సుఖార్థీ చ త్యజేత్ విద్యాం విద్యార్థీ చ త్యజేత్ సుఖమ్ । న విద్యా సుఖయోః సంధిస్ తేజస్ తిమిరయో రివ ॥
ఆటవెలది : చదువు కోరంగ విడువుము సౌఖ్య మీవు సౌఖ్య మయ్యది కోరంగ చదువు రాదు చదువు సౌఖ్యమ్ములకు సంధి కుదర దెపుడు వెలుగు చీకట్లు యొకచోట కలియ వెపుడు ౮౧
***
యథా ఖాత్వా ఖనిత్రేణ భూతలే వారి విందంతి । తథా గురుగతాం విద్యాం శుశ్రూషు రధిగచ్ఛతి ॥
ఆటవెలది : పలుగు బట్టి భువిని పలుమార్లు త్రవ్వంగ భద్ర జలము లన్ని బయట పడవె అటులె విద్య లన్ని అరసి నేర్వగ వచ్చు శిష్య గణము గురుని సేవ జేసి ౮౨
కాకచేష్టో బకో ధ్యానీ శ్వాన నిద్రస్తథైవ చ । అల్పాహారీ గృహత్యాగీ విద్యార్థీ పంచలక్షణః ॥
ఆటవెలది : వాయసమ్ము వోలె వరమైన యత్నమ్ము కొంగ జపము కనగ కుక్క నిదుర అల్పభోజనమ్ము అల గృహ త్యాగమ్ము సహజ గుణము లయిదు చదువరులకు ౮౩
పఠంతి చతురో వేదాన్ ధర్మశాస్త్రాణ్యనేకశః । ఆత్మానం నైవ జానంతి దర్వీ పాకరసం యథా ॥
ఆటవెలది : వరలు వేద రాశి వల్లించి వల్లించి సకల శాస్త్ర చయము చదివి చదివి ఆత్మ నెరుగ కున్న అసలేమి ఫలమురా వంట గరిట వోలె వ్యర్థ మగును ౮౪
దుర్జనః పరిహర్తవ్యః విద్యయాలంకృతోఽపి సన్ । మణినా భూషితః సర్పః కిమసౌ న భయంకరః ॥
ఆటవెలది : విద్య యున్న నేమి విడువంగ వలెనురా దుర్జనాళి పొందు దుర్భరమ్ము భయము గలుగ జేయు వారి తలపు కూడ మణుల దాల్చి యున్న ఫణుల రీతి ౮౫
Your email address will not be published. Required fields are marked *
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
గూఢచారి లాంటి The Wedding Guest
జీవన రమణీయం-85
‘యాత్ర’ చూద్దామా ఎపిసోడ్-11
నీలమత పురాణం – 52
మానస సంచరరే-30: మనసే అందాల బృందావనం!
All rights reserved - Sanchika™