ఆటవెలది: చదువు బాల్యమందు చక్కనయినతోడు చదువు లందు భయము నదరు కాదు బెదరు పాటు పెంచి భీతిని కలిగించి చదువు నేర్పఁ బూన సరియు కాదు.
ప్రతిభ రుచియు నెందు పరిఢవిల్ల గలదొ బాలలదియె చదువ పాడి యగును స్పర్ధ తోడ మరియు పంతమ్ము తోడను బాలలను తరుముట పాడి గాదు.
సంఘమందు నెల్ల జనులకు వలసిన చక్కనైన దైన చదువు చాలు చదువు లందు నొకటి కొదువగ తలచుచు నొకటి మేటి యనుట నొప్పుకాదు.
ఒప్పుగలుగు గుణములొద్దిక తోడను మనుట నేర్పవలయు మనుజులకును ఒకరి కొఱకు నెల్లరొకరు నెల్లరకును మనిన శుభముఁ గలుగు మహిని సతము.
చదువు కన్న గొప్ప సాత్విక వర్తన నొరులకెపుడు హాని నొసగకున్న చదువు కన్న గొప్ప శ్రమియించు జీవన మనుటయందు గలదె యతిశయమ్ము?
బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి విమర్శకులు, అనువాదకురాలు. అత్యంత లోతైన రీతిలో విమర్శలు చేయగల అరుదైన విమర్శకులు.
Bagundi. Ataveladi teliyadam kosam aksharalu kinda pettina gitalu bagunnayu
@MK Kumar సంతోషమండి.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™