సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    krishna Rao velmula

    అయ్యా దండాలు, మేలు పొద్దులు. ౧) కొంచెగాడు = సామాన్యుడు అనే ఆర్తలో వాడారు. కానీ, దానికి ప్రస్తుతం వాడుకలో వున్న అర్థం వేరు. మీరు వాడింది సరైనదేనా? కానీ, అర్థ సంకోచమయిందా? ఏదైనా, అది వాడకపోవడమే సరైనడాని నా అభిప్రాయం. ౨) మన తెలుగు పదాలను ఒకచోట ఆకారాదిగా పెట్టండి. వాటి పక్కనే, ప్రస్తుత వ్యవహారంలోని పదాలను పెట్టండి. వాటిని వెబ్సైట్ లో పెడితే, అందరికీ ప్రయోగించడానికి అనువుగా వుంటుంది. అలాగని మన నిఘంటువులలో ఉన్నట్లు, కృతక పదాలను సృష్టించడం కాదు. పల్లెల్లో మాటాడేవి అవి గ్రామ్యమని పక్కన పెట్టనక్కరలేదు. వ్యావహారిక భాషకే పట్టం కట్టాలి. లేకుంటే, పండితుల దారి పండితులదీ, సామాన్య జనాల దారి నామాన్యులదీ అవుతాయి. మీరు అలాంటి పదాలను సేకరించి (కూర్చి) పెడితే, నేను వాటిని ఆకారాదిగా ఒక వెబ్సైట్ ద్వారా నిర్వహించగలను. ౩అ) గత నిఘంటువులలో (శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు) దొరలిన కొన్ని తప్పులను గిడుగు గారు ఎత్తి చూపారు.౩ఆ) బహుజనవల్లిగారిపైన గల నమ్మకంతో, లసికిరి అనే పదవిషయంగా జరిగిన ఒక తప్పుడు అర్థ నిర్ణయం తదుపరి ఎన్ని నిఘంటువులకెక్కయిందో సోదాహరణంగా ఆచార్య తూమాటి దొణప్ప గారు ఎత్తిచూపారు. ౩ఇ) బంతి అనేది చెట్టుగా నేను గమనించాను. పట్నాలలో (నిజానికి సముద్ర తీరాలో ఉండే జనావాసాలు మాత్రమే పట్నాలు) ఉండే పిల్లలు ఎంత మందికి బంతి అనేది మొక్క అనీ, అది చెట్టు కాదనే విషయం గుర్తించగలరు? నిఘంటులే ఇలా చెప్పితే. ఇక సామాన్య వాడి పిల్లలకు ఎలా చెప్పగళం, ఎలా వారు అర్థం చేసుకొంటారు. సామాన్య ప్రజలకున్నపాటి వ్యవహార జ్ఞానంకూడా మన పండితులకు ఉండకపోతే ఎలా? ఇలాంటివన్నీ మనం సరిచేయాలి. కరీంనగర్ ౧౪-౦౯-౨౬

    Reply
  2. 2

    Saradhi Motamarri

    మంచి మంచి అంశాలు తెలియచేసారు.
    పైశాచి మాట ఎత్తారు, మరి ఆనాడు గుణాఢ్యుడు కూడా నిరాదరణకు లోనయ్యాడు. ఒక సంబంధంలేని ప్రశ్న, బృహత్కథ లాంటి అద్భుత రచనను అందించిన ఈ బాస ఏయమయ్యింది. అది ఒకప్పటి తెలుగు రూపమా?
    శివ కవిత్రయం అచ్చ తెలుగుకు పెద్ద పీట వేశారు అంటారు.
    నేను కొందరని అడిగాను, వాటిపై సంభాషించమని ..
    కానీ, ఎవరూ వారి కావ్యాల గురించి మాటలాడరు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®