బంగరు బాలలం
బడి ఈడు పిల్లలం
చదువులమ్మ ఒడిలోన
వెలుగు పూల దివ్వెలం
మొక్కలెన్నో పెంచుతాం
పచ్చదనం పంచుతాం
మేఘాలను కరిగించి
వానలెన్నో కురిపిస్తాం
చెరువులెన్నో నిర్మించి
కరువులన్నీ తరిమేస్తాం
నదులన్నీ నింపేస్తాం
పంటలెన్నో పండిస్తాం
పరిశుభ్రత పాటిస్తాం
రోగాలను తరిమేస్తాం
అక్షరాలు దిద్దుకుని
అభివృద్దిని సాధిస్తాం
పాఠాలను నేర్చుకుని
ప్రగతి బాట పయనిస్తాం.
అనంతపురం జిల్లా పుట్టపర్తికి చెందిన రజిత కొండసాని మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగిని. కొండసాని నారాయణరెడ్డి సాహితీ పురస్కారం వ్యవస్థాపకురాలు. “ఒక కల రెండు కళ్ళు” అనే కవితాసంపుటి వెలువరించారు. వాట్సప్, ఫేస్బుక్ లలో గ్రూపు ఆద్వర్యంలో కవితా పోటీలు నిర్వహిస్తుంటారు. విరజాజులు గ్రూప్ అడ్మిన్.