[శ్రీరామనవమి సందర్భంగా, ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని శ్రీ సాయిబాబా ఆలయంలో జరిగిన కళ్యాణ మహోత్సవం వివరాలను అందిస్తున్నారు శ్రీమతి భారతి పరసు.]
కనుల పండుగగా శ్రీ సాయిబాబా గుడిలో (Regents Park) శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం, ఆదివారం, 14-ఏప్రియల్-2024 తేదీన నిర్వహించారు.


దాదాపు 6 గంటలపాటు అన్ని వివాహ క్రతువులతో ఈ కార్యక్రమాన్ని ఆరుగురు పురోహితులు వేద మంత్రాలతో జరిపించారు.
20మంది పైగా దంపతులు ఈరోజు సీతారామ కళ్యాణం తమ చేతుల మీదుగా జరిపించి ఒక మధురానుభూతిని సొంతం చేసుకున్నారు. సాయి మందిరం పురోహితులు శివ పండిట్ మరియు సుదర్శన్ పండిట్ ముఖ్యంగా ఈ కల్యాణోత్సవం జరిపించారు.


ఎందరో స్వచ్ఛంద సేవకుల సహాయ సహకారాలతో ఈ వేడుక జరిగింది.


కార్యక్రమ వివరాలు: మంగళ స్నానాలు, అలంకారం, జీలకర్ర బెల్లం నూరటం, తలంబ్రాలు కలపటం, తాళి గుచ్చటం, రాముల వారిని ఊరేగింపుగా మేళతాళాలతో దైవదర్శనం & మండపానికి తీసుకువెళ్లటం, గణేశపూజ, నవగ్రహ పూజ, వరపూజ, సీతాదేవిని ఊరేగింపుగా మేళతాళాలతో, నాట్య గానాలతో దైవదర్శనం & మండపానికి తీసుకువెళ్లటం, గౌరీపూజ, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు, సప్తపది, హోమం, వరమాల, మంగళహారతి, దర్శనం, తీర్థప్రసాదాలు, విందు భోజనం, వచ్చిన ఆహూతులకు పండ్లు అక్షింతలు ఇవ్వటం.


లక్ష్మీ, రవి దంతుర్తి దంపతులు పెళ్లి కుమార్తె సీతాదేవి తరపున, భారతి, కిషోర్ పరసు దంపతులు పెళ్లి కుమారుడు రాముని తరపున, వారి కుంటుంబసభ్యులు & బంధుమిత్రులతో ఈ వేడుకలో తమ ఇంట పెండ్లిలోలాగా అన్ని కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు.


రమ, రవి దంపతులు & ఉమ, రావు అబ్బినేని దంపతులు పెండ్లిపెద్దలుగా, చేదోడువాడుగా, అండదండగా వుండి ఈ వివాహ వేడుక దిగ్విజయంగా నడిపించారు. సుమారు 300 పైగా భక్తులు ఈ వేడుకకు హాజరు అయ్యారు.


చివరగా వచ్చిన వారికి పండ్లు, వివాహ అక్షింతలతో పాటుగా, బహు ప్రసాదాలతో పసందైన విందు భోజనం పెట్టటం జరిగింది. లడ్డు, బూరె, గారే, పులిహోర, పానకం, వడపప్పు, చలిమిడి, రవ్వలడ్డు, బర్ఫీ, పాయసం, అప్పాలు, మరెన్నో రుచికరమైన పదార్ధాలతో విందు భోజనం భక్తులు ఆరగించారు.

Bharati Parasu: Hailed from Andhra Pradesh and working in Department of Health, NSW, Australia. Married to Kishore Parasu, mother of two wonderful children. Has passion for music and sings with Sydney Annamayya Brundam. Hobbies include home gardening, growing organic vegetables, reading Telugu literature, nature walks, exploring cultures and places, and socialising with family & friends.