సంచికలో తాజాగా

డా. నెల్లుట్ల నవీన చంద్ర Articles 2

వరంగలులో 1941 లో జననం. 1964 లో కెనడా కు ఆల్బర్టా విశ్వవిద్యాలయ స్కాలర్షిప్ మీద వచ్చి భౌతిక శాస్త్రంలో డాక్టరేటు డిగ్రీ పొందారు. ఆల్బర్టా రాష్ట్రములోని లోని ఎడ్మంటనులో తెలుగు సాహిత్య కలాపాలలో పాల్గొన్నారు. బ్రజిల్నుండి కెనడాకు తిరిగివచ్చి టొరాంటొ నగరంలో తెలుగు వాహిని 2006 లో స్థాపించారు. 2009 లో కెనడాలో మొట్టమొదటి తెలుగు కథా సంకలనం ప్రచురించారు. 2014 లో రెండవ తెలుగు కథల సంకలనం ప్రచురించారు. ఇంగ్లీషులో చిన్నపిల్లల సైన్సు పుస్తకాల ప్రచురణ. రామాయణ,మహాభారత, భాగవత పారాయణ సమూహాలు స్థాపించి సంప్రదాయ అభివృద్ధికి దారులు వేసారు. 48 మాసాలు ధారావాహికంగా "తెలుగు తల్లి" లో వెలుగు చూచిన వ్యాసాలు "మహాభారతం లో పురుష పాత్రలు" గా పుస్తక రూపం (2021). బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి అభిమానానికి పాత్రమయినది ఈ పుస్తకం. అనేక ప్రసంగాలు చేసారు.కథలూ, కవితలూ రాసారు. 2021 లో కథా వేదికను,2022 లో కవితావేదికను, నాసాహితీ యాత్ర వేదికను స్థాపించి ప్రతినెలా సమావేశాలు జూం మాధ్యమంలో నిర్వహించారు. 2021 లో 4, 2022 లో 36, 2023 లో 36, 2024 లో 14 వీడియోలు(90) యూ-ట్యూబుకు అప్లోడు చేశారు. 300 పైగా కవితలు, 250 పైగా కథలూ అనేక ప్రముఖ సాహితీ పరుల చేత రాయబడి చదవబడ్డాయి. కథల, కవితల పోటీలు నిర్వహించి కథా సంకలనాలు, కవితా సంకలనాలు ప్రచురించారు. 2024 లో రెండవ జత పోటీలు నిర్వహిస్తున్నారు. తెలుగు భాష అంటె ప్రాణాలకన్న ప్రీతి. కవిత్రయ విరచిత మహాభారతమూ, పోతన విరచిత శ్రీ మదాంధ్ర మహాభాగవాతమూ, వాల్మీకి విరచిత సంస్కృత రామాయణమూ రోజూ చదువుతారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!