అమ్మా! ఈ సెలయేటి సౌందర్యమైన తీరు ఇది ఏనాటిది? తట్టుకొనలేక పోతిని కదే! ఎటనుండి నీవు వచ్చి నన్నల్లుకుంటివే! వేయి కాంతుల దీపమై!
అమ్మా! అభాగ్యులకెల్ల భాగ్యములందజేసి సౌభాగ్యమనెడి చిటికెడు వూదినే రాల్చిన ఇలవేలుపువు నీవు! పూలచెండును బోలిన నీ పదములు మోయు తుమ్మెదను నేను..
అమ్మా! నీ అడుగుల ననుసరించి నడుచుచునే యుందును.. ఆయువంతా! ఏమి చెప్పుదు ఆనందం నీ దారిలోన? అనుభవించిన నుండి నాకేమి తోచదాయె!
అమ్మా! నీ పూజ చేయని దినము నాకు ఆకలుండదు, వేసిననేని దాహము తీరదు ప్రాణమొక్కింత! వెలుగంటి శ్వాసవు నీవే! హృదయము నలరించు నా జ్యోతివి నీవే!
అమ్మా! గుడులు తెలియవు, నదులు తెలియవు అటునిటు చూసే సరియైన నడవులు తిప్పే కడకు దివ్యమందిరమైన నీ వొడికి చేరిన నాదు అలసట తీరెను కదా! దిష్టి దీసె!
ఎన్నినాళ్ళకు అమ్మా! ఎన్ని నాళ్ళకు తల్లీ! నన్ను కరుణించినావు.. కాపాడినావు! ఎర్ర కాంతివి నీవు! భువికి పాపిడి నీవు! శిలల బతుకు కనుల ఉనికి చూపినావు!
నా చేతలు, జపతపములు, నాదు పంచ ప్రాణములు, నా బతుకిది నీ కోసమే కదే అమ్మా! నిన్నానుకుంటిని.. స్థిరముగాను: ఊపిరంతా శ్రీ చక్రపు నాభి తాకినట్లు!
అమ్మా! నిన్ను మించిన దేవత కల దటే భువనమందు? ఉండెనేని అతండు నీ నామమే నిత్యం స్మరించు చుండు ఎంత మధురమె కదా నీ దివ్య కీర్తనం
అమ్మా! గుండెను కొబ్బరిగ చేసి నీపై భక్తి ప్రేమామృతంబు నింపినాను తప్పులెన్నక నన్ను తల్లివై దీవించినావు బిడ్డవై రావమ్మ మా ఇంట నిలువుమమ్మ!
అమ్మా! నీ అనుగ్రహము వలననే కదా నేలపై ఇట్లు పుట్టినాను! నీ యెద మోపి నంత కరుణ జాలువారే నీ పాదాల ఎట్లు కుదిరె తల్లీ! ఈ బంధ మిరువురికీ..!
సన్నిహితులు లేని నీ కూతురుని నేను పలుకు లేదు.. ఒక్కింత తలపునకు నోచు కోని నన్ను జాలితో అమ్మా! నన్నూరడింప మమతల తల్లివై ఇంటికి నడచి రావో..!
అమ్మా! నీదు ముఖము గానక దినమే కా దె నాకు, క్షణమైన గడపలేని చిత్రమైన స్థితిని చేరుకుంటి: నిటు వంటి దీనురాలిని రక్షింప దిక్కు నీవే!
అమ్మా! ఏల నను వీడి దిక్కు చెడగ దూరమవుతూ ఏడిపింతువు నీవు.. దివి నుండి భువికి వచ్చేది ఎన్నడో దెలుప తొలగును నా యెదలోన వ్యధ..
ఎన్ని మొక్కులు మొక్కిన.. ఎన్ని పూజలు చేసిన నగవు లేక నిట్ల బతుకజాల.. అమ్మా! దినము గడుపలేని దీను నోదార్ప రావమ్మ! నీ ఎడబాటు నేనింక ఈడ్వలేను..
వెలుగు లేని దీపమునైతి! విలువ లేని కోవెలనైతి! తడి లేని గుండెల మధ్య సమిధనైతి! కానీ అమ్మా! నీవు ఉంటే చాలును కదా! కన్న తల్లివి వలెనే.
ఒకనాడు కష్టము, ఒకనాడు సుఖము ఎపుడెయ్యది వచ్చునో ఎరుగలేక నాకు భయము కలుగుచుండె., అమ్మా! మొక్కలు పెరుగునా? నడివేసవి వేళ..
All rights reserved - Sanchika™