సంచికలో తాజాగా

Related Articles

12 Comments

  1. 1

    జి.వి. కళ్యాణ శ్రీనివాస్

    వెంటనే చదివాను 👌 postpone చేయకుండా చదవాలనిపించింది Nice message to all daughters. Dasari Narayana Rao earlier movies లో, I think స్వర్గం నరకం movie l లో అయన కూడా ఒక పాత్రలో నటించి ప్రేక్షక లోకాన్ని మెప్పించారు ఆ.. dialogues
    దాసరి: “భర్తను గుప్పెట్లో కాదు, గుండెల్లో పెట్టుకోవాలమ్మా”అనే సంభాషణలు ఆ రోజుల్లో నాకు మంచి గా అనిపించాయి. అలాగే.. K. Balachander gari Tamil movie Dubbed in telugu మన్మధలీల లో ..When daughter complains about Husband Kamal haasan ఇలానే డైలాగ్స్ ఉంటాఇ..
    వీలైతే మన్మధలీల
    స్వర్గం నరకకం పాత మూవీస్ చూడండి
    It’s a good కథాంసం . విడిపోని పరిమళం..
    Plot, The way you have written is very nice.. నిజంగా సంపంగి పరిమళమే
    _ డైరెక్టర్ గీతా కృష్ణ గారి కామెంట్

    Reply
  2. 2

    జి.వి. కళ్యాణ శ్రీనివాస్

    _ కుమారి, విజయవాడ
    చాలా బాగుంది కళ్యాణ్ కథ
    ఈ రోజుల్లో పిల్లలకి అటువంటి మానసిక పరివర్తన ఉండటం లేదు, అలా వివరించి చెప్పే వాళ్ళని వాళ్ళు వద్దనుకుంటున్నారు కదా!, చాలా బాగుంది కళ్యాణ్ వివరించిన తీరు అంతా బాగుంది నిజం పెద్ద వాళ్ళ వలన పిల్లలకి వస్తే కుటుంబాలు చాలా వరకు నిలుస్తుంది ఈగోలు తగ్గుతాయి భర్త ప్రేమ అభిమానాలన్నీ గుర్తిస్తారు ఇప్పుడు పిల్లలకు బాగా అవసరం👌👌👏👏

    Reply
  3. 3

    జి.వి. కళ్యాణ శ్రీనివాస్

    ._కృష్ణ కుమార్, బెంగుళూరు
    చాలా మంచి కథ, “మగవాడు మాటల్లో కాదు తల్లీ , బాధ్యతల్లో మాట్లాడతాడు” అనే ఈ ఒక్క మాట చాలా అద్భుతంగా చెప్పారు. నాకు బాగా నచ్చిన మరొక డైలాగు “భయం అనేది బలహీనత కాదు తల్లీ, అది ప్రేమకు ఇచ్చిన విలువ”.

    ఈ కథలో రచయిత శ్రీ కళ్యాణ్ గారు మంచి కథా విలువల ప్రయోగం చేసి విజయం సాధించారు. ఆయన మంచి భవిష్యత్ ఉన్న కథా రచయిత. శుభాశీస్సులు.

    _కృష్ణ కుమార్, బెంగుళూరు

    Reply
  4. 4

    జి.వి. కళ్యాణ శ్రీనివాస్

    .
    కళ్యాణ్ గారు!!
    కథ పేరు వినగానే ఎన్నో ఏళ్ల క్రితం విన్నటుంది
    కానీ కథ చదివిన తరువాత కథ పరిమళాన్ని కుటుంబ బంధాన్ని మరింత బలంగా విరబోసింది!

    ప్రస్తుత సమాజంలో మనుషుల్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని నా భావన…

    మీరు ఇలాంటి కథలు మరిన్ని రాయాలి అని, మీ ఆలోచన మరింత మార్పుకు మీ కథల రూపం లో మీరు తీసుకు రావాలి!!
    ఇట్లు
    మీ శ్రేయోభిలాషి మరియు మిత్రుడు
    చింతపల్లి శ్రీహరి రావు

    Reply
  5. 5

    జి.వి. కళ్యాణ శ్రీనివాస్

    వీడిపోని పరిమళం కథ చదివాను..
    నిజానికి ఇది కథ కాదు..ఎన్నో కలలతో దాంపత్య జీవితంలో అడుగుపెట్టే ఆడపిల్లలు..బ్రతుకు పంచుకున్న భర్తలతో సజావుగా ముందుకు సాగటానికి అనుసరించాల్సిన సూత్రాలను సున్నితంగా ఆచరణ యోగ్యంగా తెలియచెప్పిన సంక్షిప్త నిఘంటువు అంటే అతిశయోక్తి కాదు..సుగుణమ్మ లాంటి బామ్మ పాత్రలు అందరమ్మాయిల జీవితాల్లో ఉంటే చాలా దాంపత్యాలు అపార్థాల మూలంగా అపశృతుల మయమయ్యే అవసరం ఉండేది కాదేమో.. కథ చెప్పిన విధానం మంచి రచయిత అనిపించుకునే కొద్దిపాటి రచయితల్లో కళ్యాణ్ శ్రీనివాస్ కూడా ఒకడు అనిపించుకునేటంత హృద్యంగా ఉంది..సుగుణమ్మ పాత్ర అనుభవ స్రవంతి నుంచి కొన్ని దోసిళ్ళ నీటిని తాగి జీర్ణించుకుంటే ప్రతి ఆడపిల్ల దాంపత్యం పచ్చగా వుంటుందనడం సమంజసం కూడా..”భయం అంటే బలహీనత కాదు అది ప్రేమకిచ్చే విలువ” లాంటి పదాల చెణుకుల్ని అలవోకగా సుగుణమ్మ పాత్రద్వారా ఉపయోగించిన రచయిత తన దాంపత్య జీవితం నుంచి తెలుసుకున్న పరిమళాల గుళికలు అయ్యుంటాయని భావిస్తూ..రచయిత కల్యాణ్ మరిన్ని మంచి కథలతో ముందుకు దూసుకు పోవాలని మనః పూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను..

