సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి వి రమణా రావు గారి స్పందన: *మురళి రాసింది కథ కాదు.. జరిగిన వాస్తవం. సబ్ ఎడిటర్ ___ జీవిత గాథ. నేను ప్రత్యక్ష సాక్షిని. చాలా మంది ఉద్యోగం చేస్తూ చనిపోయారు. – పి వి రమణా రావు*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మురళి గారి వ్యాఖ్య: *మురళీ గారూ.. చాలా చక్కగా రాశారు.. ఈ మీ కథ కొంతమంది శాడిస్టుల మనసైనా మారుస్తుందని ఆశిస్తూ.. – మురళి, అనంతపురం.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జి.వి. రమణారెడ్డి గారి స్పందన: *ఈ కథ చదివిన తర్వాత.. మరో కథ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాం.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చంద్రమౌళి గారి స్పందన: *సీనియర్ జర్నలిస్టు బుద్దా మురళి సార్ రాసిన ‘ఖాళీ కుర్చీ’ కథ ఒక వ్యక్తి విషాదగాథ మాత్రమే కాదు, మనిషి విలువను మరచిపోతున్న ఆధునిక వ్యవస్థలపై మౌన నిరసన. జ్వరంతో వణుకుతున్నా ఉద్యోగ భయంతో ఆఫీసుకు వెళ్లిన గిరిధర్ మరణిస్తాడు. కానీ అతని మరణం కంటే, పది నిమిషాల్లోనే అతని కుర్చీని మరొకరితో భర్తీ చేయడం మరింత భయంకరమైన సత్యాన్ని బయటపెడుతుంది.
    కార్యాలయాలకు మనం ఒక ఉద్యోగి మాత్రమే. మన స్థానాన్ని ఎప్పుడైనా ఇంకొకరితో భర్తీ చేయవచ్చు. కానీ ఇంటికి మనమే ప్రపంచం. భార్యకు భర్తగా, పిల్లలకు తండ్రిగా, తల్లిదండ్రులకు కొడుకుగా మన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. వ్యవస్థలకు ఖాళీ కుర్చీలు కనిపిస్తాయి, కుటుంబాలకు ఖాళీ అయిన మనుషులు కనిపిస్తారు.
    అందుకే ‘ఖాళీ కుర్చీ’ కథ ఒక హెచ్చరిక. ఉద్యోగం కోసం జీవితాన్ని తాకట్టు పెట్టొద్దని, ఎందుకంటే కార్యాలయాల్లో ఖాళీ కుర్చీలు వెంటనే నిండిపోతాయి. కానీ ఇంట్లో ఖాళీ అయిన మనిషి జ్ఞాపకం మాత్రం జీవితాంతం ఖాళీగానే మిగిలిపోతుంది.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కె.ఎస్.ఆర్. గారి వ్యాఖ్య: *జర్నలిస్టుల దీన స్థితిని చక్కగా వివరించారు మురళి గారు 💯✅- ksr*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీరామ్ సుకుమార్ గారి స్పందన: *’ఖాళీ కుర్చీ’ కథ అద్భుతంగా ఉంది సార్.. డెస్క్ కు వచ్చిన కొత్తలో డ్యూటీ టెన్షన్‌లో నేను బాత్రూంలో అపస్మారక స్థితిలో పడిపోయినపుడు మీరే ప్రత్యక్ష సాక్షి ..ఐతే ఆ తర్వాత ఆ బలహీనతను అదుపుచేసుకుని ఎంత ఒత్తిడినైనా తట్టుకోగలిగాను. అలా మీ కథ చదువుతున్నంతసేపూ జరిగిన విషయాలు జ్ఞప్తికి వస్తున్నాయి సార్. – శ్రీరామ్ సుకుమార్.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మంగు రాజ్ గోపాల్ గారి స్పందన: *గుండెలు పిండే కథ.. గుండెలు మండే వ్యధ..*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వెల్జాల చంద్రశేఖర్ గారి వ్యాఖ్య : బాగుంది మురళి.. ఇది చదివితే మన ఆంధ్రభూమి లో ___ సబ్ ఎడిటర్ గుర్తుకు వచ్చారు. బహుశా పేరును గిరిధర్ గా మార్చినట్టు ఉన్నారు.*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లక్ష్మీ రాయసం గారి స్పందన: *మురళి గారు జీవన సత్యాన్ని చాలా బాగా చెప్పారు.*

Leave a Reply

All rights reserved - Sanchika®