోటలు వదిలిపోతారు
అమ్మ గర్భాన రూపుదిద్దుకున్న దేహం కోరికల దాహంతో పెరిగి చివరకు శవమై ప్రకృతి వశమై శ్మశానానికి చేరుకుంటుంది
మరు భూమిలో కనుమరుగయ్యి మరో జన్మకు ఎదురు చూస్తుంటారు ఓ మనిషి నీ జీవితంలో చివరి మజిలీ శ్మశానమే కదా భస్మమే నీ గమ్యం కదా
భావుకుడు, కవి శంకరప్రసాద్. ఇప్పుడిప్పుడే తన కవితలతో, కథలతో సాహిత్య ప్రపంచంలోకి అడుగిడుతున్నాడు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
సిరికోన సాహితీ అకాడమీ డల్లాస్ వారి 2023 నవలల పోటీ విజేతలకు సన్మాన సభ నివేదిక
నా బాల్యం కతలు-3
ధడక్: వో ప్రేమ గీతిక
జ్ఞాపకాల తరంగిణి-3
అద్వైత్ ఇండియా-9
అంబేద్కర్ – ఒక అవలోకనం
శ్రీ రామాంజనేయం
నూతన పదసంచిక-3
పితలాటకం
జ్ఞాపకాల పందిరి-80
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®