చినపూడి నిజాంపట్నం మండలంలోని చిన్న గ్రామం. గ్రామానికి తగ్గట్లే అక్కడి ఆలయం కూడా చిన్నదే. ఆలయం చిన్నదైనా, దీనికున్న విశేషాలు గొప్పవి. క్రీ.శ. 1635లో శ్రీ పులిగడ్డ వీర్రాజు జమీందారుగారిచే నిర్... Read more
"గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 20" వ్యాసంలో బొర్రావారి పాలెం లోని అంకమ్మ తల్లి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. Read more
"గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 19" వ్యాసంలో అడవుల దీవి లోని శ్రీ భ్రమరీ బాలత్రిపురసుందరీ సహిత మల్లికార్జునస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. Read more
రూ వాడా లేని ఒక ప్రదేశంలో కారు ఆగింది. ఏమైందా అనుకుంటూ దిగాము. అదే మోర్తోట శ్రీ ముక్తేశ్వరాలయం. ఇంత చిన్న ఆలయానికి కూడా ఇంత దూరంనుంచి రావాలా.. టైము వేస్టు చేస్తున్నామా అని మనసులో ఒక చిన్న పె... Read more
తర్వాత మజిలీ ప్రస్తుతం పెదపులివర్రు అని పిలువబడుతున్న వ్యాఘ్రపురి. దోవలో ఫణిగారు ఈ ఆలయం విశేషాలు కొన్ని చెప్పారు. ప్రముఖ సినీ దర్శకులు శ్రీ కె. విశ్వనాధ్ గారిది ఈ ఊరే. ఈ ఆలయ స్ధాపకులు వారి వ... Read more
"గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 16" వ్యాసంలో వెల్లటూరు లోని గణపతి పంచాయతన ఆలయం, శ్రీ అగస్తేశ్వరస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. Read more


ఇక్కడ వెలసిన ముఖ్య మూర్తి సోమశేఖరస్వామి. ఈయన స్వయంభూ. అమ్మవారు సత్యజ్ఞాన ప్రసూన. ఈ చల్లని తల్లి కూడా భక్తులకు నేనున్నాననే అభయమిస్తున్నట్లు వుంటుంది. ఈ స్వామి గురించి, ఈ ఆలయ నిర్మాణం గురించి తెలుసుకున్నదేమిటంటే…
పూర్వం రాజా జగ్గన్నాథరావు మాణిక్యాలరావు రాచూరు జమీందారు. ఆయన క్రీ.శ. 1770లో ఒకసారి విహార యాత్రకు వెళ్ళి కోటిపల్లి మీదుగా తిరిగి వస్తుండగా “నన్ను చూడకుండానే వెళ్ళుచున్నావా” అనే మాటలు వినిపించాయట. ఆ జమీందారు అక్కడ దిగి ఆ ప్రదేశమంతా చూడగా ఒక పుట్ట, దాని మీద కొన్ని పువ్వులు కనిపించాయిట. ఆయన తన నగరానికి వెళ్ళి, తన మంత్రి, పురోహితులతో ఈ విషయం వివరించగా వారు ఆ పుట్టలో శివలింగం వున్నట్లు తెలిపారు. వెంటనే అందరూ అక్కడికి వచ్చి పరిశీలించి, శాస్త్ర ప్రకారం పుట్టలోంచి శివలింగాన్ని వెలికి తీయించారు. ఒక శుభ ముహూర్తంలో ఆలయ నిర్మాణం ప్రారంభించి ఆగమ శాస్త్రరీత్యా గర్భాలయం, ముఖమంటపం మొదలైన వాటితో నిర్మాణం పూర్తిచేసి స్వామిని ప్రతిష్ఠించి పూజలు, ఉత్సవాలు నిర్వహించసాగారు. పావన కృష్ణానదిలో స్నానం చేసి ఈ దేవుని సందర్శిస్తే సర్వపాపాలు నశిస్తాయని ఇక్కడి భక్తుల నమ్మకం.








పక్కన వేరే మంటపంలో నవ గ్రహాలు కొలువుతీరి వున్నాయి. యజ్ఞాలు నిర్వహించటానికి యజ్ఞశాల కూడా వున్నది. ఈ ఆలయానికి చాలాకాలం రాచూరు జమీందారీ వంశీకులు ధర్మకర్తలుగా వ్యవహరించారు. తరువాత ఈ ఆలయ నిర్వహణ దేవాదాయ ధర్మాదాయశాఖ చేపట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించింది.
ఉత్సవాలు
నిత్య పూజలతోబాటు ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి, దేవీ నవరాత్రులు, కార్తీక మాసం, ముక్కోటి ఏకాదశి, సంవత్సరాది పండుగలలో విశేష పూజలు జరుగుతాయి.
కృష్ణానదీ తీరాన వున్న ఈ ఆలయం తెనాలి – రేవల్లె రోడ్డు మార్గంలో వున్నది. సమీప రైల్వే స్టేషన్ భట్టిప్రోలు.
ఉదయం 9-35కి కోటిపల్లినుంచి బయల్దేరి వెల్లటూరు చేరుకున్నాము. మరి ఆ విశేషాల కోసం వచ్చే వారం దాకా ఆగాలి.

శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.
"భక్తి పర్యటన గుంటూరు జిల్లా– 14" వ్యాసంలో భట్టిప్రోలులోని బౌద్ధస్తూపం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. Read more
"గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 13" వ్యాసంలో వజ్రాలయ్య కేతవరంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. Read more
"గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 12" వ్యాసంలో మంగళగిరి లోని నరసింహస్వామి ఆలయాల గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. Read more
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *
Keep moving the story..*