    _ కొమ్మనాపల్లి గణపతిరావు గారు, (సినీ, టివి, రచయిత)

    Reply
  6. 6

    జి.వి. కళ్యాణ శ్రీనివాస్

    .
    కథ బాగుంది, కాస్త పాతబడ్డ పుస్తకంలోని కథలా ఉంది, నేటి కథలకు భిన్నంగా ఉంది 👍🏼 _ ఉదయ భాస్కర్ గారు ( మూవీ డైరెక్టర్)

    Reply
  7. 7

    జి.వి. కళ్యాణ శ్రీనివాస్

    ఒక నిత్య నూతనము అలాగే సమకాలీనమైన, సున్నితమైన సమస్యను తీసుకుని దానికి చక్కటి భావుకతని జోడించి, సొగసైన భాషతో కధని నడిపించారు. ఈ సమస్య ప్రతి కుటుంబంలో ఎప్పుడో ఒకప్పుడు పొడచూపేదే, సరియైన పరిష్కారం లేక, చెప్పేవారు లేక మనస్పర్ధలతో విచ్ఛిన్నమైపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇగో ప్రాబ్లంని సహనం సంయమనంతో ఎలా ఎదుర్కోవాలో ఈక్వాలిటీ అంటే ఏమిటో నాయనమ్మ పాత్ర ద్వారా చక్కగా చెప్పించారు. కొత్తగా పెళ్లయిన దంపతులు, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఈ కథని చదివితే తప్పకుండా ఉపయోగపడుతుంది. మీ కలం నుంచి మరిన్ని పూర్తిమంతమైన కథలు వెలువడాలని కోరుకుంటున్నా.
    — తనికెళ్ళ శ్రీనివాస్

    Reply
  8. 8

    జి.వి. కళ్యాణ శ్రీనివాస్

    మనసును తాకిన కథ
    _ ఫణికర్ రెడ్డి, యు కే

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సీతగారి వ్యాఖ్య:* నేను విడిపోని పరిమళం ఇపుడే చదివాను. చిన్న చిన్న విషయాలకే నూతన దంపతుల మధ్య మనస్పర్ధలు అపార్ధాలు, దానిని తల మెరిసిన పెద్దతరం ఏ విధంగా రాబట్టాలో మాట్లాడిన తీరు చిన్నవాళ్ళ ఈగోలు తనకు తాను రియలైజ్ అవ్వడం ఏమి చెప్పకుండానే ఉదయ్ అర్థం చేసుకోవడం బావుందండి కధ. Good story. మా అబ్బాయికి కొత్తగా పెళ్లయింది కదండీ మా కోడలి కూడా పంపించాను మీ కథ. Just. నేను చదివిన తర్వాత. Nice. కంగ్రాట్స్ కళ్యాణ గారు.. సీత, తిరువూరు.*

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి బిందు మాధవి గారి వ్యాఖ్య: *చాలా బాగా రాశారు.
    మీ రచనలో పరిణతి బాగా తెలుస్తున్నది. సాహిత్యం పట్ల మీ నిబద్ధత, మంచి కథ రాయాలనే మీ తపన, కుటుంబ బంధాల పట్ల మీ అవగాహన, అందులో పరిమళం.. ఈ కథలో చాలా బాగా ప్రతిఫలించాయి. మీ ప్రయాణం ఇలాగే కొనసాగించండి. – శ్రీమతి బిందు మాధవి*

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నాగ పూర్ణ గారి వ్యాఖ్య: *మీరు వ్రాసిన వీడిపోని పరిమళం కథ ఇప్పుడే చదివాను.. కథ బావుంది.. మీరు వ్రాసిన విధానం చాలా బావుంది.. ఇంకా ఇలాగే మంచి కథలు వ్రాస్తూ ఉండండి. నాగ పూర్ణ, తిరువూరు.*

    Reply
  12. 12

    డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

    వీడిపోని పరిమళం ..ఎంత బాగుంది పేరు !..ఇతివృత్తం , డైలాగ్స్ , పాత్రచిత్రణ అన్నీ జీవనసారభాన్ని గుబాళింపచేశాయి .అలతి అలతి మాటలతో కథను మలయమారుతంలా మా మనసులను తాకేలాచేసారు .ఒక్కో డైలాగ్ ఒక్కో ఆణిముత్యం..! ఎప్పుడూ మనసులో నిలిచిపోయేవి . ఈ కాలానికి అవసరమైన కథ . చిన్నచిన్న కారణాలకే డైవర్స్ తీసుకుంటున్న ఈ కాలం జంటలకు దాంపత్యం అంటే ఆషామాషీ వ్యవహారంకాదని మంచి మెసేజీ ఇచ్చారు .యువత చదవాల్సిన కథ …ఇంకా ఇలాంటివి రాయండి ..చదవగానే ఎంతబాగుంది రచన అనుకున్నాను 👌..అభినందనలు ..ధన్యవాదాలు …💐🙏

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®