సంచికలో తాజాగా

డా. తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి Articles 1

డా. తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి రచయిత్రి, సామాజికవేత్త. పుట్టింది.. పెరిగింది.. ఉమ్మడి పాలమూరు జిల్లా, ప్రస్తుతం వనపర్తి జిల్లా ఆత్మకూరు. వనపర్తిలో డిగ్రీ పూర్తి చేసి తర్వాత హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. తెలుగు చదివారు. అక్కడే ఆచార్య ఎస్వీ సత్యనారాయణ (తెలుగు విశ్వ విద్యాలయం మాజీ ఉపకులపతి - అరసం కార్యవర్గ సభ్యులు) గారి పర్యవేక్షణలో ‘తెలుగు వారపత్రికలు సాహిత్య వికాసం’ అంశం మీద పిహెచ్.డి చేసి 2008 లో డాక్టరేట్ పొందారు. ఇప్పటి వరకు 11 నవలలు, 104 కథలు, వివిధ అంశాలపై కవితలు, పాటలు, రాజకీయ సామజిక అంశాలపై 1000 వరకు వ్యాసాలు రాశారు. నవలలు స్వాతి, చతుర వంటి మాస పత్రికలలో ప్రచురించబడినవి. కథలు వివిధ దిన, వార పత్రికలలో, ఆన్‍లైన్ మ్యాగజైన్లలో ప్రచురించబడినవి. తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిష్ఠాత్మక ‘కీర్తి పురస్కారం’ 2015 నవలా విభాగంలో పొందారు. తెలంగాణ రెడ్డి సేవా సమితి నుండి ‘నారీశక్తి -2020’ అవార్డు, 2023 లో తెలంగాణ సరస్వత పరిషత్తు నుండి ‘ధర్మనిధి పురస్కారం పాకాల యశోద రెడ్డి అవార్డు’, 2024 లో శ్రీశ్రీ కళావేదిక వారి Women of Excellence Award, 2025లో కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ వారి ‘విశిష్ట మహిళా పురస్కార్’ అవార్డు, HMtv ~ Hans India మరియు Global Angels Jai Charitable Trust సంయుక్తంగా ప్రకటించిన ‘మాతృశక్తి’ పురస్కారం, శ్రీ సిద్ధ లింగేశ్వర పశ్చిమాద్రి సంస్థాన విరక్తమఠం వారి సాహితీ పురస్కారం పొందారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!